E-Paper
Advertisement

సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ.. సీఎం రేవంత్ కీలక ప్రకటనలు!

సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ.. సీఎం రేవంత్ కీలక ప్రకటనలు!
Advertisement

Geeta Workers: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో గీత,చేనేత కార్మికులకు సాచ్యురేషన్ స్థాయిలో పింఛన్లు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ట్యాంక్‌బండ్‌ పైన ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం వారి చిత్రానికి పుష్పాంజలి ఘటించారు.ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ , పొంగులేటి శ్రీనివాస రెడ్డి , ధనసరి అనసూయ సీతక్క , ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షులు బి. మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి మాట్లాడుతూ..

Advertisement

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ‘గీత కార్మికుల వృత్తిని కాపాడే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. అర్హులైన నేత, గీత కార్మికులు ఎంతమంది ఉన్నా అందరికీ సంతృప్త స్థాయిలో పింఛన్లు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చాను’ అని గుర్తుచేశారు. గౌడ సోదరులకు 50 వేల కాటమయ్య కిట్లను పంపిణీ చేశామన్నారు. ప్రమాదవశాత్తు గౌడ సోదరులు చనిపోతే 5 లక్షల రూపాయల పరిహారం చెల్లిస్తున్నామన్నారు.గీత కార్మికుల వృత్తిని కాపాడటానికి నీటి పారుదల ప్రాజెక్టుల కాలువల గట్లపైన ఈత, తాటి చెట్లను నాటాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని నీటి పారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి కిసూచించారు.దొరలు, భూస్వాములు, పెత్తందార్లపై పోరాటం సాగించిన యోధుడు, ముదిరాజ్‌ల ఆరాధ్యదైవం పండుగ సాయన్న పోరాటం, పౌరుషం పాలమూరు జిల్లాలో అందరికీ తెలుసునని చెప్పారు. అక్టోబర్ 22న పండుగ సాయన్న జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని ముఖ్యమంత్రి ప్రకటించారు.

పాపన్న విగ్రహం ఏర్పాటు..

Advertisement

గీత కార్మికులు, గౌడన్నలు ఎంతో కాలంగా సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్న నేపథ్యంలో తానే స్వయంగా నెక్లెస్ రోడ్ చౌరస్తాకు వెళ్లి స్థలాన్ని పరిశీలించి జ్యోతిరావు పూలే దంపతులకు విగ్రహం ఉండాలని స్థలాన్ని ఎంపిక చేశానన్నారు. అలాగే, సర్వాయి పాపన్న పోరాట స్ఫూర్తి ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతో ట్యాంక్ బండ్ పర్యాటక శాఖ కార్యాలయాన్ని మరోచోటికి తరలించి ఆ స్థలంలో పాపన్న విగ్రహం ఏర్పాటు చేసుకున్నామన్నారు. హైదరాబాద్ సందర్శనకు వచ్చే పర్యాటకులు, గణేష్ నిమజ్జన సమయంలో ట్యాంక్ బండ్ నుంచి ఎవరు వెళ్లినా ఒక స్ఫూర్తిదాయకంగా నిలవాలని ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశామని అని సీఎం వివరించారు.

సర్వాయి పాపన్న పై సీఎ ప్రశంసలు..

సర్వాయి పాపన్న ఒక కులానికి, కుటుంబానికి కాదని, బహుజనుల నుంచి పుట్టుకొచ్చిన వీరుడు అని కొనియాడారు. బహుజనులతో కలిసి దండయాత్ర చేసి గోల్కొండ కోటపై జెండాను ఎగురవేశారని గుర్తు చేశారు. ఆయన స్ఫూర్తి ఎప్పటికీ తెలంగాణ ప్రజలకు ఉండాలన్నారు. ఇది బహుజనుల తెలంగాణ అని, సామాజిక న్యాయం, జీవించడానికి స్వేచ్ఛ ఇందిరమ్మ పాలనలో ఉందని నిరూపించామన్నారు. మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ విగ్రహానికి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో, తెలంగాణలో బహుజనులు కూడా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి అంతే ప్రాధాన్యత ఇస్తారన్నారు. బహుజనుల కోసం తన జీవితాన్ని అంకితం చేశారు కాబట్టే ఆయనకు ఆ కీర్తి, గౌరవం దక్కిందని సీఎం గుర్తుచేశారు.

పిల్లలను మాత్రం చదివించండి..

కులవృత్తిని కొనసాగిస్తూ, రవించాలని, కానీ పిల్లలను మాత్రం తప్పక చదివించాలని సీఎం కోరారు. పిల్లల తలరాతలను మార్చే శక్తి మన చేతుల్లోనే ఉన్నదన్నారు. పిల్లలను చదివించి వారు ఉన్నతస్థానానికి చేరుకుని తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను చేయాలని పిలుపునిచ్చారు.విద్యార్థుల కోసం ఎన్ని నిధులైనా కేటాయిస్తామన్నారు. నాణ్యమైన విద్యతో పాటు భోజనం కూడా ఇస్తామన్నారు. గతంలో సంక్షేమ వసతి గృహాల్లో నాణ్యమైన భోజనం పెట్టలేదని, తమ ప్రభుత్వ పాఠశాలల్లో సన్న బియ్యంతో భోజనం పెడుతున్నామన్నారు.

పిల్లలు రాజ్యాలు ఏలాలంటే చదువు ఒక్కటే..

నాణ్యమైన అల్పాహారం అందిస్తున్నమన్నారు. పాలు, రాగిజావ పిల్లలకు ఇస్తున్నామన్నారు. మన పిల్లలు రాజ్యాలు ఏలాలంటే చదువు ఒక్కటే పరిష్కారమని, కష్టమైనా, నష్టమైనా పిల్లలను బడికి పంపించాలన్నారు. వాళ్లను చదివించే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఏటీసీల్లో చేరేవాళ్లకు నెలకు 2 వేల రూపాయల ఉపకార వేతనం ఇస్తున్నామన్నారు. ఈ ప్రభుత్వం సామాజిక న్యాయం కోసం పనిచేస్తుందన్నారు. సామాజిక న్యాయం కోసం రాష్ట్రంలో బీసీ కులగణన చేశామన్నారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చేశామన్నారు. నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు.

మీడియా మాధ్యమాల్లో తప్పుడు ప్రసారం..

ఇక పదేళ్లు పరిపాలించిన వాళ్లు తమ దగ్గర ఉన్న అక్రమ సంపాదనతో మీడియా, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నారన్నారు. గతంలో బర్రెలు, గొర్రెలు పెంచుకోండి చెప్పులు కుట్టుకోండి, చేపలు పట్టుకోండని చెప్పారని, మనం బర్రెలు, గొర్రెలు పెంచుకుంటుంటే వాళ్ల పిల్లలు రాజ్యాలు ఏలుతారనేది గత ప్రభుత్వ పెద్దల సారాంశమని సీఎం వివరించారు. కానీ పేద వర్గాల పిల్లలు చదివి వైద్యులు, న్యాయవాదులు, ఐఏఎస్‌లుగా మారితే తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు అవుతారని తాను గతంలోనే చెప్పినట్లు సీఎం గుర్తు చేశారు.
చదువుకోవడం వల్ల మధు యాష్కీ గౌడ్ అమెరికా వెళ్లారని, రాజకీయాల్లోకి వచ్చి ఎంపీ అయ్యారన్నారు.

మంత్రులు మాట్లాడుతూ..

తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌడ సోదరులకు యాభై వేల కాటమయ్య కిట్లను పంపిణీ చేశామన్నారు. ప్రమాదవశాత్తు గౌడ సోదరులు చనిపోతే ఐదు లక్షల రూపాయల పరిహారం చెల్లిస్తున్నామన్నారు. ఈ ప్రభుత్వం మనది అని గర్వంగా చెప్పుకోవాలని, రెండోసారి 117 సీట్లు తప్పక గెలుస్తామని సీఎం నొక్కి చెప్పారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఆయన కొడుకు కేటీఆర్‌ను కార్యనిర్వాహక అధ్యక్షుడిని చేశారని, కానీ తాను పీసీసీ చీఫ్​ గా మహేష్​ కుమార్ గౌడ్ ను చేశానన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే హరీష్ రావు, కేటీఆర్ ముఖ్యమంత్రులయ్యారని, కానీ తన ప్రభుత్వంలో పొన్నం, వాకిటి, సీతక్క, డా సురేఖలు మంత్రులయ్యారని సీఎం వివరించారు. గత ప్రభుత్వంలో సంతోష్​ రావు, తదితరులను రాజ్యసభకు పంపిస్తే, తాను అనిల్ కుమార్ యాదవ్ ను పంపించానన్నారు.

Tags

Related News

చేపపిల్లల పంపిణీ బిగ్ ట్విస్ట్.. 15 జిల్లాల్లో పడని టెండర్లు.. కాంట్రాక్టర్ల సిండికేట్ వెనుకున్న కథ ఇదే!

కేసీఆర్ బాటలోనే కవిత కొత్త హామీ.. ‘భూ లక్ష్మి’ పథకం వర్కవుట్ అవుతుందా?

దిమాగీ నక్సల్స్ వ్యాఖ్యల దుమారం.. ప్రధాని మోడీ కామెంట్స్‌పై తీవ్ర ఉత్కంఠ!

ఉరిశిక్షకు ప్రత్యామ్నాయంగా ఇంజెక్షన్, కరెంట్ షాక్.. అత్యున్నత స్థాయిలో పరిశీలిస్తున్న కేంద్రం!

డీఎస్సీ ఇష్యూను వదిలే ప్రసక్తే లేదు.. కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఫైర్!

ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెండింగ్‌లో 4 వేలకు పైగా కేసులు.. ఏళ్ల తరబడి తేలని విచారణ!

తెలంగాణ బీజేపీకి హైకమాండ్ షాక్.. అంతర్గత విభేదాలకే చెక్ పెట్టేలా కొత్త వ్యూహం?

Big Stories

Advertisement
×