Ashwin – Tanush Kotian: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 టోర్నమెంట్ లో ( Border-Gavaskar Trophy 2024/25 ) భాగంగా… టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్లు.. తలపడుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ టోర్నమెంట్లో ఇప్పటికే మూడు టెస్టులు పూర్తి అయ్యాయి. మరో రెండు టెస్టులు బాకీ ఉన్నాయి. నాలుగో టెస్ట్ అలాగే ఐదో టెస్టు టీమిండియా ఆస్ట్రేలియా గడ్డపై ఆడాల్సి ఉంది. అయితే 26వ తేదీ అంటే ఎల్లుండి నుంచి టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మెల్ బోర్న్ వేదికగా నాలుగో టెస్ట్ ప్రారంభం కానుంది.
Also Read: Virat Kohli: కోహ్లీకి వాళ్లతో పోలికా..? పాక్ మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు!
ఇలాంటి నేపథ్యంలోనే నాలుగో టెస్ట్ కు అలాగే ఐదవ టెస్టుకు గాను టీమిండియా జట్టును ప్రకటించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. వాస్తవంగా రవిచంద్రన్ అశ్విన్… ఈ టోర్నమెంట్లో పూర్తి మ్యాచ్లు అయ్యేవరకు ఉంటాడని అందరూ అనుకున్నారు. కానీ రవిచంద్రన్ అశ్విన్ మాత్రం రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో.. అతడి స్థానాన్ని భర్తీ చేసేందుకు మళ్లీ స్పిన్నర్ అవసరమని… కొత్తగా తుది జట్టును ప్రకటించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి.
ఇందులో భాగంగానే తెరపైకి…తనుష్ కోటియన్ ( Tanush Kotian ) అనే కొత్త అన్ క్యాప్ డ్ ప్లేయర్ ను తీసుకొచ్చింది బీసీసీఐ. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో నాలుగో టెస్టు గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ తరుణంలోనే… అశ్విన్ స్థానాన్ని తనుష్ కోటియన్ తో ( Tanush Kotian ) భర్తీ చేశారు. దీంతో… తనుష్ కోటియన్… ఆస్ట్రేలియా ప్లైట్ ఎక్కుతున్నాడు. 26 ఏళ్ల కోటియన్ ( Tanush Kotian ) 33 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 25.70 సగటుతో 101 వికెట్లు పడగొట్టాడు. అతను 47 ఇన్నింగ్స్‌లలో 41.21 సగటుతో రెండు సెంచరీలు చేశాడు. 13 అర్ధసెంచరీలతో మొత్తం 1525 పరుగులు చేశాడు తనుష్ కోటియన్. ఇక తనుష్ కోటియన్ ( Tanush Kotian ) కూడా ఆల్ రౌండర్ కావడంతో.. తెరపైకి తీసుకొచ్చారు. ఇక అటు ఆస్ట్రేలియా టూర్ కు వస్తాడని అందరూ అనుకుంటే.. షమీకి నిరాశే ఎదురైంది. అతన్ని సెలక్ట్ చేయలేదు బీసీసీఐ.
నాలుగు, ఐదో టెస్టులకు భారత జట్టు ఇదే
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (విసి), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్), సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్), రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్ , ప్రసిధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, దేవదత్ పడిక్కల్, తనుష్ కోటియన్
Also Read: Champions Trophy 2025: టీమిండియా జట్టు ప్రకటన.. రంగంలోకి కొత్త ప్లేయర్లు?
#TanushKotian gets the India call-up for the Border-Gavaskar Trophy! 🇮🇳
The Mumbai off-spinner, with 101 FC wickets @ 25.70 & a batting avg of 41, is a true all-rounder.He gained valuable experience alongside Ashwin at RR in IPL 2024. Exciting times ahead.… pic.twitter.com/Oo3MQUyx1s
— s.v.saravana sundar (@saravana_s_v) December 23, 2024