Shepherd Boy: ఎపీ లోని ప్రకాశం జిల్లా మద్దిపాడులో గొర్రెల కాపరిగా పనిచేస్తున్న 8 ఏళ్ల రామయ్య వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నన్ను ఆదుకునే దిక్కులేక నరకం చూస్తున్నామంటూ వీడియోలో బాలుడు ఆవేదన వ్యక్తం చేయడంతో ఘటన వెలుగులోకివ వచ్చింది. ఈ వీడియోపై ఎపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ స్పందించారు. బాలుడి ఆచూకీ కోసం తక్షణమే చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగి బాలుడి కుటుంబం కోసం విస్తృతంగా ఆరాతీసారు.
నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నరవాడలో బాలుడి కుటుంబం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబం మందులు, వైద్య ఖర్చులు భరించలేక బాలుడిని గొర్రెల కాపరిగా పంపినట్లు విచారణలో వెల్లడైంది. బాలుడి నాలుగేళ్ల చెల్లెలికి గుండె సంబంధిత సమస్య ఉండటంతో వైద్య ఖర్చులు కుటుంబంపై మరింత ఆర్థిక భారంగా మారినట్లు అధికారులకు తల్లిదండ్రులు తెలిపారు. సొంత ఇల్లు కూడా లేక గుడిసెల్లో జీవనం చేస్తూ ప్లాస్టిక్ డబ్బాలు ఏరుకుంటూ పొట్ట పోసుకుంటున్న కుటుంబంగా గుర్తించారు.
Also read: ఈ టోల్ ఫ్రీ 1064 నెంబర్‌కి ఫిర్యాదు చేసేముందు ఇది చదవండి.. వెలుగులోకి షాకింగ్ రిపోర్ట్!
జీవనోపాధి కోసం ఊరూరూ తిరుగుతున్న కుటుంబ పరిస్థితిని గుర్తించిన అధికారులు బాలుడిని మద్దిపాడు ప్రాంతంలో గుర్తించారు. బాలుడిని అక్కడి నుంచి తీసుకొచ్చి తల్లిదండ్రులకు బాలుడిని అధికారులు అప్పగించారు. దీంతో అతని సంరక్షణ, భద్రతపై చర్యలు తమ పిల్లల వైద్య ఖర్చులు భరించే స్థోమత లేక ఇబ్బందులు పడుతున్నామని దాతలు స్పందించి తమ బిడ్డను ఆదుకోవాలని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేసారు.
బాలుడి ఘటనపై విద్యాశాఖ అధికారులు స్పందిస్తూ.. చిన్నారికి అవసరమైన సంరక్షణ, రక్షణ, మద్దతు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. బాలుడు తల్లిదండ్రులు పురుష ఆశీర్వాదం, ఎస్తిరమ్మ వీరిది కడప జిల్లా బ్రహ్మంగారిమఠంగా గుర్తించారు. ఈ సంఘటనతో మంత్రి నారాలోకేష్ పై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.
Also Read: గులాబీకి సవాల్‌గా ఖైరతాబాద్ ఎన్నిక.. సరైన అభ్యర్థి ఎంపికకోసం మల్లగుల్లాలు..!
మీ అందరి ప్రార్థనలు ఫలించాయి. బాలుడు రామయ్యను సురక్షితంగా ఇంటికి తీసుకొచ్చాంమని సామాజిక మాధ్యమాల ద్వారా గొర్రెల కాపరి రామయ్య అనే బాలుడు గురించి అందరూ ఎంతో ఆందోళనగా పోస్టులు పెట్టారని నారాలోకేష్ అన్నారు. అది చూసిన నేను చాలా కలత చెందానని, నెల్లూరు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ప్రభుత్వ విభాగాలన్నీ సమన్వయంతో పనిచేసి బాలుడు రామయ్యను క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చామని తెలిపారు. రామయ్యను రెసిడెన్షియల్ స్కూల్లో చేర్చబోతున్నామని తండ్రి అనారోగ్యానికి వైద్యం, తల్లికి స్వయం ఉపాధి, కుటుంబానికి ఇల్లు మంజూరు చేస్తామని మంత్రి నారాలోకేష్ అన్నారు.