E-Paper
Advertisement

పశ్చిమ కనుమల్లో వందేభారత్ కనువిందు.. పచ్చని అడవిలో ఎర్రని మెరుపుతీగలా..

పశ్చిమ కనుమల్లో వందేభారత్ కనువిందు.. పచ్చని అడవిలో ఎర్రని మెరుపుతీగలా..
Advertisement

Scenic Vande Bharat: పచ్చని అడవులు.. ఎత్తైన కొండలు.. మలుపులతో కూడిన రైల్వే ట్రాక్.. ప్రకృతి అందాల మధ్య ఎర్రటి రంగులో వయ్యారంగా దూసుకెళ్తున్న వందేభారత్ రైలు.. ఈ దృశ్యం చూస్తే ఎవరికైనా కళ్లు చెదిరిపోవాల్సిందే. పశ్చిమ కనుమల్లో బెంగళూరు నుంచి మంగళూరు వైపు ప్రయాణిస్తున్న వందేభారత్ రైలు ఏరియల్ వ్యూ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటోంది. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ అద్భుతమైన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. పచ్చని అడవి మధ్య రైలు ట్రాక్‌పై వంపులు తిరుగుతూ సాగుతున్న వందేభారత్ అందాన్ని ఈ వీడియో అద్భుతంగా చూపించింది.

ప్రకృతి ఒడిలో వందేభారత్

పశ్చిమ కనుమల అందాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దట్టమైన అడవులు, కొండలు, లోయలు, సొరంగాలు, మలుపులతో కూడిన ఈ ప్రాంతం ప్రకృతి ప్రేమికులకు ఎంతో ఇష్టం. అలాంటి ప్రాంతంలో వందేభారత్ ప్రయాణిస్తున్న దృశ్యం ఇప్పుడు మరింతగా ఆకట్టుకుంటుంది. పై నుంచి చిత్రీకరించిన వీడియోలో పచ్చని చెట్ల మధ్య ఎర్రని రైలు ఒక మెరుపుతీగలా కనిపిస్తోంది. కొండల మధ్య వంగుతూ సాగుతున్న ట్రాక్‌పై వందేభారత్ ఎంతో అందంగా ప్రయాణిస్తోంది. ప్రకృతి అందాలు, ఆధునిక రైలు కలిసి కనిపిస్తున్న ఈ దృశ్యం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Advertisement

ఈ వీడియోను అశ్విని వైష్ణవ్ “New age trains! Make more in India” అనే క్యాప్షన్ తో షేర్ చేశారు. బెంగళూరు–మంగళూరు రైల్వే మార్గంలోని సకలేశ్‌పూర్–సుబ్రహ్మణ్య రోడ్ ఘాట్ సెక్షన్ అత్యంత క్లిష్టమైన ప్రాంతాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ మార్గంలో వందేభారత్ రైలు ప్రయాణానికి సంబంధించిన ట్రయల్స్ జరుగుతున్నాయి. బ్రేకింగ్, స్పీడ్, స్టెబులిటీ, సేఫ్టీ లాంటి అంశాలను పరీక్షిస్తున్నారు.

ఎర్రని మెరుపుతీగలా..

వీడియోలో వందేభారత్ రైలు దట్టమైన పచ్చదనం మధ్య కనిపించే తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దూరం నుంచి చూస్తే అడవిలో ఎర్రని మెరుపుతీగలా వంపులు తిరుగుతూ వెళ్తున్నట్లు అనిపిస్తోంది. రైలు ప్రయాణం అంటే, కేవలం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడం మాత్రమే కాదని, ప్రకృతి అందాలను ఆస్వాదించే అవకాశం ఉంటుందని  ఈ దృశ్యాలు చెబుతున్నాయి.

బెంగళూరు–మంగళూరు ప్రయాణానికి కొత్త అందం

Advertisement

బెంగళూరు నుంచి మంగళూరు వరకు రైల్వే మార్గం పశ్చిమ కనుమల గుండా సాగుతుంది. ముఖ్యంగా ఘాట్ సెక్షన్‌లో సొరంగాలు, వంతెనలు, పదునైన మలుపులు ఉండటంతో ఈ మార్గం అత్యంత అందమైన రైలు ప్రయాణాల్లో ఒకటిగా భావిస్తారు. ఇప్పుడు ఇదే మార్గంలో వందేభారత్ ప్రయాణం మరింత ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. ఆధునిక సాంకేతికతతో కూడిన రైలు, పశ్చిమ కనుమల సహజ సౌందర్యం కలిసిన ఈ వీడియో ప్రస్తుతం అందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది. భారత రైల్వేలో వస్తున్న కొత్త మార్పులకు ఈ దృశ్యం ఓ అందమైన ఉదాహరణగా నిలుస్తోంది.

Read Also: దక్షిణం నుంచి తూర్పు భారతం వరకు.. 7 రాష్ట్రాలను కలిపే కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ ప్రెస్!

Tags

Related News

కదులుతున్న రైల్లో దారుణం.. విద్యార్థికి మద్యం తాగించి, ఆపై..

చరిత్రలో తొలిసారి.. ఏకంగా 1.3 కిలో మీటర్ల పొడవున్న రైల్లో..

ఊబర్‌లో ఒకే రైడ్‌కు వేర్వేరు ధరలు.. ఎక్కువ చెల్లించేలా మానిపులేట్ చేస్తున్న ఏఐ

వందే భారత్ రైళ్లలో ఇదే ఫాస్టెస్ట్.. ఈ రైలు వెరీ స్లో.. ఎందుకంటే?

దక్షిణం నుంచి తూర్పు భారతం వరకు.. 7 రాష్ట్రాలను కలిపే కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ ప్రెస్!

అర్ధరాత్రి నుంచి ఆటోలు, క్యాబ్‌లు బంద్.. ఎందుకంటే?

అమృత్ భారత్ 3.0 వచ్చేస్తోంది.. ఈ రైలు ముందు వందేభారత్ కూడా జుజుబీ!

Big Stories

Advertisement
×