E-Paper
Advertisement

రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలనేది కాంగ్రెస్ గుడ్డి ఆరాటం: రాంచందర్ రావు!

రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలనేది కాంగ్రెస్ గుడ్డి ఆరాటం: రాంచందర్ రావు!
Advertisement

Ramchander Rao: స్వేచ్చ బ్యూరో: రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలనే గుడ్డి ఆరాటంతో దేశంలో అరాచకం సృష్టించేందుకు కాంగ్రెస్, ఇండీ కూటమి పార్టీలు కుట్ర పన్నుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు విమర్శించారు. అందుకోసమే.. ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు, చివరకు రాష్ట్రపతి కార్యాలయం వంటి రాజ్యాంగ సంస్థల విశ్వసనీయతపై ప్రజల్లో విషం చిమ్ముతున్నారని ఫైరయ్యారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఉత్తర్వులు జారీ..

ఫారమ్-6, ఫారమ్-7లను ఏదో భూతంలా చూపిస్తూ ఓట్లను అక్రమంగా తొలగిస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, 2018 సెప్టెంబర్ 26 నాడే ఎన్నికల సంఘం దీనిపై స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసిందని వివరించారు. కేంద్ర ఎన్నికల సంఘంలో ఎన్నికల కమిషనర్ల మధ్య విభేదాలు ఉన్నాయని రాహుల్ గాంధీ ప్రచారం చేయడం పచ్చి అబద్ధమని, 2025 జూన్ 24న బీహార్‌లో జరిగిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎన్నికల కమిషన్ ఏకగ్రీవ నిర్ణయంతోనే జరిగిందన్నారు. 2026 మే 27న సుప్రీంకోర్టు సైతం ఈ ఏకగ్రీవ నిర్ణయాన్ని సమర్థించిందని, కమిషనర్ల మధ్య సమ్మతి లేదనేది కాంగ్రెస్ చేస్తున్న అబద్ధపు ప్రచారం మాత్రమేనని వెల్లడించారు.

అసదుద్దీన్ ఒవైసీ..

Advertisement

2018లో స్వయంగా రాహుల్ గాంధీ, అభిషేక్ మను సింఘ్వీలే తెలంగాణలో 70 లక్షల బోగస్ ఓట్లు ఉన్నారని మొత్తుకున్నారని, మరి ఇప్పుడు ప్రక్షాళన చేస్తుంటే ఉలికిపాటు ఎందుకని రాంచందర్ రావు ప్రశ్నించారు. అసదుద్దీన్ ఒవైసీ ఒత్తిడికి తలొగ్గిన రాష్ట్ర ప్రభుత్వం.. బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తోందని, దొంగ ఓట్లతోనే ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్ పబ్బం గడుపుకుంటున్నాయని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేత పవన్ ఖేరా 13.3 కోట్ల మంది ఓట్లను తొలగించారని దుష్ప్రచారం చేస్తున్నారని, వాస్తవానికి ఇందులో 71 శాతం(9.5 కోట్లు) నివాసాలు మారిన వారు లేదా అందుబాటులో లేనివారు, 20 శాతం(2.7 కోట్లు) మరణించిన వారు, 7.6 శాతం (దాదాపు కోటి మంది) డూప్లికేట్ లేదా మల్టిపుల్ ఎంట్రీలు ఉన్నవారని వివరించారు.

Also read: వరంగల్ నుంచి వచ్చిన ఈ అమ్మాయి.. ఒక్క సినిమాకు లక్షల్లో రెమ్యునరేషన్!

ఫారమ్-6 మార్పులపై..

Advertisement

ఫారమ్-7 సమర్పించడం నేరం కాదని, ఒక ప్రాంతంలో ఓటరు లేడని లేదా చనిపోయాడని భావించినప్పుడు ఏ పౌరుడైనా, రాజకీయ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్ అయినా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఫారమ్-7 ఇవ్వొచ్చన్నారు. దరఖాస్తు ఇచ్చినంత మాత్రాన వెంటనే ఓట్లు తొలగిపోవన్నారు. ఫారమ్-6 మార్పులపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను కూడా కాంగ్రెస్ వక్రీకరిస్తోందని రాంచందర్ రావు మండిపడ్డారు. దేశంలోని నిజమైన పౌరుడి ఓటును తొలగించే హక్కు ఎవరికీ లేదని, కానీ రోహింగ్యాలు, బంగ్లాదేశీయుల అక్రమ ఓట్లు ఉంటే మాత్రం తొలగిస్తారని రాంచందర్ రావు స్పష్టంచేశారు.

బీహార్ బస్తీలో..

ఇదిలాఉండగా మెట్టుగూడలో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో రహదారి భద్రతపై నిర్వహించిన చైతన్య కార్యక్రమానికి రాంచందర్ రావు హాజరయ్యారు. అంతేకాకుండా సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా మల్కాజ్‌‌గిరి బీహార్ బస్తీలో అంగన్‌వాడీ పిల్లలు, కార్యకర్తలతో నిర్వహించిన కార్యక్రమానికి సైతం రాంచందర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్నారులకు పౌష్టికాహారంతో పాటు పాఠశాల బ్యాగులు, పుస్తకాలు, విద్యా సామగ్రి పంపిణీ చేసినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా చిన్నారుల సంక్షేమం, మహిళా సాధికారతకు తోడ్పడేలా అంగన్ మిలాన్ సేవా అభియాన్ కార్యక్రమాలను విస్తృతంగా చేపడుతున్నామని తెలిపారు.

Also read: స్కూళ్లలో రాజ్యాంగ పీఠికను తప్పనిసరి చేయలేం.. సుప్రీంకోర్టు సంచలనం!

Tags

Related News

హైదరాబాద్‌లో చిన్నారుల కిడ్నాప్ యత్నం.. చితకబాదిన స్థానికలు!

ట్రెయినీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై.. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

రేవంత్, కేటీఆర్ ఆస్తుల చిట్టాల డ్రామా.. ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఫైర్!

రాహుల్ గాంధీ పిరికి వ్యక్తి.. అప్రజాస్వామికవాది.. కేటీఆర్ ఘాటు విమర్శలు

రాజన్న గుడికి కాంక్రీటా?.. భక్తుల విశ్వాసాలను దెబ్బతీయొద్దు.. కల్వకుంట్ల కవిత ఫైర్

బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ అరెస్ట్!

Big Stories

Advertisement
×