YouTuber:సోషల్ మీడియాలో ఎప్పుడూ సరదా వీడియోలతో హల్ చల్ చేసే ప్రముఖ యూట్యూబర్ మధుమిత ఇప్పుడు ఊహించని వివాదంలో చిక్కుకున్నారు. ఆమెపై ఒకవైపు చోరీ కేసులు నమోదవ్వడం, మరోవైపు ఆమె అకస్మాత్తుగా ఇల్లు వదిలి వెళ్లిపోవడం ప్రస్తుతం నెట్టింట సంచలనంగా మారింది. అసలు సోషల్ మీడియా స్టార్ మధుమిత జీవితంలో ఏం జరుగుతోంది? ఆమె ఎందుకు పరారీలో ఉన్నారు? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న మధుమిత ఇటీవల తన ఇంట్లో భారీగా ఉన్న నగలు, నగదును చూపిస్తూ కొన్ని వీడియోలు పోస్ట్ చేశారు. ఆ వీడియోలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. అయితే ఆ వీడియోలు బయటికి వచ్చిన కొద్ది రోజులకే ఆమె ఇంట్లో భారీ చోరీ జరిగినట్లు వార్తలు రావడం గమసార్హం. ఏకంగా 118 సవర్ల బంగారు నగలు దొంగలపాలు కావడం ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది.
ఈ చోరీ వివాదం అలా ఉండగానే, తిరునెల్వేలికి చెందిన ఒక కాంట్రాక్టర్ పోలీసులను ఆశ్రయించడం ఈ కేసుకు పూర్తిగా కొత్త మలుపు తిప్పింది. మధుమిత తన వద్ద నుంచి 5 సవర్ల బంగారు గొలుసును కాజేసిందని ఆయన పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఇక ఆ ఫిర్యాదు ఆధారంగానే పోలీసులు మధుమితపై కేసు నమోదు చేసి, సీరియస్‌గా దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
also read:హీరో అర్జున్ కూతురు వివాహం ఫిక్స్.. ఎప్పుడంటే..?
తనపై కేసులు నమోదవడం, పోలీసులు దర్యాప్తు వేగవంతం చేయడంతో మధుమిత ఊహించని నిర్ణయం తీసుకున్నారు. పోలీసుల విచారణకు భయపడి ఆమె తన భర్త, కుమార్తెతో కలిసి ఇంటికి తాళం వేసి ఎటో వెళ్లిపోయినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె ఎక్కడున్నారనే దానిపై ఎలాంటి స్పష్టత లేదు. పోలీసులు ఆమె ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.
ఈ వివాదం ఎంత ముదురుతున్న కొద్ది, సోషల్ మీడియాలో మధుమితకు సంబంధించిన పాత, కొత్త వీడియోలు మరింత వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఈ ఘటనపై రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒకవైపు ఆమెపై వస్తున్న ఆరోపణలు తీవ్రంగా ఉన్నప్పటికీ, మరోవైపు ఆమె సోషల్ మీడియా ఖాతాలకు ఫాలోవర్ల సంఖ్య అమాంతం పెరిగిపోవడం విశేషం. వివాదాలు ఎంత పెరిగితే పబ్లిసిటీ అంత పెరుగుతుందనేలా ఈ పరిణామాలు ఉన్నాయి.
మొత్తానికి, ఒక యూట్యూబర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మధుమిత ఇలా సడన్‌గా కేసుల్లో ఇరుక్కొని పరారీలో ఉండటం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. అయితే పోలీసుల దర్యాప్తు పూర్తయ్యే వరకు ఈ ఆరోపణల్లో నిజానిజాలు ఏంటో పూర్తిగా బయటపడవు. పూర్తి విచారణ తర్వాతే ఈ హై-ప్రొఫైల్ మిస్సింగ్ అండ్ థెఫ్ట్ కేసు అసలు నిజాలు వెలుగులోకి రానున్నాయి..