E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode August 19th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఐషును కొట్టిన ఇందు – రాజు మనసులో మరో అమ్మాయి  

Brahmamudi Serial Today Episode August 19th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఐషును కొట్టిన ఇందు – రాజు మనసులో మరో అమ్మాయి  
Advertisement

Brahmamudi serial today Episode: ఐషు తనకు డబ్బులు కావాలని తాను కంపెనీకి వారసురాలినే కదా అంటూ కోపంగా రాజును తిడుతుంది. అడ్డుగా వచ్చిన అపర్ణను తిడుతుంది. ఇందు మాత్రం తన దగ్గర డబ్బులు లేవని తాతయ్య ఆపరేషన్‌ కోసం ఉంచిన డబ్బులు మాత్రమే ఉన్నాయని చెప్తుంది. అయితే ఆ డబ్బులే ఇవ్వు అంటూ ఐషు అడగడంతో అందరూ షాక్‌ అవుతారు. ఆ ముసలోడికి ఆపరేషన్‌ చేయించాల్సిన అవసరం ఏముంది. ఇప్పుడు ఆయన లేచి పొడిచేది ఏముంది.. ? చచ్చేంత వరకు ఆ వీల్‌ ఛైర్‌లోనే ఉంటాడు అనగానే.. ఇందు కోపంగా ఐషును కొడుతుంది. రేఖ మనసులో ఇది కదా నాకు కావాల్సింది అనుకుంటుంది. భ్రమరాంబ భయంగా శేషు అలా కొట్టిందేంటి.? అంటే శేషు మెల్లగా నువ్వు అడిగింటే నీకు పడేది ఆ దెబ్బ అంటాడు.

ఐషు కోపంగా  నన్నే కొడతావా… అంటే ఇందు కోపంగా కొట్టడం కాదు.. చంపేస్తాను. ఏంటి ముసల్లోల్లా అలా మాట్లాడటానికి నీకు నోరు ఎలా వచ్చింది. ఈరోజు నీ కంటికి వాళ్లు అలా కనిపిస్తున్నారేమో.. కానీ వాళ్లు అనే వాళ్లు లేకపోతే అసలు మనం అనే వాళ్లమే లేము.. మన గతం వాళ్లు రేపటి మన భవిష్యత్తును అద్బుతంగా తీర్చిదిద్దేది కూడా వాళ్లే ఇంకొక్కసారి వాళ్ల గురించి తక్కువ చేసి మాట్లాడితే నేను ఊరుకోను.. అంటూ వార్నింగ్‌ ఇస్తే.. ఏం చేస్తావని ఐషు అడుగుతుంది. చూడు ఏం చేయడానికైనా సిద్దం.. నువ్వు నన్ను ఒక్క మాటన్నా పడతాను.. నాన్నమ్మ, తాతయ్యను ఏమైనా అంటే అసలు ఊరుకోను.. ముసలాళ్లు అంటూ మాట్లాడావు కదా..? ఇంకో పదేళ్లో ముఫ్పై ఏళ్లో పోతే నువ్వు ముసలిదానివి కావా..? అంటూ ఇందు ఐషుకు వార్నింగ్ ఇచ్చి సుభాష్‌ను తీసుకుని వెళ్తుంది. నందు కూడా ఐషును తిట్టి వెళ్లిపోతుంది.

Advertisement

అందరూ వెళ్లిపోయాక ఐషు బాధగా చూస్తుంది. వెనకాలే భూషణ్‌, రేఖ, భ్రమరాంబ, శేషు ఆలోచిస్తుంటారు. అప్పుడే శేషు పగలబడి నవ్వుతుంటాడు. ఎందుకు నవ్వుతున్నావని రేఖ అడిగితే నీ తెలివి నిజంగా సూపర్‌ చెల్లెమ్మ.. నా స్కెచ్‌ తెలియని ఐషును మాత్రం ఇందు దగ్గర బలే ఇరికించావు.. అని చెప్తుంటే.. రేఖ కోపంగా అన్నయ్య నీ నోటికి తాళం వేస్తావా..? ఏది వస్తే అది వాగకు అంటూ ఇలా జరుగుతుందని నేను అసలు ఊహించలేదు.. ఒకప్పుడు నువ్వు ఈ ఇంట్లో మహరాణిలా ఉండేదానివి నిన్ను చూస్తేనే భయపడే ఆ ఇందు ఇవాళ నిన్ను కొట్టింది.. కొట్టినదానికి నీకెంత బాధ ఉందో తెలియదు కానీ నాకు చాలా బాధగా ఉంది అంటూ రెచ్చగొడుతుంది. నందు, ఇందు మాత్రమే వారసురాళ్లా..? నువ్వు కూడా వారసురాలివేగా..? అంటూ రెచ్చగొడుతుంది. రేఖ మాటలకు రెచ్చిపోయిన ఐషు దాని ఆటల నేను కట్టేస్తాను.. నేనేంటో చూపిస్తాను… అది నన్నే కొట్టింది కదా..? ఇన్ని రోజులు పోనీలే అని వదిలేశాను.. దాన్ని ఊరికే వదలను అంటూ కోపంగా వెళ్లిపోతుంది.

ఐషు వెళ్లిపోగానే.. నాకు కావాల్సింది నువ్వు ఇలా రెచ్చిపోవడమే ఐషు అంటుంది. భూషణ్‌, భ్రమరాంబ ఆశ్చర్యంగా రేఖ నువ్వు ఏదైనా ప్లాన్‌ చేశావా అని అడిగితే.. ప్లాన్‌ చేయకుండా ఎలా ఉంటాను వదిన.. మీరే అన్నారు కదా..? రేఖ మౌనంగా ఉండిపోతున్నాను అని ఇప్పుడు రేఖ ఈజ్‌ బ్యాక్‌. నేను ఏం చేసినా ఆ రాజు అడ్డుపడుతున్నాడు. అందుకే ఇప్పుడు ఇలా అక్కాచెళ్లెల్ల మధ్య పొగ రాజేశాను అంటుంది. శేషు అమ్మ బాబోయ్‌ కథ ఇలా నడిపిస్తుందా..? అనుకుంటాడు. రేఖ ఇక నేను ఐషును అడ్డుపెట్టుకుని కథ ఎలా నడిపిస్తానో మీరే చూస్తూ ఉండండి అంటూ వెళ్లిపోతుంది.

Advertisement

సుభాష్‌ బాధగా కూర్చుని ఉంటాడు. ఎమోషనల్ అవుతుంటే.. కళ్లల్లో నీళ్లు వస్తాయి. అది చూసిన ఇందు.. సుబ్బు ఏమైంది ఆ కన్నీళ్లు ఏంటి అని అడగ్గానే.. కన్నీళ్లు కాదమ్మ ఇవి ఆనందభాష్పాలు ఒక తల్లిగా మమ్మల్ని చూసుకుంటున్నావు అంటూ చెప్తాడు. దీంతో ఇందు మిమ్మల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మాది. ఒకప్పుడు ఈ ఇంట్లో నువ్వు ఎంతో దర్జాగా తిరిగేవాడివట.. ఎంతో కష్టపడి ఈ సామ్రాజ్యాన్ని నడిపించావట అంటూ సుభాష్‌ను ఓదారుస్తుంది ఇందు. అపర్ణ అప్పుడే రాజుకు నిజం ఎప్పుడు చెప్పబోతున్నావు.. మీ నిజమైన పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు అని చెప్పగానే.. తాతయ్యకు ఆపరేషన్‌ చేయించాలని.. ఐషు అక్క జీవితం నిలబెట్టాలి. నందును పోలీస్‌ ఆఫీసర్‌ను చేయాలి ఆ తర్వాతే బావకు నిజం చెప్పాలి అంటే.. ఒకవేళ రాజు వేరే అమ్మాయిని ప్రేమిస్తే.. అప్పుడేం చేస్తావు.. అంటూ అడగ్గానే.. అలా ఏం జరగదు నాన్నమ్మ అని చెప్తుంటే.. ఐసీయూలో ఎవరో అమ్మాయి రివీల్‌ అవుతుంది. ఇంతలో ఈరోజు బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి షాక్ ఇచ్చిన సూరజ్ – పీఏగా జ్యోత్స్న అపాయింట్            

Ninnu kori Serial Today Episode October 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను జీవన్ చంపేస్తాడా..? చంద్ర కనిపెడుతుందా..? 

Nindu Noorella Saavasam Serial Today Episode October 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి తనను చంపేస్తుందని పార్థు పసిగడతాడా..?    

Monday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

సుప్రీత ఆస్తుల విలువ ఎంతో తెలుసా? చిట్టా మొత్తం బయటపెట్టిందిగా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

డ్రగ్స్ వ్యవహారం…ఏడవని రోజు లేదు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×