E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode April 22nd ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కిచెన్ లో ఇందును చూసిన ఇంటి ఓనరు 

Brahmamudi Serial Today Episode April 22nd ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కిచెన్ లో ఇందును చూసిన ఇంటి ఓనరు 
Advertisement

Brahmamudi serial today Episode: మందు తాగుతూ కిచెన్‌లోకి వెళ్లిన ఓనరు ఇందును చూసి షాక్‌ అవుతాడు. ఎవరు నువ్వు అంటూ అడగ్గానే.. రాజు, లక్కీ, ఇందు షాక్‌ అవుతారు. అమ్మాయి ఎందుకు వచ్చిందిరా ఇక్కడకు అంటూ నిలదీయగానే..లక్కీ నేను మాట్లాడతాను.. నువ్వు పెదవులు ఆడించు అని చెప్పగానే.. లక్కీ మాట్లాడుతుంటే.. ఇందు పెదవులు కదుపుతుంది. దీంతో ఓనరు ఇదెవతో కత్తిలా ఉంది…? వాయిస్‌ చూస్తే మగాడిలా ఉందేంటి అంటాడు. దీంతో ఇందు కోపంగా కొడుతుంది. దెబ్బకు కింద పడిపోతాడు ఓనరు. దీంతో ఇందు పక్కకు వెళ్లి దాక్కుంటుంది. తర్వాత ఓనరును రాజు పైకి లేపగానే..ఇందాకా అమ్మాయిలా కనిపించిన నువ్వు ఇప్పుడు లక్కీలాగే ఉన్నావు.. అంటాడు.. దీంతో నేను నాలా ఉండక మరెలా ఉంటాను సార్‌ అంటాడు.

మీరు అడిగిన వంటలన్నీ చేస్తున్నాను మీరు వెళ్లి చిల్‌ అవ్వండి సార్‌ అని చెప్పగానే.. ఓనరు వెళ్లి ఫుల్లుగా తాగి పడిపోతాడు. ఓనరును చూసిన రాజు వీడేంటిరా చిల్లి చికెన్‌ అన్నాడు ఇలా పడిపోయాడు అనగానే.. ఎందుకైనా మంచిదని ఓ నాలుగు పెగ్గులు రా తాగించాను మావ అంటాడు లక్కీ.. దీంతో నువ్వు ఈ మధ్య  బుర్ర వాడుతున్నావురా అంటాడు రాజు. ఇంతలో అక్కడికి ఇందు వస్తుంది. ఇంతకీ నేను అడిగింది ఏం చేశావు అని అడుగుతుంది. ఏం అడిగావని రాజు అడగ్గానే.. వంట చేస్తే నాకు గోలీ సోడ ఇప్పించాలని అడిగాను కదా అంటుంది. దీంతో గోలీ సొడ కాదు కదా గోలీ లేని సోడా కూడా ఈ చుట్టు పక్కల ఎక్కడా కనిపించలేదు అంటాడు రాజు. దీంతో ఇందు కోపంగా ఏరుదాటే వరకు ఓడ మల్లన్న ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్టు నాతో బండెడు చాకిరీ చేయించుకున్నారు నన్ను కాసేపు చెఫ్‌ను చేసి రకరకాల వంటలు చేయించుకున్నారు. ఇంత చేసినా కనీసం గోలీ సొడ తీసుకురాలేకపోయారు.. నేనేమైనా మణులు అడిగానా.? మాణిక్యాలు అడిగానా..? అసలు నీ లాంటి మనిషిని అడిగాను చూడు నాది బుద్ది తక్కువ అంటూ తిడుతుంటే..

Advertisement

రాజు తన వెనక నుంచి గోలీ సొడ తీసి ఇదిగో తీసుకో అని చెప్పగానే.. ఇందు హ్యాపీగా నవ్వుతూ రెండు తీసుకొచ్చావా..? అని అడగుతుంది. దీంతో రాజు డబుల్‌ ధమాకా అని చెప్తూ.. అవును ఇంతకీ నన్ను ఏమన్నావు.. విశ్వాసం లేని వాణ్నా..? అనగానే.. పదంటాము.. అన్ని పట్టించుకుంటావా ఏంటి… అవును రెండు ఎందుకు తీసుకొచ్చావు.. అని అడగ్గానే.. తమరికి ముందే తలతిక్క ఒకటి తాగాక మరొకటి కావాలని అడిగితే మళ్లీ బయటకు వెళ్లి తీసుకురాలేను కదా అంటూ చెప్పగానే.. గోలీసొడ కొట్టుకుని తాగిన ఇందు హ్యాపీగా రాజుకు థాంక్స్‌ చెప్తుంది. ఎప్పుడో చిన్నప్పుడు తాగాను.. మళ్లీ నీ వల్ల ఇప్పుడు తాగుతున్నాను అంటూ నవ్వుతూ చిన్న పిల్లలా అరుస్తూ.. రాజుకు థాంక్స్‌ చెప్తుంది.

తర్వాత తనను బయటు తీసుకెళ్లమని ఇందు అడగ్గానే.. రాజు కోపంగా అసలు నీ కాళ్లు చేతులు కట్టేసి రూంలో పడేయకుండా ఫ్రీగా వదిలేసినందుకా ఇదంతా అడుగుతున్నావు అసలు తీసుకెళ్లను అంటూ చెప్పగానే.. ఇందు కోపంగా నువ్వు నన్ను బయటకు తీసుకెళ్లకపోతే నేను గొడవ చేస్తాను.. అంటూ బెదిరించగానే.. ఏంటి నన్నే బెదిరిస్తున్నావా..? తీసుకెళ్లను అంటాడు రాజు. దీంతో ఇందు గట్టిగా ఇంటి ఓనరును పిలుస్తుంది. వెంటనే రాజు, ఇందు నోరు మూసి తీసుకెళ్లను అంటే మొత్తానికి ఏదో చేసేలా ఉన్నావు.. పద వెళ్దాం అంటూ ఇందును తీసుకుని బయటకు వెళ్తాడు రాజు.

Advertisement

చలపతి కోపంగా లక్ష్మీని రాజు గురించి అడిగి కోపంగా రాజును తిడుతుంటాడు. ఇంతలో నందు వచ్చి డోర్‌ కొడుతుంది. దీంతో నందును చూసిన చలపతి వెటకారంగా నందుతో మాట్లాడతాడు. నందు మాత్రం వెంకట్‌ గురించి అడిగుతుంది. చలపతి వాడితో నీకేం పని అని అడగ్గానే.. మీ కొడుకు మొన్న నన్ను కలిసినప్పుడు మొబైల్‌ ఫోన్‌ నా దగ్గరే మర్చిపోయాడు.ఇచ్చి వెళ్దామని వచ్చాను అని చెప్పగానే.. పైన ఉన్నాడు చూడు అమ్మా అంటూ చెప్పగానే.. నందు పైకి వెళ్తుంటే.. ఈ ఇంటికి అమ్మాయి వస్తే పెద్దోడి వల్ల వస్తుంది అనుకున్నా కానీ చిన్నొడు కూడా ఏదో చేస్తున్నాడే అంటాడు చలపతి. దీంతో నందు వెనక్కి తిరిగి వచ్చి మేము జస్ట్‌ ఫ్రెండ్స్‌ మాత్రమే మీరు ఏదేదో ఊహించుకోకండి అంటూ చెప్పి పైకి వెళ్తుంది.

పైన వెంకట్‌ యాపిల్‌ జ్యూస్‌ తాగుతూ మందు తాగుతున్నోడిలా బిల్డప్‌ ఇస్తుంటే.. నందు వెళ్లి చూసి షాక్‌ అవుతుంది. ఏం చేస్తున్నావు వెంకట్‌ అని అడగ్గానే.. నా అమాయకత్వానికి నేనే బాధపడుతున్నాను అంటూ ఎమోషనల్‌ అవుతుంటే.. నందు కోపంగా రోజాను తిట్టి వెంకట్‌ను మోడిఫై చేస్తుంది. మరోవైపు ఇందును బయటకు తీసుకెళ్లిన రాజు.. ఇందు చేష్టలకు విసిగిపోతాడు. బండి ఆపేసి ఇందును తిడుతుంటాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం !

బిగ్ బాస్ 10లోకి అడుగుపెడుతున్న దేబ్జానీ మోదక్.. ఆమె బ్యాక్ గ్రౌండ్, రెమ్యూనరేషన్ ఎంతంటే?

బిగ్ బాస్ లవర్స్ కి గుడ్ న్యూస్.. టైమింగ్స్ లో భారీ మార్పు!

Gundeninda Gudigantalu Balu : బిగ్ బాస్ లోకి బాలు.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ అంతా..?

Telugu Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి ప్రభావతి కండీషన్.. మీనా, బాలు హ్యాపీ.. ప్రభకు కొత్త టెన్షన్..

Podarillu Today Episode : చక్రీ కి దిమ్మతిరిగే షాక్.. మాధవ్ నిర్ణయంలో మార్పు..? శైలు పై అనుమానం..

Illu Illalu Pillalu Today Episodes: అయ్యో ప్రేమ.. వల్లి మళ్లీ పుల్లేట్టేసింది.. ప్రేమ మారుతుందా..?

Big Stories

Advertisement
×