NTR:చిత్ర పరిశ్రమలో ఎంతోమంది సెలబ్రిటీలు చూడడానికి చాలా సింపుల్ గా కనిపించినా.. వారు ఉపయోగించే వస్తువుల ధరలు మాత్రం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా సింపుల్గా కనిపించినా లగ్జరీనెస్ చూపిస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటారు.మరీ ముఖ్యంగా హీరోయిన్ల గురించి కాస్త పక్కన పెడితే ..హీరోల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ధరించే వాచ్ మొదలుకొని వేసుకునే కాలి షూ వరకు ప్రతీదీ ప్రత్యేకమే. లగ్జరీ వస్తువులతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇప్పుడు అలాంటి వారి జాబితాలో ఎప్పుడూ వార్తల్లో నిలిచే హీరోలలో ఎన్టీఆర్ కూడా ఒకరు.
ఉపయోగించే కారు మొదలుకొని ధరించే దుస్తుల వరకు ఎప్పటికప్పుడు ట్రెండీగా నిలుస్తూ ఉంటారు ఎన్టీఆర్ . ఈ క్రమంలోనే తాజాగా ఆయన చేతికి ధరించిన వాచ్ అందరి దృష్టిని ఆకట్టుకుంది. దీంతో ఆయన పెట్టుకున్న వాచ్ ఖరీదు ఎంత అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే.. రాజమౌళి సమర్పణలో ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలో అక్టోబర్ రెండవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. బాలకృష్ణ డైలాగ్ ను టైటిల్ గా పెట్టుకుని ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీ గానే ఉన్నాయి. ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చారు ఎన్టీఆర్.
ఎన్టీఆర్ ఇందులో తన స్పీచ్ తో అందరినీ ఆకట్టుకోవడమే కాకుండా తన స్టైలిష్ లుక్కుతో మరోసారి మెస్మరైజ్ చేశారు. ఈ క్రమంలోనే ఆయన చేతి గడియారం అందరి దృష్టిని ఆకట్టుకుంది . అసలు విషయంలోకి వెళ్తే పటేక్ లగ్జరీ బ్రాండ్ కు చెందిన పటేక్ ఫిలిప్పీ గ్రాండ్ కాంప్లికేషన్స్ మోడల్ వాచ్ ను ధరించారు. బ్లూ డయల్ కలిగిన ఈ వాచ్ లో స్ప్లిట్ సెకండ్స్ క్రోనోగ్రాఫ్ తో డిజైన్ చేశారు. 2025లో ఈ మోడల్ ను ఉత్పత్తి చేయడం జరిగింది. ఇకపోతే దీని ధర అక్షరాల రూ.2,16,44,625. పైగా దీనిని ఆల్ ఓవర్ ఇండియాలో షిప్పింగ్ చేయడానికి అదనంగా రూ.17,416 సదరు వెబ్సైట్ కలెక్ట్ చేస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఎన్టీఆర్ ధరించిన ఈ వాచ్ , దాని ఖరీదు అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి.
also read:ఎఫ్డిఏ నోటీసులపై షారుక్ , అజయ్ , టైగర్ ష్రాఫ్ రియాక్షన్?
ఇకపోతే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. వారణాసి వచ్చే ఏడాది వస్తుందని తెలిపారు. ఇక అలాగే రాజమౌళి కుటుంబం గురించి, ఆ కుటుంబంతో తనకున్న అనుబంధం గురించి ఆయన చెప్పుకొచ్చారు. రాజమౌళి కుటుంబం నాకు దేవుడు ఇచ్చిన ఫ్యామిలీ.. కార్తికేయ నా తల్లి కడుపున పుట్టకపోయినా అంతకంటే ఎక్కువ. నా కష్టంలో, నా కన్నీళ్లలో, నా సంతోషంలో పాలుపంచుకునే నా తమ్ముడు అంటూ కార్తికేయ పై కూడా ప్రశంసలు కురిపించారు . అంతేకాదు కార్తికేయ ప్రొడక్షన్ హౌస్ లో వస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని, తన తమ్ముడు నిర్మాతగా నిలదొక్కుకోవాలని ఆకాంక్షించారు.