Big Tv Kissik Talks : కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పలు సీరియల్స్ లో నటించే అవకాశాలను అందుకొని అనంతరం జబర్దస్త్(Jabardasth) కార్యక్రమానికి యాంకర్ గా సందడి చేశారు నటి సౌమ్యరావు (Sowmya Rao). అప్పటివరకు సీరియల్స్ లో నటిస్తున్న ఈమెకు జబర్దస్త్ కార్యక్రమంలో అవకాశం రావడంతో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు.. ఇలా జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు పొందిన సౌమ్య రావు కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల ఈ కార్యక్రమం నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం పలు బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న ఈమె తాజాగా బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్(Big Tv Kissik Talks) కార్యక్రమానికి హాజరయ్యారు.
ఎక్కడికి వెళ్లినా అవమానాలే…
ఈ కార్యక్రమంలో భాగంగా తన కన్నీటి కష్టాలను చెబుతూ ఎంతో ఎమోషనల్ అయ్యారు. తాను పుట్టడమే నిరుపేద కుటుంబంలో జన్మించానని తెలిపారు. తన తండ్రి కారణంగా ఎన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నామని వెల్లడించారు. తమతండ్రి లోన్ తీసుకొని ఎన్నో అప్పులు చేశారు. అయితే ఈ అప్పుల వాళ్లు ఇంటి మీదకు వచ్చి గోల చేసేవారని తెలిపారు. పేద కుటుంబంలో జన్మించిన తమకు ఎక్కడికి వెళ్లినా ఎన్నో అవమానాలు జరిగేవని ,ఏదైనా పెళ్లికి వెళ్తే అమ్మ పాత చీర కట్టుకొని వెళ్లడంతో తనని చాలా మంది అవమానించారని వెల్లడించారు. ఇక మా ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చారు అంటే చుట్టుపక్కల వారంతా తలుపులు వేసుకునేవారు. ఎక్కడ వెళ్లి వారిని ఏదైనా అడుగుతామేమో అన్న భయం ఉండేదని సౌమ్య రావు తన కష్టాలను గుర్తుచేసుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు..
రెండు రోజులపాటు తిండి లేదు…
తాను ఎనిమిదో తరగతి చదువుతున్న సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని కనీసం తినడానికి తిండి కూడా ఉండేది కాదని తెలిపారు. ఓసారి రెండు రోజులపాటు తినడానికి ఏమీ లేదు కానీ అమ్మ తన దగ్గర ఉన్న ₹100తో తిరుపతి తీసుకువెళ్లిందని తిరుపతికి వెళ్లిన తర్వాత స్వామిని దర్శించుకోవడానికంటే ముందు ఎక్కడ భోజనాలు పెడుతున్నారా అని తాను వెతికాను అంటూ సౌమ్య రావు ఈ సందర్భంగా తన కన్నీటి కష్టాలను తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని తాను ఈ స్థాయికి వచ్చానని తెలిపారు.
బ్రెయిన్ క్యాన్సర్…
తాను కష్టపడి చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేసుకునేదాన్ని అలా పార్ట్ టైం జాబ్ ద్వారా వచ్చిన డబ్బుతో పై చదువులు చదువుకున్నానని తెలిపారు.ఇలా తన స్వశక్తితో చదువుకుంటూ జీరో నుంచి ఈ స్థాయికి వచ్చానని వెల్లడించారు.మీ జీవితంలో ఇలాంటి పరిస్థితి రాకూడదని ఎప్పుడైనా కోరుకున్నారా అనే ప్రశ్న ఎదురయింది. తన తల్లికి రిపోర్ట్స్ వచ్చిన సమయంలో కోరుకున్నానని సౌమ్య రావు తెలిపారు. తన అమ్మ ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసింది. అలాంటిది తనకు బ్రెయిన్ క్యాన్సర్ (Brain Cancer)వచ్చిందని అలాంటి రిపోర్ట్ రాకపోయి ఉంటే బాగుండేది అంటూ తన తల్లి పరిస్థితిని గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యారు. తన జీవితంలో ఎదురైన కష్టాలు ఇబ్బందులు మరొకరి జీవితంలో ఎప్పుడూ రాకూడదని తాను కోరుకుంటాను అంటూ సౌమ్యరావు ఎమోషనల్ అయ్యారు.
Also Read: Big Tv Kissik Talks: ఇండస్ట్రీలో సిండికేట్ ఉంది… చాలాసార్లు తొక్కేశారు..