Worst Railway Stations: గత దశాబ్దకాలంగా రైల్వే వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం. అత్యాధునిక వందేభారత్ రైళ్లు అందుబాటులోకి రాగా, త్వరలో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ రైళ్లు పట్టాలు ఎక్కబోతున్నాయి. విమానం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించే హైపర్ లూప్ ట్యూబ్ టెక్నాలజీ శరవేగంగా డెవలప్ అవుతోంది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన్ హైపర్ లూప్ ట్యూబ్ తయారు చేసిన దేశంగా భారత్ ఘనత సాధించబోతోంది. ఇక రైల్వే స్టేషన్లను అద్భుతంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్టేషన్స్ అనే పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లను అత్యాధునిక సౌకర్యాలతో పునర్నిర్మాణం చేపడుతున్నారు. అయినప్పటికీ, కొన్ని రైల్వే స్టేషన్లను ఇప్పటికీ అత్యంత చెత్త రైల్వే స్టేషన్లను గా కొనసాగుతున్నాయి. దేశంలోనే అత్యంత దర్టీ రైల్వే స్టేషన్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..
⦿ పాట్నా జంక్షన్ (బీహార్)
విపరీతమైన రద్దీ, కొరవడిన పారిశుధ్యం, సరైన మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఈ రైల్వే స్టేషన్ దేశంలోనే అత్యంత చెత్త రైల్వే స్టేషన్లలో ఒకటిగా కొనసాగుతోంది. ఈ రైల్వే స్టేషన్ లో తరచుగా దొంగతనాలు జరుగుతుంటాయి. అనధికారికంగా ఇక్కడ తినుబండారాలు, పండ్లు సహా ఇతర వస్తువుల అమ్మకాలు కొనసాగుతాయి. ఇప్పటికే ఈ విషయం అధికారులు దృష్టికి వెళ్లి.. శుభ్రతపై ఫోకస్ పెట్టాలని స్టేషన్ సిబ్బందింని ఆదేశించినప్పటికీ, సరైన నీట్ నెట్ కనిపించడం లేదు.
⦿మొఘల్సరాయ్ జంక్షన్ (ఉత్తరప్రదేశ్)
దేశంలోని అత్యంత రద్దీగా ఉండే స్టేషన్లలో ఒకటిగా కొనసాగుతోంది. మురికితో నిండిన ప్లాట్ ఫారమ్‌లు, వ్యర్థాలను తొలగించడంలో నిర్లక్ష్యం కారణంగా తరచుగా విమర్శలకు గురవుతుంది. ఇక్కడ జేబు దొంగతనాలు, లగేజీ దొంగతనాలు, అధిక రేట్లకు వస్తువుల విక్రయం ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. ఇక్కడి వాష్ రూమ్ లు, వెయిటింగ్ రూమ్ లు దారుణంగా ఉంటాయి.
⦿ మధుర జంక్షన్ (ఉత్తరప్రదేశ్)
యుపిలోనే అత్యాంత ప్రధానమైన రైల్వే స్టేషన్లలో ఇదీ ఒకటి. విపరీతమైన మురికి, అపరిశుభ్రమైన టాయిలెట్లు, అపరిశుభ్రమైన ఆహార దుకాణాలు దర్శనం ఇస్తాయి. స్టేషన్ ప్రాంగణంలో కోతులు, ఆవుల సహా ఇతర జంతువులు తిరగాడుతుంటాయి.
⦿ సీల్దా రైల్వే స్టేషన్ (పశ్చిమ బెంగాల్)
ఇక్కడ కూడా రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ శుభ్రత మర్చుకైనా కనిపించదు. మురికితో నిండిన ప్లాట్ ఫారమ్ లు, చెత్తతో నిండిన ట్రాక్ లు కనిపిస్తాయి. ఇక్కడ మౌలికస సదుపాయాల నిర్వహణ దారుణంగా ఉంటుంది.
Read Also: సికింద్రాబాద్ నుంచి మరో 9 రైళ్ల దారిమళ్లింపు, సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం!
⦿ గోరఖ్ పూర్ జంక్షన్ (ఉత్తరప్రదేశ్)
ప్రపంచంలోనే అత్యంత పొడవైన ప్లాట్ ఫారమ్ ఉన్నప్పటికీ, స్టేషన్ లో పరిశుభ్రత, మౌలిక సదుపాయాల సమస్యలు ఉన్నాయి. తాగునీరు, పారిశుధ్య సౌకర్యాలు దారుణంగా ఉంటాయి. అనధికార విక్రేతలు, యాచకులు ఉండటం ప్రయాణికులకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది.
గత కొద్ది కాలంగా ఈ రైల్వే స్టేషన్లలోనూ స్వచ్ఛ భారత్ అభియాన్ ద్వారా మౌలిక సదుపాయాలను మెరుగు పరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. పరిశుభ్రత, భద్రత, సౌకర్యాలను మెరుగుపరిచేందుకు కీలక చర్యలు తీసుకుంటున్నది.
Read Also: ‘రాధేశ్యామ్’ పూజా హెగ్డేలా రైలుకు వేలాడింది.. సొరంగం రావడంతో..