Mystery Thriller Series: పదకొండేళ్ల క్రితం ఓ చిన్నారి కనిపించకుండా పోతుంది. కేసు ఎన్ని సంవత్సరాలు గడిచినా తెగదు. ఆమె తండ్రి మాత్రం తన కూతురు ఇక లేదనే నిజాన్ని అంగీకరించడు. కొన్నాళ్ళ క్రితం పోలీస్ డిటెక్టివ్ గా పని చేసిన అతను ఇప్పుడు ఎమర్జెన్సీ కాల్ డిస్పాచర్ గా జీవిస్తుంటాడు. అలాంటి సమయంలో ఓ టీనేజ్ అమ్మాయి నుంచి వచ్చిన ఫోన్ కాల్ అతని జీవితాన్ని ఒక్కసారిగా మార్చేస్తుంది. ఆ గొంతు తన కూతురిదేనని అతనికి అనిపిస్తుంది. కానీ ఆ ఒక్క నమ్మకం అతన్ని మళ్లీ పదకొండేళ్ల నాటి కేసులోకి లాగుతుంది. ఇదే స్టోరీతో రూపొందిన సిరీస్ ‘లాస్ట్ సీన్’ (Last Seen). మరి ఈ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ ను ఏ ఓటీటీలో చూడవచ్చు అంటే ?
ఇయాన్ రిడ్లీ పోలీస్ డిటెక్టివ్ గా ఉన్న సమయంలో అతని చిన్న కూతురు మ్యాగీ కనిపించకుండా పోతుంది. పదకొండేళ్లు గడిచినా ఆమె ఎక్కడుందో, ఆమెకు ఏం జరిగిందో తెలియదు. ఈ ఘటన తర్వాత ఇయాన్ జీవితం పూర్తిగా మారిపోతుంది. పోలీస్ ఉద్యోగాన్ని వదిలి ఎమర్జెన్సీ డిస్పాచర్ గా పని చేస్తున్నా, కూతురి కోసం వెతకడం మాత్రం ఆపడు. ఓ రోజు ఇయాన్‌కు ఓ టీనేజ్ అమ్మాయి నుంచి అత్యవసర ఫోన్ కాల్ వస్తుంది. ఆ కాల్ లోని పరిస్థితులు అతనిలో ఒక్కసారిగా ఓ అనుమానాన్ని కలిగిస్తాయి.
ఆ అమ్మాయి తన పదకొండేళ్ల క్రితం కనిపించకుండా పోయిన కూతురు మ్యాగీ అయి ఉండొచ్చని అతనికి అనిపిస్తుంది. ఇన్నేళ్లుగా ఎదురు చూసిన అవకాశం ఇదే కావచ్చని భావించిన ఇయాన్, అధికారిక పరిమితులను పట్టించుకోకుండా నిజం తెలుసుకునే ప్రయత్నం మొదలుపెడతాడు. మ్యాగీ కనిపించకుండా పోయిన కేసును మళ్లీ తెరపైకి తీసుకురావడం అంత సులభం కాదు. పాత కేసులోని ఆధారాలు, అప్పట్లో జరిగిన దర్యాప్తు, కొత్తగా వచ్చిన కాల్… అన్నింటినీ కలిపి చూడాల్సి వస్తుంది. ఓ చిన్న క్లూ కూడా ఇయాన్ కు కీలకంగా మారుతుంది.
అతని అన్వేషణలో హెన్రీ రీడ్, జెన్నా రీడ్ అనే దంపతుల కుటుంబం కూడా కథలోకి వస్తుంది. వారి గతం, వారి ఇంట్లో జరుగుతున్న పరిణామాలు, మ్యాగీ అదృశ్యమైన కేసుకు మధ్య ఏదో సంబంధం ఉందనే అనుమానం పెరుగుతుంది. పోలీసుల దృష్టి కూడా ఆ కుటుంబం వైపు మళ్లుతుంది. ఇయాన్ నిజం దగ్గరపడుతున్న కొద్దీ అతని వ్యక్తిగత జీవితం కూడా ఒత్తిడికి గురవుతుంది. కూతురిని వెతకాలనే తపన ఒకవైపు, ఇన్నేళ్లుగా తనతో ఉన్నవాళ్లను కోల్పోయే పరిస్థితి మరోవైపు కనిపిస్తుంది. ఓ ఫోన్ కాల్ తో మొదలైన అన్వేషణ చివరకు పదకొండేళ్లుగా దాగి ఉన్న నిజాన్ని బయటకు తీసే దిశగా సాగుతుంది. మరి చివరికి ఆ అమ్మాయి ఎవరో తెలిసిందా ? ఆమె ఎలా మిస్ అయ్యింది ? అసలు ఆ అమ్మాయి తన కూతురేనా ? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే సిరీస్ ను చూడాల్సిందే.
పాట్రిక్ బ్రామల్ (Patrick Brammall), బ్రెండన్ కోవెల్ (Brendan Cowell), మ్యాక్సిన్ పీక్ (Maxine Peake) నటించిన ‘లాస్ట్ సీన్’కు క్రిస్టియన్ ష్వోఖోవ్ (Christian Schwochow) దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 9 నుంచి Apple TVలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు సబ్‌టైటిల్స్ ఉన్నాయి కానీ తెలుగు ఆడియో లేదు.