Big TV Kissik Talks: సౌమ్యరావు(Sowmya Rao) పరిచయం అవసరం లేని పేరు. జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈమె కెరియర్ మొదట్లో సీరియల్స్ లో నటిస్తూ ఉండేవారు. ఇలా నెగిటివ్ రోల్స్ చేస్తున్న ఈమెకు జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా ఛాన్స్ వచ్చింది. అప్పటివరకు జబర్దస్త్ యాంకర్ (Jabardasth Anchor)గా వ్యవహరిస్తున్న అనసూయ(Anasuya) ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడంతో ఆ అవకాశాన్ని సౌమ్యరావు అందుకున్నారు. ఇక సౌమ్య రావు కూడా మొదట్లో కొన్ని విమర్శలు ఎదుర్కొన్న అనంతరం తెలుగు స్పష్టంగా మాట్లాడుతూ యాంకర్ గా మంచు గుర్తింపు పొందారు.
జబర్దస్త్ నుంచి తప్పుకున్న సౌమ్యరావు…
ఇలా జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న సౌమ్యరావు తన వ్యక్తిగత కారణాలవల్ల జబర్దస్త్ కార్యక్రమానికి దూరమయ్యారు. ఇలా జబర్దస్త్ కు దూరమైనప్పటికీ పలు బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తూ ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని అందిస్తున్నారు. తాజాగా సౌమ్య రావుబిగ్ టీవీ నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్(Kissik Talks) కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్నో విషయాల గురించి తెలియజేశారు. ఈ క్రమంలోనే వర్ష జబర్దస్త్ యాంకర్లుగా రష్మీ(Rashmi) , అనసూయ ఇద్దరిలో ఎవరు బెస్ట్ అంటూ ప్రశ్న వేశారు.
అనసూయనే బెటర్…
ఈ ప్రశ్నకు సౌమ్యరావు సమాధానం చెబుతూ.. యాంకరింగ్ విషయంలో ఈ ఇద్దరు ఎవరికీ వారే పోటీ అని తెలిపారు.. రష్మీ తెలుగు అమ్మాయి కాకపోయినా తెలుగు చాలా బాగా మాట్లాడుతూ తన మాట తీరుతో అందరిని ఆకట్టుకుంటారు. ఇక అనసూయ తెలుగు అమ్మాయి కాబట్టి చాలా స్పష్టంగా తెలుగు మాట్లాడుతుంది. ఇలా ఇద్దరిలో ఎవరు బెటర్ అంటే రష్మి కంటే అనసూయనే బెటర్ అంటూ ఈ సందర్భంగా సౌమ్యరావు చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక రష్మీ తెలుగు అమ్మాయి కాకపోయినా వచ్చిరాని తెలుగులో మాట్లాడుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్నారు . ఎక్స్ట్రా జబర్దస్త్ యాంకర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రష్మీ ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి అలాగే జబర్దస్త్ కార్యక్రమానికి కూడా యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.
జబర్దస్త్ యాంకర్లుగా రష్మి, మానస్…
ఇక అనసూయ కూడా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ఈమెకు సినిమా అవకాశాలు వస్తున్న నేపథ్యంలోనే జబర్దస్త్ కార్యక్రమం నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. ఇలా ఈ కార్యక్రమం నుంచి అనసూయ తప్పుకోవడంతో ఆ అవకాశాన్ని సౌమ్యరావు అందుకున్నారు. ఇక కొన్ని కారణాల వల్ల సౌమ్యరావు ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడం తిరిగి సిరి హనుమంత్ జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించడం జరిగింది. అయితే ఒకప్పుడు జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ అంటూ రెండు రోజులు పాటు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని ఒకే కార్యక్రమంలో ప్రేకకుల ముందుకు తీసుకువస్తున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి రష్మితో పాటు మానస్ కూడా యాంకర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
Also Read: Big Tv Kissik Talks : తినడానికి తిండి లేదు..కన్నీటి కష్టాలను బయటపెట్టిన సౌమ్యరావు!