Brahmamudi serial today Episode: రూంలోకి వెళ్లిన రాజ్, కావ్యకు ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను అంటాడు. దీంతో కావ్య ఎగ్జైంటింగ్ గా ఫీలవుతుంది. మీరేం చెప్పినా వింటాను..అంటుంది కావ్య. ఇప్పుడు ఈ విషయం చెబితే నువ్వు నమ్ముతావో లేదో నాకు తెలియదు అని రాజ్ చెప్పగానే ముందు విషయం చెప్పండి మిగతాది కు వదిలేయండి అని కావ్య చెప్పగానే రాజ్, కావ్య చేతులు తన చేతుల్లోకి తీసుకుంటాడు. ఈ విషయం మన మధ్యే ఉండాలి ఎవరికీ చెప్పకూడదు.. అని రాజ్ అడగ్గానే భలే వారే భార్యభర్తల మధ్య విషయం ఎవరైనా బయటకు చెప్పుకుంటారా..? మీరు చెప్పండి అని కావ్య అడగ్గానే.. నేనొక పెద్ద సమస్యలో ఉన్నాను. నువ్వే నాకు సాయం చేయాలి. ఇప్పటి వరకు జరగరానిది జరిగింది.
అది దుగ్గిరాల వంశ ప్రతిష్టకు, స్వరాజ్ గ్రూప్ ఆఫ్ మనుగడకు పెద్ద సవాలుగా మారనుంది అని రాజ్ చెప్తుంటే.. అసలు ఏం జరిగిందండి అని కావ్య అడుగుతుంది. దీంతో సీతారామయ్య 100 కోట్లకు షూరిటీ ఇచ్చిన విషయం. బ్యాంకు వాళ్లు ఇచ్చిన గడువు గురించి మొత్తం చెప్తాడు రాజ్. రాజ్ మాటలకు కావ్య షాక్ అవుతుంది. మీలో ఇంత సంఘర్షణ జరుగుతుందా..? ఇంత సమస్యను గుండెల్లో దాచుకుని ఎవరికి చెప్పుకోలేక మీలో మీరే నలిగిపోతున్నారా.? ముందే నాకెందుకు చెప్పలేదు అని కావ్య ప్రశ్నించగానే.. ఇంట్లో ఎవ్వరికీ తెలియకూడదని ఊరుకున్నాను నీకు తోచిన ఏదైనా పరిష్కారం చెప్పవా అని రాజ్ దీనంగా అడుగుతాడు. నేనేం చెప్పగలను అంటుంది కావ్య.. ఇప్పటికి ఇప్పుడే బ్యాంకు వాళ్లకు వంద కోట్లు అంటే ఎక్కడి నుంచి తీసుకురాగలం అంటుంది.
కానీ తెల్లవారేలోగా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఏదైనా ఆలోచిద్దాం. రేపు మీతో పాటు నేను కూడా ఆఫీసుకు వస్తాను. ఇద్దరం కలిసి బ్యాంకు వాళ్లతో మాట్లాడుదాం అని కావ్య చెప్పగానే రాజ్, కావ్యను హగ్ చేసుకుంటాడు. మరుసటి రోజు ఉదయం రాజ్, కావ్య ఆఫీసుకు బయలుదేరుతారు. ఇంతలో ప్రాపర్టీ డ్యాకుమెంట్స్ తీసుకుని ఇవి మీ బ్యాగులో పెట్టుకోండి అని ఇవ్వగానే ఒకవేళ బ్యాంకు వాళ్లకు ఎదురు తిరిగి ఈ ప్రాపర్టీ నాది అంటూ తాతయ్యకు సంబంధం లేదంటావా..? అని రాజ్ అడుగుతాడు. అలా ఎందుకు అంటానండి మీరు నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా..? అంటుంది కావ్య. కావ్యకు రాజ్ సారీ చెప్తాడు. ఇద్దరూ కలిసి ఆఫీసుకు బయలుదేరుతారు. రాజ్, కావ్య కలిసి రావడం చూసిన అపర్ణ, సుభాష్ ఆశ్చర్యపోతారు.
అసలు వీళ్లిద్దరూ కలిసి రావడం ఏంటి అని సుభాష్ అంటాడు. కలిసి వచ్చినంత మాత్రాన కలిసిపోసినట్లు కాదు బావగారు..? అంటుంది ధాన్యలక్ష్మీ.. అసలు నీ నోట వెంట ఒక్క మంచి మాటైనా వస్తుందా..? ధాన్యలక్ష్మీ అంటూ తిడుతుంది అపర్ణ. కిందికి మీరిద్దరూ కలిసి వచ్చారేంటి అని సుభాష్ అడుగుతాడు. కలిసి రావడం కాదు మామయ్య కలిసి వెళ్తున్నాం కూడా అని కావ్య చెప్తుంది. ఎక్కడికి వెళ్తున్నారు అని అపర్ణ అడుగుతుంది. ఆఫీసుకు వెళ్తున్నామని చెప్తాడు రాజ్. మీరిద్దరూ కలిసి వెళ్లున్నారా..?అని ధాన్యలక్ష్మీ అడగ్గానే ఏం వెళ్లకూడదా..? పిన్ని అని రాజ్ ఎదురు ప్రశ్నిస్తాడు. తను రాకపోతే ఎలా పిన్ని తనే కదా అన్ని చేయాల్సింది అని రాజ్ చెప్పగానే తను చేయాల్సింది ఏముంటుంది అని అందరూ కంగారుగా అడుగుతారు. కొన్ని డిజైన్స్ వేయాలంట అవి నేనే వేస్తేనే బాగుంటుందని తీసుకెళ్తున్నారు అని కావ్య చెప్తుంది.
తర్వాత ఇద్దరూ కలిసి ఆఫీసుకు వెళ్తారు. అది చూసిన రుద్రాణి వాళ్లిద్దరూ ఆఫీసుకు వెళ్లడం ఏంటి అని స్వప్నను నిలదీస్తుంది. అయినా ఆ కీస్ ఏంటి అని అడుగుతుంది. కావ్య ఇంటి పెత్తనం నాకు అప్పగించింది అని స్వప్న చెప్పి వెళ్లిపోతుంది. తర్వాత కనకానికి అపర్ణ ఫోన్ చేసి రాజ్, కావ్య కలిసిపోయారని చెప్తుంది. కనకం, మూర్తి హ్యాపీగా ఫీలవుతారు. ఆఫీసుకు వెళ్లిన రాజ్, కావ్య దగ్గరకు బ్యాంకు వాళ్లు వచ్చి డబ్బు ఎప్పుడు ఇస్తారో చెప్పండి అని అడగ్గానే అంత మొత్తం ఒకేసారి కట్టలేము కదా..? ఇన్‌స్టాల్ మెంట్ గా కడతామని రిక్వెస్ట్ చేస్తుంది. దీంతో కన్వీన్స్ అయిన బ్యాంకు వాళ్లు కావ్య ప్రపోజల్‌కు అంగీకరిస్తారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?