OTT Movie : ఒక ఆసక్తికరమైన రొమాంటిక్ డ్రామాను చూడాలనుకుంటే, ఇప్పుడు చెప్పుకోబోయే తమిళ సినిమాపై ఓ లుక్ వేయండి. ఈ సినిమాలో స్టోరీతోపాటు, కామెడీ కూడా ఉంటుంది. ఈ చిత్రంలోఒక మధ్యతరగతి యువకుడు, రిచ్ అమ్మాయితో లవ్ లో పడతాడు. వీళ్ళ మనస్తత్వాలు వేరు కావడంతో, స్టోరీ కూడా ఆసక్తికరంగా సాగుతుంది. యువన్ శంకర్ రాజా ఆకర్షణీయమైన సంగీతంతో ఈ సినిమా మరో లెవల్ లో ఉంటుంది. అంతేకాకుండా ఈ చిత్రం రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్, రెండు SIIMA అవార్డ్స్ ను గెలుచుకుంది. రైజా విల్సన్‌కు రెండు వేదికలలో ఉత్తమ డెబ్యూ నటి అవార్డు లభించింది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఎలావుంటుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …
ఎందులో ఉందంటే
‘ప్యార్ ప్రేమ కాదల్’ (Pyaar Prema Kaadhal) తమిళ రొమాంటిక్ కామెడీ చిత్రం. ఎలన్ దర్శకత్వంలో రూపొందింది. యువన్ శంకర్ రాజా దీనిని నిర్మించడంతో పాటు, సంగీతాన్ని కూడా అందించారు. ఈ సినిమా 2018 ఆగస్టు 10న థియేటర్లలో విడుదలై, ప్రస్తుతం ZEE5 లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో హరీష్ కల్యాణ్, రైజా విల్సన్, ఆనంద్ బాబు, రేఖా, పాండియన్, మునీష్‌కాంత్, సుబ్బు పంచు నటించారు. IMDbలో 6.4/10 రేటింగ్ పొందింది.
కథలోకి వెళ్తే
శ్రీ మధ్యతరగతి కుటుంబానికి చెందిన సాంప్రదాయ మనస్తత్వం కలిగిన యువకుడు. తల్లిదండ్రులతో సంతోషంగా ఉంటాడు. అతను సింధుజా అనే ఒక ఇండిపెండెంట్ అమ్మాయిని కలుస్తాడు. తన తండ్రి మద్దతుతో లాస్ ఏంజెల్స్‌లో రెస్టారెంట్ నడపాలనే కలలు కంటుంది. శ్రీ, సింధుజా మధ్య ప్రేమ మొదలవుతుంది. కానీ శ్రీ పెళ్లి, సంసారం అనే ఆలోచనలతో ఉంటే, సింధుజా లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌ను ఇష్టపడుతుంది. ఈ ఆలోచనలతో వీళ్ళ సంబంధంలో సమస్యలు వస్తాయి. అయితే శ్రీ ఏమీ చెయ్యలేక లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌కి ఒప్పుకుంటాడు. కానీ వీళ్ళ లైఫ్ స్టైల్ లో ఉండే తేడాలు సమస్యలు సృష్టిస్తాయి. తన తల్లిదండ్రులకు చెప్పకుండా సింధుజాతో కలిసి జీవించడంతో శ్రీ డిప్రెషన్ కి వెళ్తాడు.
ఈ సమయంలో ఇద్దరిమధ్య గొడవలు పెరుగుతాయి. శ్రీ, సింధుజా విడిపోతారు. శ్రీ తన తల్లిదండ్రులు చుసిన వేరొక అమ్మాయిని వివాహం చేసుకుంటాడు. కొన్ని సంవత్సరాల తర్వాత, శ్రీ విడాకులు తీసుకుంటాడు. సింధుజా ఇంకా వివాహం చేసుకోకుండా ఉందని తెలుసుకుంటాడు. వీళ్ళు మళ్లీ కలుస్తారు. తమ గతాన్ని గుర్తుకు చేసుకుంటారు. ఇక ఈ క్లైమాక్స్ కూడా ఎమోషన్ ట్విస్ట్ తో ఎండ్ అవుతుంది ? సింధుజా ఎందుకు పెళ్లి చేసుకోలేదు ? శ్రీ మళ్ళీ సింధుజా ప్రేమలో పడతాడా ? క్లైమాక్స్ ట్విస్ట్ ఏమిటి ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ రొమాంటిక్ కామెడీ సినిమాని మిస్ కాకుండా చుడండి.