E-Paper
Advertisement

గణేష్ నిమజ్జనం స్పెషల్ ఈవెంట్.. సందడి చేసిన సెలబ్రిటీస్!

గణేష్ నిమజ్జనం స్పెషల్ ఈవెంట్.. సందడి చేసిన సెలబ్రిటీస్!
Advertisement

TV : ప్రముఖ న్యూస్ ఛానల్ బిగ్ టీవీ జబర్దస్త్ సెలబ్రిటీలతో ప్రత్యేకంగా వినాయక నిమజ్జనం సందర్భంగా చేస్తున్న స్పెషల్ ఈవెంట్ ‘వినాయక నిమజ్జనానికి వస్తున్నాం’.. ప్రముఖ యాంకర్ వర్షా(Varsha), బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ డెమోన్ పవన్ (Demon Pawan) హోస్టుగా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమం సెప్టెంబర్ 25వ తేదీన ఉదయం 10 గంటలకు చాలా ఘనంగా జరగనుంది. ఈ ఈవెంట్ కి సంబంధించిన లేటెస్ట్ ప్రోమోని నిర్వాహకులు విడుదల చేశారు. ఆధ్యంతం జబర్దస్త్ సెలబ్రిటీలతో ఈ ప్రోమో ఆకట్టుకుంటోంది .

వినాయక నిమజ్జనానికి వస్తున్నాం ప్రోమో వైరల్..

తాజాగా విడుదల చేసిన వినాయక నిమజ్జనానికి వస్తున్నాం ప్రోమోలో సెలబ్రిటీలు జంటలుగా విచ్చేసి సందడి చేశారు. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ సోనియా ఆకుల (Sonia aakula) తన భర్త యష్ (Yash) తో రాగా జబర్దస్త్ కమెడియన్ యాదమ్మ రాజు (Yadamma raju) తన భార్య స్టెల్లా (Stella) తో సందడి చేశారు. అలాగే జబర్దస్త్ లేడీ కమెడియన్ ఫైమా (Faima ) తన భర్త ప్రవీణ్ (Praveen) తో వచ్చి ఆకట్టుకుంది. ఇక మరొక జంట సీరియల్స్ నుండి విచ్చేశారు.. వారెవరో కాదు విష్ణు ప్రియ (Vishnu Priya), ఆమె భర్త సిద్ధార్థ్ వర్మ (Siddharth varma) .

సెలబ్రిటీ జంటలతో ఆసక్తి కలిగించిన ప్రోమో..

Advertisement

తాజాగా విడుదల చేసిన ప్రోమోలో నాలుగు సెలబ్రిటీ జంటలు సందడి చేశాయి. విష్ణు ప్రియ, సిద్ధార్థ్ వర్మ సెట్ లోకి అడుగుపెట్టగానే.. పవన్ మాట్లాడుతూ.. విష్ణుప్రియ తో నువ్వు సంతోషంగా ఉన్నావా ? అని సిధార్థ్ ను అడుగుతాడు. వెంటనే విష్ణు ప్రియ కలుగజేసుకుని.. నువ్వేమైనా ఇంకో అమ్మాయిని తీసుకొస్తావా అంటూ ప్రశ్నించింది. సిద్ధార్థ్ వర్మ ఏదైనా అలా ఆప్షన్ ఉందా అంటూ నవ్వులు పూయించారు. ఇక ఫైమా జంట ఎంట్రీ ఇవ్వగానే ఫైమా , పవన్ కూడా డాన్స్ బాగా చేస్తారు అని వర్షా అడిగితే.. వద్దమ్మా అని పవన్ చెప్పడం , దానికి ఎటకారంగా తనదైన కామెడీ ఫైమా పండించడం మరింత ఆకట్టుకుంది. యాదమ్మ రాజు , స్టెల్లా జంట మరింత స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. యాదమ్మ రాజు ఎప్పటికప్పుడు తనదైన పంచు డైలాగులతో ప్రోమోకి హైలెట్గా నిలవడమే కాకుండా షోపై ఆసక్తిని పెంచేశారు.

also read:బిగ్ బాస్ 10: మారిన ఓటింగ్.. ఎలిమినేషన్ దిశగా మరో లేడీ?

లడ్డు వేలం పాటలో నెగ్గిందెవరు?

Advertisement

గణేష్ నిమజ్జనం సమయంలో లడ్డు వేలంపాట ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రోమోలో కూడా లడ్డు వేలంపాట నిర్వహించారు. వర్ష దేవుడి వేలం పాట వంద రూపాయలు అని పాడగా.. యాదమ్మ రాజు ఫస్ట్ టైం యాంకర్ అయ్యావు ..నువ్వే వేయి రూపాయలు పాట పాడు అని సలహా ఇచ్చాడు. ఫైమా 1201 అంటే.. యష్ ఏకంగా 12000 చెప్పేశారు.. యాదమ్మ రాజు మాట్లాడుతూ.. మీరు డైరెక్ట్ పన్నెండు వేలుకి వెళ్ళిపోతే ఆమె రెమ్యూనరేషనే రూ.10, 000 అంటూ కౌంటర్ వేశాడు. ఆ తర్వాత యష్ 8000 పాడితే.. యాదమ్మ రాజు ఒకేసారి లక్ష రూపాయలు అంటూ వేలం పాట పాడాడు. మరి యాదమ్మ రాజు ఈ వేలం పాటలో లడ్డు దక్కించుకున్నాడా? లేకపోతే పోటీగా వచ్చిన యాష్ మరింత ఫిగర్ చెప్పారా అన్నది ఆసక్తిగా మారింది. మరి లడ్డు వేలంపాటలో ఎవరు లడ్డు దక్కించుకున్నారో తెలియాలి అంటే ఈవెంట్ ఎపిసోడ్ చూడాల్సిందే. మొత్తానికైతే లేటెస్ట్ గా విడుదల చేసిన ప్రోమో మాత్రం ఈవెంట్ పై మరింత ఆసక్తిని పెంచేసింది.

Related News

బిగ్ బాస్ 10: మారిన ఓటింగ్.. ఎలిమినేషన్ దిశగా మరో లేడీ?

సరిగమపలో అదరగొడుతున్న దైవిక్.. అతని బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే!

బిగ్ బాస్ 10లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్న భల్లాల దేవ?

బిగ్ బాస్ త్రిగుణ్ సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నారా? ఈయన భార్య ఎవరంటే?

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు మైండ్ బ్లాక్.. పార్వతి మాటతో షాక్.. పాపం ప్రభా..

Karthika Deepam 2 Serial Today Episode September 23rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి షాక్ ఇచ్చిన దీప, కార్తీక్           

Big Stories

Advertisement
×