E-Paper
Advertisement

ఐటీ షేర్లు లాభాల్లో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు!

ఐటీ షేర్లు లాభాల్లో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు!
Advertisement

IT Stocks: దలాల్‌ స్ట్రీట్‌ గాడిలో పడింది. దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ పుంజుకున్నాయి! వరుస ఒడిదుడుకుల తర్వాత కొనుగోళ్ల జోరు కనిపించింది. సెన్సెక్స్ ఏకంగా 1,109 పాయింట్లు .. నిఫ్టీ 22,700 పాయింట్ల మార్కును టచ్‌ చేశాయి. ముఖ్యంగా ఐటీ షేర్లలో భారీ కొనుగోళ్లు మార్కెట్లకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి.

భారీ లాభాలతో..

మంగళవారం దలాల్‌ స్ట్రీట్‌ మాంఛి జోష్‌ కన్పించింది. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1,109.10 పాయింట్లు.. అంటే 1.54 శాతం పెరిగి 73,033.78 వద్ద స్థిరపడింది. అటు ఎన్ఎస్ఈ నిఫ్టీ 358.60 పాయింట్లు లాభపడి 22,721.95 వద్ద ముగిసింది. గత సెషన్‌లో నమోదైన నష్టాల నుంచి మార్కెట్లు గణనీయంగా కోలుకున్నాయి. HCL క్వార్టర్‌ ఫలితాలు ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంచాయి. ప్రాఫిట్‌ ర్యాలీలో ఐటీ రంగం కీలక పాత్ర పోషించింది. నిఫ్టీ ఐటీ సూచీ ఏకంగా 5.2 శాతానికి పైగా పెరిగింది. హెచ్‌సీఎల్ టెక్ షేరు సుమారు 8.4 శాతం, టీసీఎస్ షేరు సుమారు 6.8 శాతం లాభపడ్డాయి. బ్యాంకింగ్, రియల్టీ, ఆటో రంగాల షేర్లలోనూ కొనుగోళ్లు కనిపించాయి.

విదేశీ పెట్టుబడుల పై..

Advertisement

ఐటీ కంపెనీల మెరుగైన ఫలితాలు, రూపాయి విలువలో రికవరీ, బాండ్ ఈల్డ్స్‌లో తగ్గుదల మార్కెట్ సెంటిమెంట్‌కు మద్దతిచ్చాయి. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్‌పై సమీక్ష ఉండొచ్చన్న చర్చలు కూడా ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించాయి. అయితే అంతర్జాతీయ పరిణామాలు, ముడిచమురు ధరలు, విదేశీ పెట్టుబడుల పై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది.

ముడిచమురు ధరలు..

మొత్తంగా ఐటీ షేర్ల ర్యాలీతో దేశీయ మార్కెట్లు భారీ లాభాలను నమోదు చేశాయి. అయితే ఒక్కరోజు పెరుగుదలతో మార్కెట్లలో స్థిరమైన రికవరీ మొదలైందని చెప్పలేం. కంపెనీల తదుపరి త్రైమాసిక ఫలితాలు, అంతర్జాతీయ మార్కెట్ల పరిణామాలు, ముడిచమురు ధరలు తదుపరి ట్రేడింగ్‌కు కీలకం కానున్నాయి.

Advertisement

Also read: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా గంజాయి పట్టివేత.. ఎలా దోరికాడో తెలుసా..?

Tags

Related News

నెలకు రూ.1000 జీతం.. ఇప్పుడు రూ.3 లక్షల కోట్లకు అధిపతి, అదెలా సాధ్యం?

గాజువాకలో CMR జువెలరీ గ్రాండ్ ఓపెనింగ్.. ముఖ్య అతిథిగా భాగ్యశ్రీ బోర్సే!

అమ్మమ్మ చేతి రుచికి రూ.2 వేల పెట్టుబడి.. నేడు రూ.580 కోట్ల సామ్రాజ్యం.. ‘స్వీట్‌ కారం కాఫీ’ సక్సెస్‌ స్టోరీ!

రూ. 3 లక్షలతో బిజినెస్ స్టార్ట్.. నేడు రూ. 1.5 కోట్ల టర్నోవర్.. ఇద్దరు స్నేహితుల అద్భుత సక్సెస్ స్టోరీ!

యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వాయిదా.. అక్టోబర్ 15 నుంచి కాదు, దీపావళి తర్వాతే

ట్రాఫిక్ జామ్‌లో రూ.20 ఐడియా.. నేడు నెలకు రూ.2 లక్షల సంపాదన.. ఇది కదా సక్సెస్ అంటే!

రూ.20,000 ఉంటే.. సొంతూళ్లలోనే దర్జాగా చేసుకునే వ్యాపారాలు.. ఇక సిటీ ఊసే అక్కర్లేదు!

Big Stories

Advertisement
×