E-Paper
Advertisement

ఉప్పల్ బాలు వివాదంపై స్పందించిన నవదీప్.. వీడియో వైరల్!

ఉప్పల్ బాలు వివాదంపై స్పందించిన నవదీప్.. వీడియో వైరల్!
Advertisement

ప్రముఖ సినీ నటుడు, ప్రస్తుతం బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2 జడ్జిగా వ్యవహరిస్తున్న నవదీప్ (Navdeep) ఇటీవల సామాన్యులను బిగ్ బాస్ హౌస్ కి పంపించే క్రమంలో యూట్యూబర్ ఉప్పల్ బాలు (Uppal Balu) పై చేసిన కామెంట్లకు ఉప్పల్ బాలు ఎమోషనల్ అవుతూ ఒక వీడియో రిలీజ్ చేశారు. పైగా నవదీప్ పై శాపనార్ధాలు పెట్టారు. అంతేకాదు తన చావుకు కారణం నవదీప్ అంటూ ఒక వీడియో రిలీజ్ చేసి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో కొంతమంది సెలబ్రిటీలు కూడా ఉప్పల్ బాలుకి మద్దతుగా నిలుస్తున్న నేపథ్యంలో..తాజాగా నవదీప్ స్పందిస్తూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ముదురుతున్న ఉప్పల్ బాలు వివాదం.. స్పందించిన నవదీప్..

ఉప్పల్ బాలు వీడియోలపై స్పందించిన నవదీప్ మాట్లాడుతూ..” బిగ్ బాస్ సమాజాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది..రకరకాల మనుషుల మధ్య ఉండాలి. రకరకాల మైండ్ సెట్స్ నుంచీ వచ్చే యాటిట్యూడ్, ఎమోషన్స్ ఉండే మనుషుల మధ్యలో వంద రోజులు బ్రతుకుతున్నప్పుడు ఎవడెవడో ఏదేదో అంటాడు.. అలా అన్నప్పుడు ఆ మాటలను మనం ఎలా తీసుకుంటామో.. ఎలా రియాక్ట్ అవుతాం.. ఎలా మనల్ని మనం కండక్ట్ చేసుకుంటాం అనేది పాయింట్. దాన్ని టెస్టే అగ్నిపరీక్ష.

అగ్నిపరీక్ష అంటేనే టెస్ట్..

Advertisement

సమాజం నుండి వాళ్లకు వచ్చే నెగటివ్ కామెంట్స్ తో, వాళ్ల ఎమోషన్స్ ను ట్రిగర్ చేసే ప్రయత్నం చేస్తాం. ఎవడో కామెంట్ పెట్టాడు.. నేను ఏంటో అంటాను. కంటెస్టెంట్ రియాక్షన్ ఎలాగైనా ఉండవచ్చు. నా ఒపీనియన్ నాది మీ ఒపీనియన్ మీది. అసలు నువ్వు ఎవడ్రా నన్ను జడ్జ్ చేయడానికి అని కూడా అనవచ్చు.

ALSO READ:‘జై శ్రీ రామ్’ వివాదం.. అనసూయపై ఆదిలాబాద్ ప్రజలు ఆగ్రహం.. అసలేం జరిగిందంటే?

మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బయటకు తీయడమే మా పని..

Advertisement

బిగ్ బాస్ అగ్నిపరీక్షకు జడ్జ్ అన్నప్పుడే నాకు తెలుసు.. కంటెస్టెంట్స్ ను పరీక్ష చేయడమే మెయిన్ ఉద్దేశం.. మీ పోస్ట్ కి నెగటివ్ కామెంట్స్ వస్తే ఎలా రియాక్ట్ అవుతావు అనేది పరీక్ష.. సమాజానికి ఏం సందేశం ఇస్తావు నువ్వు..అని నాలాంటోళ్లు ఎంతమంది ఎలా మాట్లాడినా తట్టుకొని నిన్ను నువ్వు , నవ్వుతూ వెళ్లే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందా? లేకపోతే బ్రేక్ అయ్యి ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా? అనేది మీ ఇష్టం. హారర్ సినిమాకు వచ్చి భయపెట్టొద్దంటే ఎలా ఎన్ని తిట్టినా భరించే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందా? నెగిటివ్ కామెంట్స్ ని హ్యాండిల్ చేయలేకపోతే అగ్నిపరీక్షకు దయచేసి రావద్దు” అంటూ ఉప్పల్ బాలు చేస్తున్న కామెంట్లకు నవదీప్ రియాక్షన్ గా ఒక వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అసలేం జరిగిందంటే

అసలేం జరిగింది అనే విషయానికి వస్తే.. బిగ్ బాస్ సీజన్ 10 లోకి వెళ్లడానికి సామాన్యులను ఎంపిక చేయడానికి అగ్నిపరీక్ష సీజన్ 2 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో ఆడిషన్ ద్వారా పలు రౌండ్లలో ఎంపికై ఉప్పల్ బాలు తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి స్టేజ్ పైకి వచ్చాడు. రాగానే నీవన్ని ఎకిలి వీడియోలు.. అలాంటి వీడియోలతో సమాజానికి ఎటువంటి సందేశాన్ని ఇద్దామనుకుంటున్నావు అంటూ రిజెక్ట్ చేశారు. దీంతో బాధపడ్డ ఉప్పల్ బాలు తనను ఎలిమినేట్ చేయడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నవదీప్ పై ఒక రేంజ్ లో బండబూతులతో రెచ్చిపోయాడు. మీ వీడియోలు వల్గర్ గా ఉంటాయి. అవి దేనికి పనికొస్తాయని అడిగి నవదీప్ అవమానించారని, నవదీప్ మా వీడియోలు పనికిరావు అంటున్నారు కదా.. మరి మీ వీడియోలు దేనికి పనికి వస్తాయి.. మీరు ఎవరికైనా దానధర్మాలు చేశారా? అంటూ ఘాటుగా ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ వివాదం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నవదీప్ స్పందించారు.

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి షాక్ ఇచ్చిన సూరజ్ – పీఏగా జ్యోత్స్న అపాయింట్            

Ninnu kori Serial Today Episode October 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను జీవన్ చంపేస్తాడా..? చంద్ర కనిపెడుతుందా..? 

Nindu Noorella Saavasam Serial Today Episode October 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి తనను చంపేస్తుందని పార్థు పసిగడతాడా..?    

Monday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

సుప్రీత ఆస్తుల విలువ ఎంతో తెలుసా? చిట్టా మొత్తం బయటపెట్టిందిగా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

డ్రగ్స్ వ్యవహారం…ఏడవని రోజు లేదు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×