E-Paper
Advertisement

మెదక్ జిల్లాలో రేషన్ బియ్యం దందా.. మిల్లు యజమానిపై కేసు నమోదు!

మెదక్ జిల్లాలో రేషన్ బియ్యం దందా.. మిల్లు యజమానిపై కేసు నమోదు!
Advertisement

PDS Rice: మెదక్ జిల్లా మండలం పేదల కడుపు నింపాల్సిన రేషన్‌ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న అక్రమార్కులపై పోలీసులు కొరడా ఝుళిపించారు. వెల్దుర్తి మండలం మంగళపర్తి గేటు సమీపంలోని లక్ష్మీనరసింహ రైస్‌ మిల్లు వద్ద ఆదివారం పట్టుబడిన పీడీఎస్‌ బియ్యం వ్యవహారంలో.. అక్రమంగా కొనుగోలు చేసేందుకు యత్నించిన మిల్లు నిర్వాహకుడితో పాటు ఆటో డ్రైవర్‌పై కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ కరుణాకర్‌ రెడ్డి మంగళవారం వెల్లడించారు.

విచారణతో వెలుగులోకి సంచలనాలు..

ఆదివారం మిల్లు వద్ద రేషన్ బియ్యంతో పట్టుబడిన ఆటోను పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం పౌరసరఫరాల శాఖ అధికారులకు అప్పగించారు. దీనిపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన పౌరసరఫరాల తనిఖీ అధికారి తాటి నర్సింహులు.. ఆటోలో 3 క్వింటాళ్ల రేషన్‌ బియ్యంతో పాటు 3 క్వింటాళ్ల 60 కిలోల రేషన్‌ నూకలు ఉన్నట్లు నిర్ధారించి నివేదిక అందించారు.

డ్రైవర్‌పై..

Advertisement

దీని ఆధారంగా అక్రమంగా రవాణా అవుతున్న ఆ బియ్యాన్ని, ఆటోను పోలీసులు పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రేషన్‌ బియ్యాన్ని కొనుగోలు చేస్తూ దందాకు పాల్పడుతున్న సదరు రైస్‌ మిల్లు యజమానిపై, రవాణా చేసిన డ్రైవర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటూ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ స్పష్టం చేశారు.

Also read: పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్!

Tags

Related News

సిరిసిల్ల గడ్డపై సీఎం రేవంత్ రెడ్డి జోరుగా పాదయాత్ర!

పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్!

నేను, బండి సంజయ్ కింది స్థాయి నుంచి పైకి వచ్చిన వాళ్లమే: సీఎం రేవంత్!

తెలంగాణలో అమిత్ షా పర్యటనకు డేట్ ఫిక్స్.. పూర్తి షెడ్యూల్ ఇదే!

వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు.. వర్క్ ఫర్ విలేజ్ కోసం పనిచేయండి: మంత్రి సీతక్క!

రేవంత్‌రెడ్డి లాంటి సీఎం ఉండడం మన ఖర్మ: తలసాని శ్రీనివాస్ యాదవ్

రేవంత్ రెడ్డి కేవలం రిబ్బన్ కటింగ్ సీఎం మాత్రమే!- పాడి కౌశిక్ రెడ్డి

Big Stories

Advertisement
×