Basheer Master Trolls:ఒకవైపు ఎన్ని విమర్శలు ఎదురైనా ఎక్కడా జడవకుండా తనదైన పద్దతిలో వరుస వీడియోలు వదులుతూ ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేస్తున్న బషీర్ మాస్టర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.ఈ క్రమంలో తన జీవితంలోని పలు ఆసక్తికరమైన సన్నివేశాలని ఇలా చెప్పుకొచ్చాడు.
తాజాగా చేసిన ఏష నాగుల కట్ట మీద పాటకి తాను చేసిన కవర్ సాంగ్ మిలియన్స్ లో పోయిందని, ఒకరకంగా ప్యారడైజ్ సినిమాలో ఆ పాటకి డాన్స్ కొరియో గ్రఫీ చేసిన సందీప్ మాస్టర్ కంటే తానే బాగ చేశానని ఎంతో మంది అన్నారని చెప్పుకొచ్చాడు. ఇక ఆ సాంగ్ వల్లె ఇపుడు వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయని ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
తారక్, బన్నీ లలో ఎవరంటే
ఇక తారక్, బన్నీ లలో ఎవరంటే ఎక్కువ ఇష్టం, ఎవరికి అవకాశం వస్తే కొరియోగ్రఫీ చేస్తారు అని అడిగిన ప్రశ్నకి బషీర్ మాస్టర్ జవాబిస్తూ తనకి ఇద్దరు అంటే ఇష్టమని, తారక్ మాస్ అయితే బన్నీ మోడ్రన్ అని ఇద్దరికీ డాన్స్ కంపోజ్ చేయడం తనకి ఇష్టమని మనసులోని మాటని బయటపెట్టాడు.
ఇక ఈ క్రమంలోనే తనపై వచ్చే ట్రోల్స్ కి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు బషీర్ మాస్టర్ .నా ఎదుగుదలని చూసి ఓర్వలేకనే నన్ను ట్రోల్ చేస్తుంటారని , తనని ఎంత ట్రోల్ చేసినా తానూ పట్టించుకోనని,ఒకరకంగా వాళ్ళ ట్రోలింగ్ వల్లే తాను మరింత ఎత్తుకు ఎదుగుతానని చెప్పుకొచ్చాడు.ఇక తన వల్లే వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారని ,వాళ్ళు చేసే ట్రోలింగ్ వల్లే తన తన పాటలు మరిన్ని వ్యూస్ తెచ్చుకుంటున్నాయని తెలిపాడు.
ఆ కామెంట్స్ ని పట్టించుకుంటే
అయితే కామెంట్ సెక్షన్ ని అసలు తాను ఓపెన్ చేయనని,అందువల్ల తనకి ఎవరు ఏమి ట్రోల్ చేస్తునారో అసలు తెలీదని ,ఒకవేళ గనుక ఆ కామెంట్స్ ని పట్టించుకుంటే ఇక తాను ఇంట్లో కూర్చోవాలని మనసులోని మాటని బయటపెట్టాడు.
ఇక మన ఇండియాలో కొంతమంది అలాంటి దుర్మార్గులు ఉంటారని , వాళ్లకి అసలు వేరే పనే ఉండదని, కేవలం బీర్ సీసాలు అమ్ముకొని , ఫోన్లు రీచార్జ్ చేసుకొని ఇలా నెగెటివ్ కామెంట్స్ చేస్తుంటారని,ఇలా ట్రోలింగ్ మీద పెట్టె శ్రద్ధ వాళ్ళ డెవలప్ మెంట్ కోసం పెడితే ఎంతో గ్రోత్ చూస్తారని,కాని వాళ్ళు అలా చేయరని మంది పడ్డాడు.
వాటికి కౌంటర్ గానే ఇలా
బషీర్ మాస్టర్ విషయానికి వస్తే రాకేశ్ మాస్టర్ దగ్గర ట్రైనింగ్ తీసుకొని,డీ 1 ,2 సీజన్ లో తనదైన ఫెర్ఫామెన్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకున్న సంగతి తెల్సిందే.అయితే బషీర్ మాస్టర్ సినిమాల కన్నా ఎక్కువగా సంగీత్ ఈవెంట్స్ తోనే బిజీ బిజీ కెరీర్ ని లాక్కొచ్చెశాడు .
ALSO READ :సంధ్య 70MM హిస్టరీ.. ఈ థియేటర్ వెనుక ఇంత పెద్ద కథ ఉందా?
ఇక తన చానెల్ లో పెట్టె కవర్ సాంగ్స్ తో ప్రశంసలు కన్నా ఎక్కువగా విమర్శలు మూట గట్టుకోవడం ఇక్కడ గమనార్హం. అసలు బషీర్ మాస్టర్ కి డాన్స్ రాదని ,మేము ఫీజ్ కడతాం కొంచెం డాన్స్ నేర్చుకోండి అని , నువ్వు డాన్స్ తప్ప అన్నీ చేస్తావని ఇలా ఇబ్బడి ముబ్బడిగా ట్రోల్స్ చేస్తూ ఉంటారు నెటిజన్లు.ఇదిగో వాటికి కౌంటర్ గానే ఇలా తన మనసులోని మాటల్ని ఇలా బయటపెట్టాడు బషీర్ మాస్టర్ !