Suma Adda: టాలీవుడ్ యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుమ (Suma)బుల్లితెరపై కూడా పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఒకానొక సమయంలో సుమ సినిమా ఈవెంట్ల కంటే కూడా ఎక్కువగా బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించేది ఏ ఛానల్ ఓపెన్ చేసిన సుమ ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. ఇటీవల కాలంలో ఈమె సినిమా ఈవెంట్లు అంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ప్రస్తుతం సుమ ఈటీవీలో ప్రసారమవుతున్న సుమ అడ్డా(Suma Adda) అనే కార్యక్రమానికి మాత్రమే హోస్టుగా వ్యవహరిస్తూ సందడి చేస్తున్నారు.
సుమ అడ్డా…
సుమ యాంకర్ గా వ్యవహరిస్తున్నారు అంటే అక్కడ సందడి వాతావరణం నెలకొంటుంది. ఈమె అందరిపై తనదైన శైలిలోనే పంచులు వేస్తూ తన మాట తీరుతో అందరిని ఆకట్టుకుంటారు. తాజాగా సుమ అడ్డా కార్యక్రమంలో భాగంగా దర్శకుడు సందీప్ రాజా, నటి చాందిని రావుతో పాటు కోర్టు ఫేమ్ హర్ష రోషన్, అరియాన వంటి వారు ఈ కార్యక్రమంలో సందడి చేశారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ కార్యక్రమంలో కూడా వీరందరితో ఎంతో ఫన్ క్రియేట్ చేస్తూ అందరిని నవ్విస్తూ ఆటపట్టించారు.
హాట్ గా ఉన్నానా…
ఇక ఈ కార్యక్రమంలోకి వీరు అడుగుపెట్టగానే చాందిని రావు, సందీప్ రాజా ప్రేమ పెళ్లి గురించి ప్రశ్నలు వేస్తూ సమాధానాలు రాబట్టారు. అనంతరం శెనగపిండి నూనెలోకి పడితేనే పరిపక్వత చెంది బజ్జీలుగా మారుతాయి అంటూ అందరికీ బజ్జీలు పంచారు. ఇక అరియానా(Ariyana) వద్దకు వెళ్లి తనకు బజ్జీ(Mirchi Bajji) ఇవ్వడమే కాకుండా తింటున్నావా బజ్జీలు అవి అంటూ ప్రశ్నించింది. ఇక అరియానా అవునని తల ఊపేలోపు నువ్వే బజ్జీలా ఉన్నావు అంటూ తన పరువు మొత్తం తీసింది. దీంతో వెంటనే అరియానా అవునా అంత హాట్ గా ఉన్నానా అంటూ సుమకు తనదైన శైలిలోనే కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో వైరల్ అవుతుంది.
ఇక ఎప్పటిలాగే సుమ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరి చేత సరదాగా కొన్ని టాస్కులు ఆడిస్తూ అందరిని నవ్వించారు. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ ఈ ఆదివారం ప్రసారం కాబోతోంది. ఇక అరియానా విషయానికి వస్తే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈమె ఎంతో మంది సినీ ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తూ ఫేమస్ అయ్యారు ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూతో ఫేమస్ అయిన ఇది ఏకంగా బిగ్ బాస్ (Bigg Boss)అవకాశాన్ని అందుకున్నారు. ఇలా రెండుసార్లు బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొంటూ ఎంతో మంచి ఆదరణ పొందిన అరియాన ప్రస్తుతం పలు బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తూ ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో ఈమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.
Also Read: Sekhar Kammula: మరో లవ్ స్టోరీ సిద్ధం చేసిన శేఖర్ కమ్ముల.. ఆ హీరోకి హిట్ ఇవ్వబోతున్నాడుగా?