E-Paper
Advertisement

అగ్గిపెట్టి మచ్చ చివరి కోరిక అదే.. కన్నీళ్లు పెట్టుకున్న ఉప్పల్ బాలు, వైజాగ్ సత్య!

అగ్గిపెట్టి మచ్చ చివరి కోరిక అదే.. కన్నీళ్లు పెట్టుకున్న ఉప్పల్ బాలు, వైజాగ్ సత్య!
Advertisement

Aggipetti Maccha:సోషల్ మీడియాలో తనదైన కామెడీతో ఎంతోమందిని నవ్వించిన అగ్గిపెట్టి మచ్చ తాజాగా కన్నుమూసిన సంగతి తెల్సిందే. ఇక ఎప్పుడూ ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ, తనదైన యాసతో నవ్వులు పూయించే కిరణ్ కుమార్ అలియాస్ అగ్గిపెట్టి మచ్చ మరణంతో అభిమానులు విషాదంలో మునిగిపోయారు. అయితే, అగ్గిపెట్టి మచ్చ కి ఎప్పుడు దగ్గరగా ఉండే ఉప్పల్ బాలు, వైజాగ్ సత్య తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని అతడి గురించి చెబుతూ కన్నీళ్ళు పెట్టుకున్నారు.

నిజానికి అగ్గిపెట్టి మచ్చ అంటే సోషల్ మీడియాలో తెలియని వాళ్లు ఎవరూ ఉండరనే చెప్పాలి. ముఖ్యంగా ఆయన మాట్లాడే విధానం, టైం వచ్చినప్పుడు వేసే పంచ్‌లు ప్రేక్షకులను బాగా నవ్వించేవి. ఇక ఆయన చెప్పే డైలాగులు నెట్టింట్లో మీమ్స్‌ రూపంలో తెగ చక్కర్లు కొడుతుంటాయి కూడా.

Advertisement

ఇక ఉప్పల్ బాలు, వైజాగ్ సత్యతో మచ్చకు దాదాపు పదేళ్ల స్నేహం ఉందన్న సంగతి తెల్సిందే. 2016 నుంచి ముగ్గురూ కలిసి ఎన్నో వీడియోలు, యూట్యూబ్ షోలు, షూటింగులు కలిసి చేశారు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి వినోద కార్యక్రమాలతో పాటు ఇతర షోలలోనూ కలిసి పనిచేసిన రోజులను వారు గుర్తుచేసుకున్నారు. హైదరాబాద్‌కు వచ్చినప్పుడల్లా ఉప్పల్ బాలు ఇంట్లోనే ఉండేవాడని, తమ మధ్య అంత మంచి అనుబంధం ఉండేదని చెప్పుకొచ్చాడు బాలు.

ఇక మచ్చ ఆరోగ్యం బాగోలేదని తెలిసినప్పుడువెంటనే ఆసుపత్రికి వెళ్లానని, అక్టోబర్ 5న జ్వరం, తలనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో చేర్పించినట్లు సత్య చెప్పుకొచ్చాడు . అక్కడ మచ్చకు మెదడుకు సంబంధించిన సమస్య ఉన్నట్లు వైద్యులు చెప్పారని, ఆపరేషన్ చేసినా ఫలితం లేకపోయిందని వివరించాడు. అక్టోబర్ 7న మధ్యాహ్నం 3.30 గంటలకు మచ్చ చనిపోయినట్లు చెప్పాడు.

Advertisement

ఇక మచ్చ చివరి కోరిక గురించి సత్య చెబుతూ చాలాకాలంగా ఉప్పల్ బాలు, వైజాగ్ సత్యలను కలవలేకపోయిన మచ్చ.. వాళ్లను చూడాలని తన అక్కతో చెప్పాడని, ముఖ్యంగా బాలు దగ్గరకు వెళ్లాలని, సత్యను కూడా చూడాలని అనుకున్నాడని చెబుతూ ఎమోషనల్ అయ్యారు . కానీ ఆ కోరిక పూర్తిగా నెరవేరకుండానే మచ్చ చనిపోయాడని బాధ పడిపోయారు.

ఇక ఆసుపత్రిలో మచ్చను చూసినప్పుడు అతడి చేతిని పట్టుకుని ఏడ్చానని ,ఆ క్షణాలను తలుచుకుంటే ఇప్పటికీ బాధ కలుగుతోందని వివరించాడు. స్నేహితుడిని చివరిసారిగా చూసే అవకాశం దక్కినా, అతడిని కోల్పోయిన బాధ మాత్రం తీరదని బాధ పడిపోయాడు .

మరోవైపు ఉప్పల్ బాలు మాట్లాడుతూ తాను పిలిస్తే షూటింగ్‌కు వచ్చేవాడని, భోజనం చేయమంటే తినేవాడని చెప్పాడు. తన వెంటే తిరుగుతూ సరదాగా ఉండేవాడని, తన బ్యాగులో డబ్బులు ఉన్నాయా లేదా అని కూడా చూసేవాడని అప్పటి రోజులని గుర్తు చేసుకున్నాడు.

మచ్చ గురించి సత్య మాట్లాడుతూ ఆయనకు ఎవరితోనూ గొడవలు పెట్టుకునే మనస్తత్వం లేదని, అందరితో సరదాగా కలిసిపోయేవాడని తెలిపాడు. తనదైన కామెడీతో చాలామందిని దగ్గర చేసుకున్నాడని అన్నాడు. మచ్చ అంత్యక్రియలకు పెద్ద సంఖ్యలో అభిమానులు రావడం చూసి తాను ఆశ్చర్యపోయానని కూడా చెప్పుకొచ్చాడు. సోషల్ మీడియాలో కనిపించే ఆదరణకు మించి ఆయనను అభిమానించే వాళ్లు ఎంతోమంది ఉన్నారని ఆ సమయంలో తెలిసిందని వివరించాడు.

మొత్తానికి, అందరినీ నవ్వించిన అగ్గిపెట్టి మచ్చ జీవితంలో ఇన్ని అనుబంధాలు ఉన్నాయని చనిపోయిన  తర్వాత ఉప్పల్ బాలు,సత్య  మాటలను బట్టి తెలుస్తోంది.

ALSO READ :చిరుత హీరోయిన్ అందాల విందు.. ఇన్‌స్టాలో హాట్ టాపిక్!

Tags

Related News

అగ్గిపెట్టి మచ్చ అంత్యక్రియల్లో అసలేం జరిగింది? బయటపెట్టిన వైజాగ్ సత్య!

ఓడిపోయిన చోటే గెలిచి చూపించాను.. అసలైన విజయం అదే అంటున్న సాయి పల్లవి!

సింగర్ కనకవ్వ ఒక్కో పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

జూనియర్ బాలు అనుకుంటే ఇలా దొరికిపోయాడేంటి.. సరిగమపలో దైవిక్‌కు షాక్!

టీవీలోకి ‘మా ఇంటి బంగారం’ మూవీ.. ఎప్పుడు ఏ ఛానల్ లో చూడొచ్చంటే?

ఈవారం కెప్టెన్సీ వారి చేతుల్లోనే.. కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ భారీ షాక్!

రోహిత్ షాలిని పెద్ద ము**లు.. ఫైర్ అయిన మాజీ కంటెస్టెంట్!

Big Stories

Advertisement
×