Brahmamudi serial today Episode: రూంలో ఒక్కడే కూర్చుని కావ్య గురించి ఆలోచిస్తుంటాడు రాజ్. మరోవైపు కావ్య కూడా రూంలో ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. రాజ్ చేసిన పనులు కావ్య, కావ్య చేసిన పనులు రాజ్ గుర్తు చేసుకుంటూ ఉంటారు. మరోవైపు రుద్రాణి హమ్మయ్యా చాలా రిలాక్స్‌డ్‌గా ఉంది రాహుల్ అంటూ కూర్చుంటుంది. నాకు మాత్రం చాలా గిల్టీగా ఉంది మామ్ అటాడు. ఎందుకు అని రుద్రాణి అడగ్గానే.. ఎందుకేంటి..? ఇందాక అందరూ నిన్ను కార్నర్ చేసి ఎలా తిట్టారో విన్నావు కదా..? అంటాడు రాహుల్. అయ్యో రాహుల్ ఆ మాత్రం దానికే నువ్వు ఫీల్ అవుతున్నావా..? మన లాంటి వాళ్లు కొన్ని విషయాల్లో చాలా ప్రాక్టికల్‌గా ఉండాలిరా..? దున్నపోతు మీద వాన పడితే ఎలా దులిపేసుకుంటుందో అలా దులిపేసుకోవాలి. ఇన్ని రోజులు రాజ్ ను బయటకు ఎలా పంపించాలా..? మన ఆస్థి మనకు వచ్చేలా ఎలా చేయాలా..? అని టెన్షన్ పడ్డాను. కానీ వాడంతట వాడే ఈ ఇంటికి దూరంగా వెళ్లిపోతున్నాడురా..?రాజ్ ఎట్టి పరిస్థితుల్లో ఇక ఈ ఇంటికి తిరిగిరాడు అంటూ హ్యాపీగా ఫీలవుతుంది.
దీంతో రాహుల్ అంత కచ్చితంగా ఎలా చెప్తున్నావు మామ్ వాడు గతం మర్చిపోతేనే ఈ ఇంటిని వెతుక్కుంటూ వచ్చాడు. అలాంటిది ఆ కావ్య మీద కోపంతో వెళ్లిన వాడు మళ్లీ తిరిగి రాడా..? అంటాడు. కోపంతో వెళ్లి ఉంటే మళ్లీ తిరిగి వచ్చేవాడేమో కానీ రాజ్ మోసపోయి వెళ్లాడు. అందుకే ఇంకెప్పటికీ తిరిగి రాడు. ఒకవేళ రాజ్ ఇంటికి రావాలంటే కావ్య ప్రగ్నెన్సీకి కారణం ఎవరో చెప్పాలి. అలా చెప్పాలంటే కావ్య రాజ్ గతం అంతా గుర్తు చేయాలి. కానీ గతం గుర్తు చేస్తే రాజ్ కు ప్రాబ్లమ్ కాబట్టి కావ్య చచ్చినా చెప్పదు. ఇక రాజ్ కావ్యను ఎలా క్షమిస్తాడు. తిరిగి ఎలా అడుగుపెడతాడు అంటూ చెప్పగానే.. రాహుల్ మమ్మీ నువ్వు నిజంగా సూపర్ మమ్మీ.. నీ బుర్రే బుర్ర అంటూ మెచ్చుకుంటాడు.
మరుసటి రోజు అపర్ణ, ఇంద్రాదేవి కావ్య దగ్గరకు వెళ్లి ఓదారుస్తుంటారు. పొద్దుటి నుంచి ఏమీ తినలేదు.. టైం ఎంత అవుతుందో తెలుసా..? కనీసం ఇప్పుడైనా టిఫిన్ చేయ్ కావ్య అంటుంది ఇంద్రాదేవి. ఆకలి చచ్చిపోయింది అమ్మమ్మ..నాకు తినాలని లేదు అంటుంది కావ్య. దీంతో ఇంద్రాదేవి పిచ్చి పిల్ల నా మనవడు ఏదో నాలుగు తప్పుడు మాటలు అన్నాడని వాటినే తలుచుకుంటూ కూర్చుంటే ఎలా..? అంటుంది. ఇందులో నీ తప్పేం ఉంది కావ్య నువ్వెందుకు బాధపడాలి అంటుంది అపర్ణ.
నేను అదే అంటున్నాను అత్తయ్య ఇందులో నేను చేసిన తప్పు ఏముంది. ఆయన చేత తాళి కట్టించుకోవడం నేను చేసిన తప్పా..? ఆయన నన్ను ఎంత దూరం పెట్టినా నవ్వుతూ భరిస్తూ ఉండటం నేను చేసిన తప్పా..? గతం గుర్తు లేని ఆయనకు నిజం చెప్తే ఆయనకు ఏ ప్రమాదం జరుగుతుందో అని భయపడ్డాను. తనంటే నాకు ఎంత ఇష్టం ఉన్నా ఇప్పుడు తనంటే ఇష్టం లేదని చెప్పడం నా తప్పా..? అంటూ కావ్య మాట్లాడుతుంటే.. నీ బాధ మేము అర్థం చేసుకోగలం కావ్య కానీ వాడి మీద కోపాన్ని నీ బిడ్డ మీద చూపించకు అంటుంది అపర్ణ. అవును కావ్య నీ కోసం కాకపోయినా ఈ ఇంటిలో పెరుగుతున్న ఈ ఇంటి వారసుడి కోసమైనా నువ్వు తినాలి అని ఇంద్రాదేవి చెప్తుంది. దీంతో కావ్య సరే ఆయన నన్ను తిట్టారని నేనెందుకు నా బిడ్డను పస్తులు ఉంచాలి. నా కారణంగా నా బిడ్డ ఎందుకు ఆకలితో ఉండాలి.. కానీ ఒక తల్లిగా నా బిడ్డను ఆకలితో ఉంచి వాడికి అన్యాయం చేయలేను అత్తయ్యా ఇవ్వండి అంటూ బోజనం చేస్తుంది కావ్య.
మరోవైపు రాజ్, కావ్య గురించి ఆలోచిస్తుంటే యామిని వెళ్తుంది. ఏంటి బావ అలా ఉన్నావు.. మూడ్ బాగాలేదా..? అని అడుగుతుంది. దీంతో రాజ్ అవును యామిని ఏం చేసినా కళావత గారే గుర్తుకు వస్తున్నారు అని చెప్తాడు. దీంతో యామిని మందు తీసుకొచ్చి నా మనసులో ఉన్న బాధ పోవాలంటే ఇది తాగు బావ అంటూ రెచ్చగొడుతుంది. రాజ్ పుల్లుగా తాగి ఆ బాటల్ తీసుకుని బయటకు వెళ్తాడు. ఒక దగ్గర రోడ్డు మీద పడుకుని ఉంటే కావ్య చూసి షాక్ అవుతుంది. రాజ్‌ను ఇంటికి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తే రాజ్ రానని చెప్తాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం