E-Paper
Advertisement

పీఎఫ్ విత్‌డ్రాపై న్యూ రూల్స్.. 10 సార్లు డబ్బులు తీసుకోవచ్చు, డీటేల్స్ ఇవిగో

పీఎఫ్ విత్‌డ్రాపై న్యూ రూల్స్.. 10 సార్లు డబ్బులు తీసుకోవచ్చు, డీటేల్స్ ఇవిగో
Advertisement

EPFO New Rules: ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త. విత్ డ్రాల కోసం కొన్ని నిబంధనలను సడలించింది ఈపీఎఫ్ఓ. తాజాగా కొత్త మార్గదర్శకాల్ని ప్రకటించింది. దీనివల్ల ఏయే అవసరాలకు పీఎఫ్ డబ్బులు ఎన్నిసార్లు తీసుకోవచ్చు అనేది ఇప్పుడు పరిశీలిద్దాం.

పీఎఫ్ విత్‌డ్రాపై న్యూ రూల్స్

ప్రభుత్వం, ప్రైవేటు రంగంలోకి పని చేసే ఉద్యోగులకు పీఎఫ్ అకౌంట్ గురించి చెప్పాల్సిన పని లేదు. చాలా మందికి ఈపీఎఫ్ అకౌంట్ ఉంటుంది. ఉద్యోగుల జీతం నుంచి ప్రతి నెలా కొంత కోత విధించి ఈపీఎఫ్ ఖాతాలో జమ చేస్తుంది సదరు కంపెనీ. ఆ యజమాని జమ చేసే దాంట్లో 8.33 శాతం వరకు పెన్షన్ స్కీమ్‌కు వెళ్తుంది. మిగతా మూడు శాతం ఈపీఎఫ్‌లోకి వెళ్తుంది. కేంద్రం ప్రతీ ఏటా ఆయా నిధులపై వడ్డీ ఇస్తుంది. రిటైర్మెంట్ తర్వాత ప్రయోజనాలు అందించే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఈ పద్దతి అవసరమైనప్పుడు కొంత నగదు తీసుకునేందుకు కొన్ని నిబంధనలు ఉంటాయి.

10 సార్లు డబ్బులు PF ఖాతా నుంచి తీసుకోవచ్చు

Advertisement

సమయం, సందర్భం బట్టి విత్‌డ్రా నిబంధనల్ని సడలిస్తూ వచ్చింది ఈపీఎఫ్ఓ. తాజాగా కొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ముఖ్యంగా అనారోగ్యం, పిల్లల చదువులు, పెళ్లి, ఇల్లు కొనుగోలు వంటి పలు అవసరాల కోసం ఈ సొమ్మును వినియోగించుకోవచ్చు. ఒక్కో అవసరానికి ఎన్నిసార్లు పీఎఫ్ డబ్బులు తీసుకోవచ్చనేది ఇప్పుడు తెలుసుకుందా.

ఈపీఎఫ్ఓ తాజాగా కొత్త గైడ్‌లైన్స్ విడుదల చేసింది. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో ఆయా వివరాలను పోస్ట్ చేసింది. ఈపీఎఫ్ అడ్వాన్స్‌లను 3 కేటగిరీలుగా విభజించింది. అత్యవసర అవసరాలు, ఇంటికి సంబంధించినవి, ప్రత్యేక పరిస్థితుల పేరిట విభజన చేసింది.

కొత్త రూల్స్ ఒక్కసారి పరిశీలిద్దాం

Advertisement

ఈపీఎఫ్ఓ మార్గదర్శకాల ప్రకారం ఉద్యోగి లేదా అతడి కుటుంబసభ్యులు అనారోగ్యానికి గురైతే ఈపీఎఫ్ అడ్వాన్స్ ఎన్ని సార్లైనా తీసుకోవచ్చు. ఎలాంటి పరిమితులు లేవు.

చదువు- ఇతర విద్యా సంబంధిత అవసరాల కోసం ఈపీఎఫ్ అడ్వాన్స్‌ సభ్యత్వ సమయంలో గరిష్ఠంగా 10 సార్లు విత్‌డ్రా చేసుకోవచ్చు.

పెళ్లి అవసరాలకు సంబంధించి ఈపీఎఫ్ మెంబర్‌షిప్ సమయంలో గరిష్ఠంగా 5 సార్లు డబ్బులు తీసుకోవచ్చు.

ఇల్లు కోసం ఈపీఎఫ్ఓ ఓ విభాగం చేర్చింది. సభ్యత్వ కాలంలో గరిష్ఠంగా 5 సార్లు ఈపీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు.

ఈపీఎఫ్ఓలో ప్రత్యేక పరిస్థితుల కోసం మరో విభాగం ఉంది. ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠంగా 2 సార్లు అడ్వాన్స్ తీసుకోవచ్చు. ప్రత్యేక పరిస్థితులు ఏంటో అనేది పీఎఫ్ బోర్డు ప్రకటిస్తుంది.

ALSO READ: చెక్ బౌన్స్ టెన్షనా?అకౌంట్ క్లోజ్ చేసే రైట్స్ బ్యాంకులకు ఉన్నాయా?

ఈపీఎఫ్ఓ గైడ్‌లైన్స్ ప్రకారం.. 12 నెలల సభ్యత్వం పూర్తయ్యాక పీఎఫ్ అకౌంట్ వచ్చిన ఏడాది తర్వాత ఈపీఎఫ్ బ్యాలెన్స్‌లో గరిష్ఠంగా 75 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఉద్యోగి, యజమాని వాటాలతోపాటు వాటిపై వచ్చిన వడ్డీని కలిపి లెక్కిస్తారు. ఈపీఎఫ్ఓ అనేది భవిష్యత్తు అవసరాల కోసం ఉంచే నిధి. ఒకసారి ఉద్యోగం పోయినా, రిటైర్మెంట్ తర్వాత పెద్ద మొత్తంలో చేతికి అందే డబ్బు. అత్యవసర పరిస్థితుల్లో ఆ డబ్బును రిటైర్మెంట్ తర్వాత ఉపయోగించుకోవచ్చు. 75 శాతం వరకు తీసుకునే అవకాశముందని ప్రతిసారీ పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేయడం వల్ల రిటైర్మెంట్ ప్రయోజనాలు కోల్పోతారు.

 

Related News

చెక్ బౌన్స్ టెన్షనా?అకౌంట్ క్లోజ్ చేసే రైట్స్ బ్యాంకులకు ఉన్నాయా?

మారుతున్న పరిణామాలు.. పండగ వేళ బంగారం ధర పతనం, మార్కెట్లో రేటు ఎలా ఉంది?

ఐటీ షేర్లు లాభాల్లో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు!

నెలకు రూ.1000 జీతం.. ఇప్పుడు రూ.3 లక్షల కోట్లకు అధిపతి, అదెలా సాధ్యం?

గాజువాకలో CMR జువెలరీ గ్రాండ్ ఓపెనింగ్.. ముఖ్య అతిథిగా భాగ్యశ్రీ బోర్సే!

అమ్మమ్మ చేతి రుచికి రూ.2 వేల పెట్టుబడి.. నేడు రూ.580 కోట్ల సామ్రాజ్యం.. ‘స్వీట్‌ కారం కాఫీ’ సక్సెస్‌ స్టోరీ!

రూ. 3 లక్షలతో బిజినెస్ స్టార్ట్.. నేడు రూ. 1.5 కోట్ల టర్నోవర్.. ఇద్దరు స్నేహితుల అద్భుత సక్సెస్ స్టోరీ!

Big Stories

Advertisement
×