E-Paper
Advertisement

బిగ్‌బాస్ 10లో అసలు ఆట మొదలైంది.. ఈసారి నాగ్ ప్లాన్ మామూలుగా లేదుగా!

బిగ్‌బాస్ 10లో అసలు ఆట మొదలైంది.. ఈసారి నాగ్ ప్లాన్ మామూలుగా లేదుగా!
Advertisement

Bigg Boss Telugu Season 10:ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ అతి తొందరలోనే ఆడియన్స్ ని పలకరించేందుకు సిద్ధం అయిపోతుంది.ఇప్పటికే తొమ్మిది సీజన్స్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ పాపులర్ ఎంటర్ టైన్ మెంట్ షో ఇపుడు పదో సీజన్ ని మొదలెట్టుకోబోతుంది.ఇక ఇదే క్రమంలో ఈ షో నుండి ఇంట్రెస్టింగ్ న్యూస్ రావడంతో మరోసారి ఈ క్రేజీ ఎంటర్ టైన్ మెంట్ షో ఇపుడు మరోసారి నెట్టింట వైరల్ గా మారింది.

మరోసారి హోస్ట్‌గా నాగార్జున

ముఖ్యంగా ఈ సీజన్‌కు కూడా అక్కినేని నాగార్జునే హోస్ట్‌గా చేయబోతుండటతో అటు బిగ్ బాస్ అభిమానుల్లో, అటు అక్కినేని అభిమానుల్లో ఈ షో పై మరింత ఆసక్తి పెరిగింది. ఇప్పటి వరకు నాగార్జున హోస్టింగ్‌లో బిగ్‌బాస్‌లో ఉన్న కంటెస్టెంట్ పై వేసిన పంచ్‌లు, కౌంటర్లు ఆడియన్స్ అంత ఈజీగా మర్చిపోలేరు కూడా .అందువల్లే మరోసారి నాగ్ ఈ షో ని హోస్ట్ చేయబోతుండటంతో బిగ్ బాస్ పై అంచనాలు మరోసారి పెరిగిపోయాయి.మొత్తంగా చూస్తే ఈ పదో సీజన్ లో కూడా నాగ్ యాంకరింగ్ మరోసారి హైలెట్ గా నిలవబోతుందన్న మాట.

ఈసారి ‘దశావతారం’ కాన్సెప్ట్!

Advertisement

అయితే ఈసారి బిగ్‌బాస్ షోను సాధారణ సీజన్‌లా కాకుండా ‘దశావతారం’ కాన్సెప్ట్‌తో డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంటే ఒకే ఫార్మాట్‌లో మొత్తం సీజన్ నడవకుండా.. ప్రతి వారం కొత్త మలుపు, కొత్త రూల్, కొత్త టాస్క్ లేదా కొత్త ట్విస్ట్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నారన్న మాట
ఇందులో బిగ్‌బాస్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో కంటెస్టెంట్లకే కాదు.. ప్రేక్షకులకు కూడా అర్థం కాని విధంగా గేమ్‌ను మార్చే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.

‘ఆటలో సవాల్ కాదు.. ఆటే సవాల్’

ఈ కాన్సెప్ట్‌కు తగ్గట్టుగానే “ఆటలో సవాల్ కాదు.. ఆటే సవాల్” అనే కొత్త ట్యాగ్‌లైన్‌ను కూడా తీసుకొచ్చారు నిర్వాహకులు. ఈ ఒక్క లైన్‌తోనే సీజన్ 10లో గేమ్ ఎంత టఫ్‌గా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకు టాస్కుల్లో గెలవడమే ప్రధాన లక్ష్యంగా ఉండేది. కానీ ఈసారి ఇంట్లో ఉండటం, రోజువారీ పరిస్థితులను ఎదుర్కోవడం, ఇతర కంటెస్టెంట్లతో సంబంధాలు కొనసాగించడం కూడా గేమ్‌లో భాగం కానున్నట్లు తెలుస్తోంది.

కంటెస్టెంట్ల విషయంలోనూ కొత్త ప్రయోగం

Advertisement

ఇక కంటెస్టెంట్ల ఎంపిక విషయంలోనూ ఈసారి మేకర్స్ కొత్త ప్రయోగం చేస్తున్నారు. సినీ, టీవీ రంగానికి చెందిన పలువురు సెలబ్రిటీలను ఇప్పటికే సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు సామాన్యులకు కూడా బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లే అవకాశం కల్పించేందుకు ‘అగ్నిపరీక్ష’ పేరుతో ప్రత్యేక ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా బిగ్‌బాస్‌లోకి రావాలని ఆశ పడేవారికి కామన్ పీపుల్‌లో టాలెంట్ ఉన్నవాళ్లను గుర్తించే ప్రయత్నం జరుగుతోంది.

‘అగ్నిపరీక్ష’కు జడ్జిలుగా మాజీ కంటెస్టెంట్లు

ఈ అగ్నిపరీక్షకు బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్లు నవదీప్, బిందు మాధవి, అభిజీత్‌లు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు .
. గతంలో బిగ్‌బాస్ హౌస్‌లో ఉండి గేమ్‌ను దగ్గరగా చూసిన వీరికి.. కొత్త కంటెస్టెంట్లలో ఎవరు గేమ్ ఆడగలరు, ఎవరిలో ఎంటర్‌టైన్మెంట్ ఉంది, ఎవరు ఒత్తిడిని తట్టుకోగలరు అనే విషయాలపై మంచి అవగాహన ఉంటుందనేది అందరికి తెలిసిందే.

ALSO READ:సమంత కొత్త అవతారం.. ఈసారి వంటగదిలోకి స్టార్ హీరోయిన్!

సెప్టెంబర్‌లో సీజన్ 10 ప్రారంభం!

ఇక సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ప్రారంభం కానుందన్న సంగతి తెలిసిందేమొత్తానికి బిగ్‌బాస్ సీజన్ 10పై ఇప్పటి నుంచే హైప్ పెరుగుతోంది. దశావతారం థీమ్, పదింతల డ్రామా, కొత్త టాస్కులు, సామాన్యులకు అవకాశం, నాగార్జున హోస్టింగ్.. ఇవన్నీ కలిస్తే ఈసారి షో మరింత రసవత్తరంగా మారే ఛాన్స్ పుష్కలంగా ఉంది. చూడాలి మరి ‘అగ్నిపరీక్ష’ నుంచి ఎవరికి అవకాశం దక్కుతుందో ..ఎవరెవరు హౌస్‌లోకి ఎవరెవరు అడుగుపెట్టబోతున్నారో !

Tags

Related News

నా మొదటి లక్ష్యం అదే.. నిజాలు బయటకొస్తాయ్ – యూట్యూబర్ నందన!

బిగ్ బాస్ 10.. ఈ వారం నామినేషన్ లోకి 9మంది.. మరి డేంజర్ జోన్ లో?

Gundeninda GudiGantalu Today episode: చింతామణికి దిమ్మతిరిగే షాక్.. మీనా ఫుల్ హ్యాపీ.. ఇది కదా అసలు ట్విస్ట్..

Podarillu Today Episode : చక్రీ మాటతో గోపిక షాక్.. బాధపడ్డ మాధవ్.. లక్కీ, విక్కీ లవ్ ట్రాక్..

మా బంధం ముగిసిపోయింది..రీతూ – పవన్ బ్రేకప్.. ఏమైందంటే..?

Illu Illaalu pillalu Srivalli : శ్రీవల్లి అవుట్.. చందుకు కొత్త జోడిగా ఎవరంటే..?

Illu Illalu Pillalu Today Episodes: భద్రకు ప్రేమ దిమ్మతిరిగే షాక్.. తండ్రిగా మారిన తిరుపతి.. వల్లికి కొత్త టెన్షన్..

Intinti Ramayanam Today Episode: మీనాక్షిని మోసం చేసిన పల్లవి.. పార్వతికి పల్లవి పై అనుమానం.. కమల్ కు షాక్..

Big Stories

Advertisement
×