E-Paper
Advertisement

వందే భారత్ రైళ్లలో ఇదే ఫాస్టెస్ట్.. ఈ రైలు వెరీ స్లో.. ఎందుకంటే?

వందే భారత్ రైళ్లలో ఇదే ఫాస్టెస్ట్.. ఈ రైలు వెరీ స్లో.. ఎందుకంటే?
Advertisement

Fastest and Slowest Vande Bharat Trains: భారతీయ రైల్వేలో వందే భారత్ ఎక్స్‌ ప్రెస్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. వేగవంతమైన ప్రయాణం, ఆధునిక సౌకర్యాలతో ఈ రైళ్లు ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి. అయితే, అన్ని మార్గాల్లో వందే భారత్ రైళ్లు ఒకే వేగంతో నడవవు. ట్రాక్ పరిస్థితులు, మలుపులు, వంతెనలు, రద్దీ, స్థానిక పరిస్థితులను ఆధారంగా చేసుకుని ఒక్కో రూట్‌ లో సగటు వేగం మారుతూ ఉంటుంది. కొన్ని మార్గాల్లో రైళ్లు 90 కిలోమీటర్లకు పైగా సగటు వేగంతో దూసుకెళ్తుంటే.. మరికొన్ని మార్గాల్లో 60-70 కిలోమీటర్ల సగటు వేగానికే పరిమితమవుతున్నాయి. ఇంతకీ దేశంలో అత్యంత వేగవంతమైన, అత్యంత నెమ్మదిగా నడిచే వందే భారత్ రైళ్లు ఏవనేది ఇప్పుడు తెలుసుకుందాం..

టాప్‌లో న్యూఢిల్లీ-వారణాసి వందేభారత్

సగటు వేగాన్ని పరిగణనలోకి తీసుకుంటే న్యూఢిల్లీ-వారణాసి వందే భారత్ ఈ లిస్టులో ముందుంది. 771 కిలోమీటర్ల దూరాన్ని సుమారు 8 గంటల్లో పూర్తి చేసే ఈ రైలు సగటున గంటకు 96.37 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఆ తర్వాత హజ్రత్ నిజాముద్దీన్-రాణి కమలాపతి వందే భారత్ ఉంది. ఇది 700 కిలోమీటర్ల దూరాన్ని 7 గంటల 30 నిమిషాల్లో పూర్తి చేస్తూ గంటకు 95.89 కిలోమీటర్ల సగటు వేగాన్ని కలిగి ఉంది. చెన్నై-కోయంబత్తూరు రైలు గంటకు 90.36 కిలోమీటర్ల సగటు వేగంతో ప్రయాణిస్తుంది. సికింద్రాబాద్-విశాఖపట్నం రూట్‌లో సగటు వేగం 84.21 కిలోమీటర్లు కాగా, న్యూఢిల్లీ-అంబ్ అందౌరా రూట్‌లో ఇది 84.85 కిలోమీటర్లుగా ఉంది.

మిడ్ రేంజ్ వేగంతో నడిచే రైళ్లు

Advertisement

కొన్ని వందే భారత్ రైళ్లు 75-82 కిలోమీటర్ల మధ్య సగటు వేగంతో నడుస్తున్నాయి. న్యూఢిల్లీ-శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా సర్వీసు గంటకు 81.87 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. సికింద్రాబాద్-తిరుపతి రూట్‌లో సగటు వేగం 79.63 కిలోమీటర్లు. చెన్నై-మైసూరు వందే భారత్ 79.36 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. నాగ్‌పూర్-బిలాస్‌పూర్ రూట్‌లో 77.92 కిలోమీటర్లు, హౌరా-న్యూ జల్పైగురి రూట్‌లో 76.84 కిలోమీటర్ల సగటు వేగం నమోదవుతుంది.

స్లోయెస్ట్ వందే భారత్ ఇదే!

ఈ లిస్టులో ముంబై-షిర్డీ వందే భారత్ తక్కువ సగటు వేగంతో నడిచే వందేభారత్ గా గుర్తింపు తెచ్చుకుంది. 343 కిలోమీటర్ల దూరాన్ని సుమారు 5 గంటల 20 నిమిషాల్లో పూర్తి చేసే ఈ రైలు సగటున గంటకు 65.96 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ముంబై-సోలాపూర్ వందే భారత్ కూడా గంటకు 71.65 కిలోమీటర్ల సగటు వేగంతో నడుస్తోంది.

రైళ్లు ఎందుకు నెమ్మదిగా నడుస్తాయి?

Advertisement

వందే భారత్ రైళ్ల గరిష్ఠ వేగ సామర్థ్యం ఎక్కువగా ఉన్నప్పటికీ, వాస్తవ ప్రయాణ వేగం పూర్తిగా రైలు సామర్థ్యంపై ఆధారపడదు. ట్రాక్ నాణ్యత, మలుపులు, వాలులు, సిగ్నలింగ్ వ్యవస్థ, రద్దీ లాంటి అంశాలు కీలకంగా ఉంటాయి. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో మలుపులు, ఎత్తుపల్లాలు ఎక్కువగా ఉండటంతో వేగాన్ని తగ్గించాల్సి వస్తుంది. అందుకే కొన్ని రూట్లలో వందే భారత్ తన పూర్తి సామర్థ్యంతో ప్రయాణించలేకపోతోంది.

Read Also: అమృత్ భారత్ 3.0 వచ్చేస్తోంది.. ఈ రైలు ముందు వందేభారత్ కూడా జుజుబీ!

Tags

Related News

కొమ్మల్లో సొమ్ము.. లక్కతో లక్.. చెట్లపై పెరిగే ఈ పురుగులతో బోలెడు ఆదాయం!

భారత్‌లో అత్యంత అందమైన రోడ్లు ఇవే.. ఒక్కసారి జర్నీ చేస్తే మళ్లీ వెళ్లాలనిపిస్తుంది!

వేల అడుగుల లోయలు.. వందల మలుపులు.. ఈ రోడ్లపై డ్రైవింగ్ చాలా డేంజరస్!

నిన్న లీగల్ నోటీసులు.. నేడు భూముల లెక్కలు.. స్వర్ణగిరి ఆలయానికి షాక్ మీద షాక్!

పిడుగు దెబ్బకు ఇండిగో విమానం డ్యామేజ్.. లక్నోలో సేఫ్‌గా ల్యాండింగ్, ఎలా జరిగింది?

ప్రపంచంలోనే బుల్లి నది.. పొడవు కేవలం 20 మీటర్లే.. కనుచూపు మేరలోనే కనుమరుగు!

‘హనుమాన్ అంశ్’ మూవీ ఎఫెక్ట్.. కైంచి ధామ్‌లో ఏకంగా 20 కి.మీ. ట్రాఫిక్ జామ్!

అమ్మబాబోయ్.. ఆర్టీసీ బస్సులో ఇన్ని సౌకర్యాలా? సీటుకో టీవీ, ఎయిర్ హోస్టెస్, నచ్చిన ఆహారం!

Big Stories

Advertisement
×