Robot Harassment: రోబో అంటే ఏంటి..? మనిషి చెప్పిన పని చేసే మిషెన్. కానీ అదే రోబో ఓ అమ్మాయిని వేధించిందంటే నమ్ముతారా..? జర్మనీలో ఇప్పుడు ఇదే షాకింగ్ కేసు కలకలం రేపుతోంది. కొలోన్‌లో ఫాస్ట్‌ఫుడ్ రెస్టారెంట్ బయట 16ఏళ్ల బాలిక తన ఫ్రెండ్స్‌తో కబుర్లు చెప్పుకుంటోంది. సడెన్‌గా ఎంట్రీ ఇచ్చింది ఓ రోబో.. కాస్త ముందుకొచ్చి.. ఆ బాలికను అసభ్యంగా తాకింది.ఒక్క క్షణంలో ఆ అమ్మాయి షాక్ అయ్యింది. పక్కన ఉన్నవాళ్లంతా స్టన్ అయ్యారు. అసలు ఆ రోబో తనంతట తానే అలా చేసిందా.. లేదంటే ఎవరైనా దానితోఅలా చేయించారా?
ఈ తతంగాన్నంతా వీడియో తీశారు.. అంతటితో ఆగకుండా సోషల్ మీడియాలో లైవ్ స్ట్రీమింగ్ కూడా చేశారు. నవ్వుతూ, ఎంటైర్టైన్మెంట్ కోసం ఓ అమ్మాయి పరువుతో ఆటలా? లైక్స్ కోసం ఎంతకైనా తెగిస్తారా? ఎవరు బాధపడినా.. ఎవరి భయపడినా వీళ్లకు పట్టదా? ఆ విజువల్స్ చూసి పోలీసులు చూసి లైక్ కొట్టలేదు. లాఠీలుపట్టుకొని వెళ్లారు. వాళ్లని పట్టుకొని కారు డిక్కీ తెరిచారు.. ఆ డిక్కీలో ఉన్న రోబోతో పాటు మూడు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రోబో యజమానితోపాటు అతడి స్నేహితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.
రోబోకు తప్పు చేయాలన్న ఆలోచన ఉండదు.. కమాండ్ ఇస్తే కదులుతుంది. కాబట్టి ఈ కేసులో అసలు ఫోకస్ మిషన్ మీద కాదు.. దాని వెనుక ఉన్న మనుషుల మీదేనే.. ఇప్పుడు పోలీసుల ముందున్న మిలియన్ డాలర్ క్వశ్చన్ ఒక్కటే.. రోబోను రిమోట్‌తో ఎవరైనా కంట్రోల్ చేశారా? కావాలనే దాని కదలికలను మార్చి బాలికను టార్గెట్ చేశారా? అమ్మాయిని టార్గెట్ చేసేందుకే దాని మూవ్మెంట్స్ మార్చారా..? ఫోన్లలో దొరికే డేటా ఏం చెబుతుందో..
Also read: వైఎస్ జగన్‌కి బిగ్ షాక్.. జనసేనలోకి వైఎస్ఆర్సీపీ కీలక నేతలు జంప్?