E-Paper
Advertisement

లక్నో మర్డర్ మిస్టరీ.. మోడల్ శ్రద్ధా దూబే హత్య కేసులో పూర్తి వివరాలివే?

లక్నో మర్డర్ మిస్టరీ.. మోడల్ శ్రద్ధా దూబే హత్య కేసులో పూర్తి వివరాలివే?
Advertisement

Shraddha Dubey: ఈమె పేరు శ్రద్ధా దూభే. యూపీలో బిగ్‌ మోడల్. సోషల్‌మీడియాలో ఒక్క ఫోటో పెడితే చాలు.. కోట్లల్లో వ్యూస్ వస్తాయి. లక్షల్లో లైకులు వస్తాయి. బయటకు వెళ్తే.. సెల్ఫీల కోసం జనం ఎగబడతారు. కానీ ఇప్పుడు ఈమె ఓ మర్డర్ కేసులో నిందితురాలిగా మారింది. కేసు ఫైల్‌ అవ్వగానే ఎవరికి కనిపించకుండా జంప్ అయ్యింది.

ఫుల్ క్రైమ్ థ్రిల్లర్‌గా..

లక్నోలో కేఫ్ ఓనర్ శివ శర్మ మృతి కేసు ఇప్పుడు ఫుల్ క్రైమ్ థ్రిల్లర్‌గా మారింది. అక్టోబర్ 9న నాలుగో అంతస్తు నుంచి కిందపడి ప్రాణం పోగొట్టుకున్నాడు శివ శర్మ. అయితే శివ, శ్రద్ధా దూభే కొంతకాలంగా లివింగ్‌రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. పైకి చూస్తే ఇది ఓ సాధారణ మరణంలా కనిపించింది. కానీ కథ అక్కడే మలుపు తిరిగింది. ఎందుకంటే శివ కుటుంబం చెబుతున్నది వేరే..

కొడుకును శ్రద్ధా బ్లాక్‌మెయిల్..

Advertisement

శివ కన్నతల్లి రంజనా శర్మ గుండె పగిలేలా ఏడుస్తూ పోలీసుల గడప తొక్కింది. నా కొడుకును శ్రద్ధా బ్లాక్‌మెయిల్ చేసిందని.. చివరకు చంపేసిందని కంప్లైంట్ చేసింది. శ్రద్ధా, ఆమె సోదరి రష్మిపై పోలీసులు మర్డర్ కేసు నమోదు చేశారు. సీన్ కట్ చేస్తే.. కొత్తగా CCTV విజువల్స్ బయటకు వచ్చాయి. ఇంతకీ ఆ ఫుటేజ్‌లో ఏముంది? శివ శర్మ చనిపోయిన రోజు అపార్ట్‌మెంట్‌లోకి ఎవరు వచ్చారు.? ఎవరు బయటకు వెళ్లారు.? శివ శర్మతో చివరిగా ఎవరు మాట్లాడారు..? ఇలాంటి ప్రతి డీటెయిల్‌ను పోలీసులు చెక్ చేస్తున్నారు.

ఢిల్లీ వైపు వెళ్లారా..?

కేసు నమోదు చేసిన వెంటనే శ్రద్ధా దూభే అక్కడ లేదు. ఆమె సోదరి రష్మి దూభే కూడా కనిపించడం లేదు. వాళ్ల డ్రైవర్‌ జాడ కూడా జంప్ అవ్వడంతో పోలీసులకు అనుమానాలు మరింత పెరిగాయి. నిందితులు ఢిల్లీ వైపు వెళ్లారా..? లేదంటే నేపాల్ బోర్డర్ దాటి ఎస్కేప్ అయ్యారా..? యూపీ పోలీసులు ఏకంగా ఆరు ప్రత్యేక టీమ్స్‌ను రంగంలోకి దించారు. ప్రతి లొకేషన్‌ను ట్రాక్ చేస్తూ.. పరారీలో ఉన్న వాళ్ల కోసం వేట మొదలుపెట్టారు. ఈ ఇద్దరి గురించి కచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్లకు 25 వేల రూపాయల రివార్డ్ ప్రకటించారు. శ్రద్ధా దొరికితేనే.. ఆ రాత్రి జరిగిన నిజం ఏంటో బయటపడుతుంది.

Advertisement

Also read: ఓట్ల చోరీకి మోదీ సూత్రధారి.. అమిత్ షా పాత్రధారి: విపక్ష కూటమి నేతలు ఫైర్!

Tags

Related News

ఓట్ల చోరీకి మోదీ సూత్రధారి.. అమిత్ షా పాత్రధారి: విపక్ష కూటమి నేతలు ఫైర్!

తెలంగాణ ఉన్నత విద్యకు మరణశాసనంగా మారిన జీవో.. బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్‌లో సంచలనం?

విశాఖ మేయర్ రేసులో ఉన్న మొత్తం లీడర్స్ వీళ్లే.. ఇదిగో ఫుల్ లిస్ట్?

అన్నా హజారేలా తెరమరుగు కాకుండా! రాజకీయ పార్టీగా మారబోమని ప్రకటించిన సీజేపీ! నైతిక విశ్వసనీయతే ఊతంగా..!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

కాంగ్రెస్ ను ఓడించేందుకు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య దోస్తానా? గ్రేటర్‌పై బీజేపీ పట్టు.. నల్లగొండపై గులాబీ పంతం..!

బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్ ఎఫెక్ట్.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మరో ఫేక్ లెక్చరర్..?

Big Stories

Advertisement
×