E-Paper
Advertisement

ఈ దేశాల్లో ప్రజలు పాములనే ఎందుకు తింటారు? సాంప్రదాయమా? ఆరోగ్యం కోసమా?

ఈ దేశాల్లో ప్రజలు పాములనే ఎందుకు తింటారు? సాంప్రదాయమా? ఆరోగ్యం కోసమా?
Advertisement

మనం పాములను చూడగానే.. వామ్మో అని పరుగులు పెడతాం. కానీ, ఆ దేశాల ప్రజలు మాత్రం. తమకు ఆహారం దొరికిందని సంబరపడిపోతారు. వెంటనే దాని పట్టేసుకుని.. వండేసుకుని తినేస్తారు. ఇది మనకు వింతగా అనిపించినా.. అక్కడ మాత్రం అది వారికి ఒక సాంప్రదాయం. కొందరికైతే అది లగ్జరీ వంటకం. ముఖ్యంగా ఆసియా దేశాల్లో ఈ సంస్కృతి ఎక్కువగా కనిపిస్తుంది. మరి ఏయే దేశాల్లో ప్రజలు పాములను లొట్టలేసుకుని మరి తీనేస్తారో చూద్దాం. అంతేకాదు.. వాటిని మాత్రమే తినడం వెనుక హెల్త్ సీక్రెట్స్, వాటి రుచి గురించి కూడా తెలుసుకుందాం.

చైనాలో 2000 ఏళ్ల నుంచి..

చైనాలో పాము మాంసాన్ని తినే సంస్కృతి దాదాపు 2 వేల ఏళ్ల నుంచి నడుస్తుందట. అక్కడ పాము మాంసాన్ని డ్రాగాన్ మీట్ అని పిలుస్తారు. ముఖ్యంగా చలికాలంలో.. శరీరాన్ని వెచ్చగా ఉంచడం కోసం పాము మాంసాన్ని తింటారట. ఇక్కడ స్నేక్ సూప్ బాగా ఫేమస్. దీన్ని రెండు లేదా మూడు రకాల పాముల మాంసంతో తయారు చేస్తారు. పాముతోపాటు చిన్న చిన్న చికెన్ పీసులు, పుట్టగొడుగులు, అల్లం, నిమ్మ ఆకులు కూడా వేసి సూప్‌ను బాగా మరిగిస్తారు. ఇది చూడటానికి చికెన్ సూప్‌లా ఉంటుంది. కానీ, కాదు. మీరు ఎప్పుడైనా చైనా వెళ్లినప్పుడు.. అది ఏ సూప్? అందులో పాము మాంసం ఉందా లేదా అని తెలుసుకుని మరీ తాగండి.

వియత్నాంలో కోళ్లఫారాల తరహాలో పాముల పెంపకం

Advertisement

వియత్నాం ప్రజలకు పాములంటే చాలా పిచ్చి. దాన్ని ఒక గొప్ప రుచికరమైన వంటకంగా భావిస్తారు. ఇక్కడి ప్రజలు అడవుల్లోకి వెళ్లి పాములను పట్టుకుంటారు. తర్వాత వాటిని ప్రత్యేకంగా పెంచుతారు. దాన్ని వారు స్నేక్ విలేజ్ అంటారు. వియత్నాంలోని లీ మాట్ గ్రామం దీనికి ప్రసిద్ధి. పాము మాంసంలో నిమ్మగడ్డి, పచ్చి మిర్చి వేసి బాగా ఫ్రై చేసుకుని తింటారు. కొందరైతే ఆవిరిపై ఉడికించి తింటారు. మరో చిత్రం ఏమిటంటే.. బతికున్న పాము రక్తాన్ని, గుండెను రైస్ వైన్‌లో వేసుకుని మరి తాగుతారు. దానివల్ల శరీరాక శక్తి పెరుగుతుందని వారి నమ్మకం.

ఇండోనేషియాలో ఇది సర్వసాధారణం

ఇండోనేషియాలోని జాకార్త వంటి నగరాల్లో పాము వంటకాలు సర్వసాధారణం. ఇక్కడి నగరాల్లో రాత్రిపూట రోడ్డు పక్కన ఉండే ఫుడ్ స్టాల్స్‌లో పాము మాంసం లభిస్తుంది. నాగుపాములు, కొండ చిలువలను ఇక్కడి ప్రజలు ఇష్టంగా తింటారు. ఇక్కడ స్నేక్ సాటే అనే పాము వంటకం బాగా ఫేమస్. పాము మాంసం ముక్కలను కబాబ్‌లా పుల్లలకు గుచ్చి, నిప్పులపై కాల్చి.. ప్రత్యేకమైన పల్లీల సాస్‌తో వడ్డిస్తారు.

అమెరికావాళ్లేమీ అమాయకులు కారు

Advertisement

ఆసియా ప్రజలు మాత్రమే పాములను తింటారు.. ప్రపంచమంతా అనుకుంటోంది. కానీ, అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా పాములను ఆహారంగా తినేవాళ్లు ఉన్నారు. టెక్సాస్, ఒక్లహోమా వంటి దక్షిణ రాష్ట్రాల్లోని కొంతమంది ప్రజలు రాటిల్ స్నేక్‌ను ఇష్టంగా తింటారు. అక్కడ ఏటా ‘రాటిల్ స్నేక్ రౌండప్స్’ అనే ఉత్సవాలు జరుగుతాయి. ఇందులో పాములను పట్టుకుని.. మైదా పిండిలో ముంచుకుని డీప్ ఫ్రై చేస్తారు. దీన్ని ‘సదరన్ ఫ్రైడ్ రాటిల్ స్నేక్’ అని పిలుస్తారు.

పాములను తినడం ఆరోగ్యకరమా? ప్రచారంలో ఉన్న అపోహలు ఇవే

చైనా వైద్య సాంప్రదాయాల ప్రకారం.. పాము మాంసం కేవలం ఆహారమే కాదు.. అదొక ఔషదం కూడా. పాముల్లో అధిక ప్రోటీన్, తక్కువ కొలెస్ట్రాల్ ఉంటుందనేది వారి నమ్మకం. పాము మాంసంతో చేసిన సూప్ తాగడం వల్ల కీళ్ల నొప్పులు, ఎముకుల బలహీనత వంటి సమస్యలు దరిచేరవని నమ్ముతారు. జీవశక్తిని పెంచడమే కాకుండా రక్త ప్రసరణ మెరుగుపరుస్తుందని భావిస్తారు. పాము మాంసం తినడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుందని అక్కడి మహిళలు నమ్ముతున్నారు.

ఇది వారి సాంప్రదాయ ఆహారమా?

ఆసియా దేశాల్లో పాములను తినడం అనేది సాంప్రదాయంగానే భావిస్తారు. అయితే, ఇండియాలో చికెన్, మటన్ తరహాలో రెగ్యులర్ లేదా సాధారణ ఆహారం కాదు. ముఖ్యంగా చైనా, వియత్నాం దేశాల్లో దీన్ని లగ్జరీ వంటకంగా చూస్తారు. ముఖ్యంగా చలికాలంలో కుటుంబ సభ్యులంతా కలిసి రెస్టారెంట్లకు వెళ్లి స్పేక్ సూప్‌ను ఆస్వాదిస్తారు. ఇండోనేషియా తదితర ప్రాంతాల్లో మాత్రం వీటిని రెగ్యులర్‌గానే తింటారు. ఈ వివరాలు మీకు కేవలం అవగాహన కోసమే అందిస్తున్నాం. వన్యప్రాణులను చంపడం, ఆహారంగా తినడం చట్టరీత్యా నేరం.

Also Read: అంబులెన్స్‌ పదానికి అసలు అర్థం ఇదే, అలా పుట్టి.. ఇలా వాడుకలోకి వచ్చింది!

Tags

Related News

స్కూల్ బస్సులకు పసుపు రంగే ఎందుకు? దీని వెనుక ఏవైనా కారణాలు ఉన్నాయా?

నల్లగొండ జిల్లాలో ఇంత అందమైన జలపాతం ఉందా? వర్షాకాలంలో ఒక్కసారైనా వెళ్లాల్సిందే!

Gachibowli History: ఏంటీ.. గచ్చిబౌలి చరిత్ర ఇదా, ఆ పేరు రావడానికి కారణం ఇదేనట.. అద్భుతం కదూ!

తక్కువ బడ్జెట్‌లో వర్షాకాల ట్రిప్.. భారత్‌లో అందమైన ప్రదేశాల టూర్ సగం ధరలోనే

టికెట్ లేకున్నా వారిని రైల్లో నుంచి దించకూడదట, ఇండియన్ రైల్వేలో చాలామందికి తెలియని సేఫ్టీ రూల్..

బహామాస్‌‌లో ఘోర ప్రమాదం.. సముద్రంలో కూలిన విమానం.. 10 మంది మృతి, ఎలా జరిగింది?

విమానం గాల్లో ఉండగానే పగిలిన కిటికీ, ఆ విండో నుంచి పాసింజర్ సగానికి పైగా బయటకు, ఆ తర్వాత ఏం జరిగిందంటే

Big Stories

Advertisement
×