E-Paper
Advertisement

Bigg Boss Abhijith : కంటెస్టెంట్ పై అభిజిత్ సీరియస్.. ఇదేం పని భయ్యా..

Bigg Boss Abhijith : కంటెస్టెంట్ పై అభిజిత్ సీరియస్.. ఇదేం పని భయ్యా..
Advertisement

Bigg Boss Abhijith : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న రియాల్టీ షో బిగ్ బాస్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తెలుగులో ఇప్పటికే 9 సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో మరి కొన్ని రోజుల్లో పదవ సీజన్ ని మొదలుపెట్టబోతుంది. ఈ క్రమంలో గత ఏడాది లాగే ఈ ఏడాది కామనర్స్ కోసం అగ్నిపరీక్ష సీజన్ 2 ను యాజమాన్యం నిర్వహించారు. ఈ సీజన్ కి కూడా జడ్జిలుగా హీరో నవదీప్, అభిజిత్, బిందు మాధవిలు వ్యవహరించారు.. బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 కూడా ఆగస్ట్ 15 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవనుంది. ఈ క్రమంలో బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2 ప్రోమోని విడుదల చేశారు. ప్రోమోలో ఇంట్రెస్టింగ్ సంఘటనలు చోటు చేసుకున్నాయి. జడ్జ్ గా వ్యవహరించిన అభిజిత్ ఆ షోలో చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆ ప్రోమో లో ఏముందో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

కంటెస్టెంట్ చెప్పులు తుడిచిన అభిజిత్..

బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2 ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ వీడియోలో కొన్ని అనుకోని సంఘటనలు జరగడంతో వాటిపై కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.. అలాంటిదే ఒకటి అభిజిత్ చేసిన పని.. ఈ షో కి కంటెస్టెంట్ గా వచ్చిన ఒక అమ్మాయి ని ముగ్గురు జడ్జిలు ప్రశ్నలు అడుగుతారు.. ఈ షోలో భాగంగా కంటెస్టెంట్ షాలిని దామెరను షూస్ క్లీన్ చేయమని జ్యూరీ మెంబర్ బిందు మాధవి చెప్పగా, ఆమె నిరాకరించింది.. హౌస్ లోకి వచ్చిన తర్వాత ప్రతి పని చేయాల్సి వస్తుంది.. ఏ పని చిన్నది కాదు పెద్దది కాదు అని అభిజిత్ అంటాడు.. అంతేకాదు వెంటనే స్టేజ్ మీదకు వెళ్లిన అభిజిత్ ఏ పని తక్కువ చేసి మాట్లాడకూడదు అంటూ ఆ అమ్మాయి చెప్పులను తన కర్చీఫ్ తో తుడుస్తాడు.. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో ఈ ఘటనపై మీమ్స్ కూడా మొదలయ్యాయి..

ఇదేం పని భయ్యా.. నెటిజన్స్ ట్రోల్స్..

Advertisement

మన సత్తా ఏంటో మనం ప్రూవ్ చేసుకోవాలి అంటే ఇలాంటి పనులు ఎన్నో చేయాలి అని ఇండైరెక్టుగా మెసేజ్ ఇస్తూనే అభిజిత్ చేసిన పనికి ఆ లేడీ కంటెంట్ షాక్ అవుతుంది.. అంతే కాదు కన్నీళ్లు పెట్టుకుంటుంది. అభిజీత్ నవ్వుతూ రిటర్న్ అవుతాడు. అలా బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ప్రోమో ముగుస్తుంది.. అయితే ఈ అమ్మాయి సెలెక్ట్ అయిందా లేదా అన్నది మాత్రం క్లారిటీగా తెలియలేదు. అతనికి అయితే అభిజిత్ బిగ్ బాస్ పై తనకున్న అభిమానాన్ని ఇలా చాటాడంటూ కొంతమంది కామెంట్లు చేస్తే మరి కొంత మంది మాత్రం ఓవరాక్షన్ చేశారంటూ కామెంట్లతో రచ్చ చేస్తున్నారు.. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. మరి ఆగస్టు 15 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సీజన్ లో ఎలాంటి టాస్క్లతో కంటెస్టెంట్ లనే సెలెక్ట్ చేసారు అన్నది చూడాలి.. ఏది ఏమైనా కూడా కొంతమంది సెలెక్ట్ అయ్యారు అని మరి కొంతమంది సెలెక్ట్ కాలేదని ఇప్పటికే కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అందులో ప్రముఖ యూట్యూబర్ ఉప్పల్ బాలు రిలీజ్ చేసిన వీడియో కూడా ఇప్పుడు ట్రెండ్ అవుతుంది.. మరి ఈసారి సీజన్ ఎలా ఉండబోతుందో అన్నది చూడాలి…

Advertisement

Also Read :Gundeninda GudiGantalu Today episode: రోహిణికి అవమానం.. సుశీల ప్లాన్ అదుర్స్.. రోహిణి, మనోజ్ ను విడగొట్టే ప్లాన్..

Related News

Gundeninda GudiGantalu Today episode: బాలు ప్లాన్ సక్సెస్.. శృతి దొరుకుతుందా..? ప్రభాకు దిమ్మతిరిగే షాక్..

Podarillu Today Episode : చక్రికీ దిమ్మతిరిగే షాక్.. గోపికకు మైండ్ బ్లాక్.. మాధవ్ కు టెన్షన్..

Karthika Deepam 2 Serial Today Episode September 29th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని బెదిరించడంతో జ్యోత్స్నను జాబ్ లోంచి తీసేసిన కేఫ్ ఓనరు             

Illu Illalu Pillalu Today Episodes: భాగ్యంకు షాక్.. ప్రేమ మాటతో ఫ్యూజుల్ అవుట్.. ప్రేమ పెళ్లికి రెడీ..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్.. అవని దెబ్బకు షాక్.. పల్లవి పై అనుమానం..

Gundeninda Gudigantalu : ఒడియమ్మ బంటి.. ఒకరు కాదు.. ఇద్దరు అవుట్..

Ninnu kori Serial Today Episode September 29th ‘నిన్ను కోరి’ సీరియల్‌: జీవన్ కు వార్నింగ్ ఇస్తున్న దాక్షాయణి   

Tuesday Tv Movies : మంగళవారం మూవీ లవర్స్ కు పండగే.. డోంట్ మిస్…

Big Stories

Advertisement
×