E-Paper
Advertisement

అగ్గిపెట్టి మచ్చ అంత్యక్రియల్లో అసలేం జరిగింది? బయటపెట్టిన వైజాగ్ సత్య!

అగ్గిపెట్టి మచ్చ అంత్యక్రియల్లో అసలేం జరిగింది? బయటపెట్టిన వైజాగ్ సత్య!
Advertisement

Aggipetti Maccha:అగ్గిపెట్టి మచ్చ అకస్మాత్తుగా చనిపోవడం అభిమానులని బాధ పెట్టిన సంగతి తెల్సిందే. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ, తనదైన యాసతో అందరినీ నవ్వించే కిరణ్ కుమార్ అలియాస్ అగ్గిపెట్టి మచ్చ మరణాన్ని ఆయన స్నేహితులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు కూడా . తాజాగా ఉప్పల్ బాలు, వైజాగ్ సత్య ఓ ఇంటర్వ్యూలో మచ్చ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన అంత్యక్రియల సమయంలో ఏం జరిగిందో ఇలా చెప్పుకొచ్చారు.

అగ్గిపెట్టి మచ్చ చనిపోయిన తర్వాత అంత్యక్రియలు చేసే విషయంలో కుటుంబ సభ్యుల మధ్య కొన్ని గొడవలు జరిగాయని వైజాగ్ సత్య చెప్పుకొచ్చారు. ఆస్తి విషయాల్లో విభేదాలు వచ్చాయని,అందువల్ల అంత్యక్రియలు ఆలస్యమయ్యాయని తెలిపారు. మచ్చ చనిపోయిన తర్వాత మూడు రోజుల వరకు మృతదేహాన్ని ఇంటి ముందే ఉంచారని చెప్పారు. ఆ సమయంలో తాము కుటుంబ సభ్యులతో మాట్లాడి, ఏవైనా సమస్యలు ఉంటే తర్వాత పరిష్కరించుకోవాలని, ముందుగా అంత్యక్రియలు పూర్తి చేయాలని కోరామని వివరించారు.

Advertisement

అంతేకాదు, అవసరమైతే తామే అంత్యక్రియలు నిర్వహిస్తామని కూడా చెప్పినట్లు సత్య తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ కూడా వచ్చి మాట్లాడినా మొదట్లో సమస్య పరిష్కారం కాలేదని అన్నారు. చివరకు బంధువులు ముందుకు రావడంతో కార్యక్రమాలు పూర్తయ్యాయని చెప్పారు. మచ్చను చిన్నప్పటి నుంచి చూసుకున్న ఆయన అక్క సుజాతకు తమ్ముడంటే ఎంతో ఇష్టమని, అతడిపై చాలా ప్రేమ చూపించేదని గుర్తుచేసుకున్నారు.

మచ్చ అంత్యక్రియల విషయంలో ఆయన అక్క ముందుండి చేసిన పనులను కూడా సత్య గుర్తుచేసుకున్నారు. తమ్ముడిపై ఆమెకు ఉన్న ప్రేమను మాటల్లో చెప్పలేమని అన్నారు. ఆడవాళ్లు అంత్యక్రియలు చేయకూడదని కొందరు అభ్యంతరం చెప్పిన విషయాన్ని చెబుతూ, కుటుంబంలో ప్రేమ ఉన్నవాళ్లు ముందుకొచ్చి చివరి కార్యక్రమాలు నిర్వహించడంలో తప్పేముందని ప్రశ్నించారు.

Advertisement

ఇక ఉప్పల్ బాలు కూడా మచ్చను గుర్తుచేసుకుంటూ ఆ సమయంలో అక్కడికి రాలేకపోయానని, తనకు కూడా చాలా బాధగా ఉందని చెప్పారు. మచ్చ అక్క తనతో ఫోన్‌లో మాట్లాడుతూ ఏడ్చిందని, తాను రాలేదని బాధపడిందని వాపోయారు.మచ్చ తనను చివరిసారిగా చూడాలని అనుకున్నాడని తెలిసి మరింత బాధ కలిగిందని అన్నారు.

వైజాగ్ సత్య గురించి మాట్లాడుతూ బాలు మాట్లాడుతూ తమ స్నేహితుల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుగా స్పందించేది సత్యేనని చెప్పారు. రాకేష్ మాస్టర్, కుర్చీ తాత, ఇప్పుడు అగ్గిపెట్టి మచ్చ.. ఇలా ఎవరికి ఏం జరిగినా సత్య ముందుండి చూసుకుంటాడని అన్నారు. మచ్చ అంత్యక్రియల దగ్గర కూడా సత్య ఎంతో కష్టపడ్డాడని, హోటల్లో ఉంటూ, తిండి గురించి కూడా పట్టించుకోకుండా అంత్యక్రియలు చేశాడని చెప్పారు.

డబ్బు, ఆస్తులు ఉన్నా కష్టకాలంలో మనతో ఉండే మనిషి చాలా ముఖ్యమని బాలు అన్నారు. స్నేహితుడి కోసం ఎంతవరకైనా వెళ్లే వ్యక్తి సత్య అని ఆకాశానికి ఎత్తేశారు.
తమ టీమ్ లో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోయినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా అందరూ కలిసి సహాయం చేస్తామని చెప్పారు. బయటివాళ్లు తమ గురించి ఏం అనుకున్నా, కష్టాల్లో ఎవరు అండగా నిలుస్తారో తమకు తెలుసని అన్నారు.

మచ్చకు సంబంధించిన ఇతర కార్యక్రమాల కోసం కూడా స్నేహితులంతా కలిసి ఖర్చు చేస్తున్నట్లు ఇంటర్వ్యూలో తెలిపారు.అన్నదానం నిర్వహించడానికి సుమారు లక్ష రూపాయలు ఖర్చు చేయాలని ప్లాన్ చేసినట్లు చెప్పారు. ఈ విషయంలో దువ్వాడ మాధురి, దువ్వాడ శ్రీనివాసరావు, గడ్డం నవీన్ సహా పలువురు సహాయం చేస్తున్నారని కృతజ్ఞతలు తెలిపారు.

ఇదే సమయంలో మందు తాగడం గురించి కూడా బాలు తన బాధను బయటపెట్టారు. తమ బృందంలో రాకేష్ మాస్టర్, కుర్చీ తాత, అగ్గిపెట్టి మచ్చ మరణాలు తమను బాధించాయని తాగడం అనేది
ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని, కుటుంబాలను కూడా ఇబ్బందుల్లోకి నెడుతుందని చెబుతూ, ఎవరూ దానికి బానిసలు కావొద్దని విజ్ఞప్తి చేశారు.ప్రేమలో మోసపోయినప్పుడు కూడా జీవితాన్ని వదులుకోవద్దని బాలు సూచించారు.మొత్తానికి, అగ్గిపెట్టి మచ్చ మరణం ఆయన స్నేహితులను ఎంతగా బాధించిందో బాలు, సత్య మాటల్లో అర్థమవుతుంది.

ALSO READ :అగ్గిపెట్టి మచ్చ చివరి కోరిక అదే.. కన్నీళ్లు పెట్టుకున్న ఉప్పల్ బాలు, వైజాగ్ సత్య!

Tags

Related News

మంగ్లీ vs మధుప్రియ.. ఈసారి బతుకమ్మ పాటల్లో ఎవరిది పైచేయి?

తల్లి కాబోతున్న బిగ్ బాస్ కంటెస్టెంట్.. ఘనంగా సీమంతపు వేడుక!

అగ్గిపెట్టి మచ్చ చివరి కోరిక అదే.. కన్నీళ్లు పెట్టుకున్న ఉప్పల్ బాలు, వైజాగ్ సత్య!

ఓడిపోయిన చోటే గెలిచి చూపించాను.. అసలైన విజయం అదే అంటున్న సాయి పల్లవి!

సింగర్ కనకవ్వ ఒక్కో పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

జూనియర్ బాలు అనుకుంటే ఇలా దొరికిపోయాడేంటి.. సరిగమపలో దైవిక్‌కు షాక్!

టీవీలోకి ‘మా ఇంటి బంగారం’ మూవీ.. ఎప్పుడు ఏ ఛానల్ లో చూడొచ్చంటే?

Big Stories

Advertisement
×