E-Paper
Advertisement

Brahmamudi Serial Today December 27th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: మంటల్లో కాలిపోతున్న దుగ్గిరాల ఇల్లు 

Brahmamudi Serial Today December 27th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: మంటల్లో కాలిపోతున్న దుగ్గిరాల ఇల్లు 
Advertisement

Brahmamudi serial today Episode:

నిద్రపోతున్న కావ్యకు తమ ఇల్లు కాలిపోతున్నట్టు కల వస్తుంది. దీంతో కావ్య ఉలిక్కిపడి నిద్ర లేస్తుంది. ఏవండి అంటూ కేక వేస్తుంది. ఆ సౌండ్‌కు రాజ్‌ కూడా ఉలిక్కిపడి నిద్ర లేస్తాడు. ఏమైంది కళావతి అని అడగ్గానే.. మన ఇల్లు కాలిపోయినట్టు కల వచ్చిందండి అని చెప్పగానే.. రాజ్‌ ఏంటి కలగన్నావా..? అంటాడు. దీంతో కావ్య అది కలలా అనిపించలేదు అండి నిజంగా కళ్ల ముందు జరిగినట్టు అనిపించింది అండి అని చెప్పగానే.. రాజ్‌ అయినా చిన్న పిల్లలా కలకు భయపడతావేంటి..? అంటాడు. దీంతో కావ్య నాకు చాలా సార్లు పీడ కలలు వస్తూ ఉంటాయి. నేను దేనికి ఇంతలా భయపడలేదు.. నా మనసు ఎందుకో కీడు శంకిస్తుంది అండి అని చెప్పగానే.. రాజ్‌ నిర్లక్ష్యంగా కీడు లేదు కాకరకాయ లేదు అదంతా మన బ్రెయిన్‌ క్రియేట్ చేసే ఇల్యూషన్‌ అంతే అని చెప్పగానే..

అయ్యో నేను చెప్తున్నాను కదా మీరెందుకు ఇంత సింపుల్‌గా తీసుకుంటున్నారు ఏంటి..? ఇల్లు కాలిపోతున్నట్టు కల రావడం మామూలు కాదండి అని చెప్పగానే.. రాజ్‌ కూల్‌గా నువ్వు పడుకున్నప్పుడు ఏం చేస్తున్నావు.. అని అడగ్గానే.. కొత్త ఇంటికి స్కెచ్‌ గీసాను కదా అని చెప్తుంది. మరి పడుకున్నప్పుడు నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి. కొత్త ఇంటికి స్కెచ్‌ వేశావు. అందుకే నీకు అలాంటి కల వచ్చింది అని చెప్పగానే.. ఎవండి మీరు చెప్పింది నిజం అయితే నేను గీసిన డిజైన్‌లో ఉన్న ఇల్లు కాలిపోయినట్టు కల రావాలి కానీ మన ఇల్లు కాలిపోతున్నట్టు కల వచ్చిందేంటి అని కావ్య అడగ్గానే.. మనకు వచ్చే కలకు కూడా లాజిక్‌ ఉండాలన్న నీ ఆలోచనకు హ్యాట్సాప్‌ కళావతి. మార్నింగ్‌ ఆఫీసులో చాలా పని ఉందే నన్ను పడుకోనివ్వవే.. అంటూ పడుకుంటుంటే.. అది కాదండి.. సరే మీరు పడుకోండి అంటూ కావ్య అలాగే కూర్చుని ఉంటే.. ఏయ్‌ నువ్వేం చేస్తావు.. నాకొచ్చిన కల గురించి ధీసెస్ రాసి ప్రాజెక్టు రిపోర్ట్‌ ఏమైనా రాస్తావా పడుకో నువ్వు కూడా అంటాడు రాజ్‌, సరే అంటూ పడుకుంటుంది కావ్య.

Advertisement

తన రూంలో కూర్చున్న రాహుల్ కోపంగా చూస్తూ.. పది రోజుల్లో నా బిజినెస్‌ను తారాస్థాయికి తీసికెళ్లిన వాడిని కానీ ఇంతలోనే ఇంత డల్‌ అయిపోతుంది అనుకోలేదు. లాభం లేదు ఏదో ఒకటి చేయాలి అని మనసులో అనుకుంటుంటే.. అప్పుడే అక్కడకు వచ్చిన రుద్రాణి ఏంట్రా ఆలోచిస్తున్నావు మళ్లీ ఈ ఫ్యామిలీ మోచేతి నీళ్లు ఎలా తాగాలి అని ఆలోచిస్తున్నావా..? మళ్లీ వీళ్ల అందరి కాళ్ల దగ్గర సాగిలపడి ఎలా బతకాలి అని ఆలోచిస్తున్నావా..? అంటూ అడగ్గానే.. రాహుల్‌ కోపంగా మామ్‌ అంటాడు. ఏం కోపం వచ్చిందా..? నేను అన్న దాంట్లో తప్పేం ఉందిరా..? ఇప్పుడు కానీ మళ్లీ నువ్వు బిజినెస్‌లో పుంజుకోకపోతే నీకు మిగిలేది చిప్పే.. నీ తెలివిని నీ శక్తిని నీ కన్నింగ్‌ మెంటాలిటీని ఉపయోగించి పది రోజుల్లోనే ఆ రాజ్‌, కావ్య షాక్‌ అయ్యేలా ఎదిగి చూపించినవాడివి.. కానీ వాళ్లు నెల రోజుల్లోనే వాళ్ల బిజినెస్‌ను పెంచుకోవడమే కాకుండా నీకు అసలు బిజినెస్‌ లేకుండా చేశారు. చూశావా వాళ్ల టాలెంట్‌.. అలాంటిది వాళ్లను ఎలా ఎదుర్కొంటారు. నీ బిజినెస్‌ను ఎలా పెంచుకుంటావు. వాళ్లకు సమంగా ఎలా నిలబడతావు.. అని అడుగుతుంది.

దీంతో రాహుల్‌ అదే ఆలోచిస్తున్నాను మామ్‌ అని చెప్తాడు. దీంతో టైం ఎప్పుడూ మనది కాదు అందుకనే నువ్వు వాళ్లను మార్కెట్‌ లో కొట్టలేవు కాబట్టి ఇంట్లో నుంచి నరుక్కొద్దాం అంటున్నాను. రాజ్‌, కావ్య మీద పడే దెబ్బ ఇంట్లో నుంచే మొదలవ్వాలి అని చెప్పగానే.. రాహుల్ వద్దు మామ్‌ నువ్వు అలాంటి ప్లాన్స్‌ ఏమీ వేయోదు అంటాడు. ప్లాన్స్‌ వేయక వాళ్లు అలా ఎదుగుతూ ఉంటే.. నువ్వు ఇలా కుంగిపోతూ ఉంటూ చూస్తూ కూర్చోమంటావా..? అంటుంది రుద్రాణి. దీంతో ఇప్పుడు దానికి పరిష్కారం దొరికింది. నేను ఎలా మార్కెట్‌ లో నిలబడాలో తెలిసింది అని చెప్పగానే.. ఇప్పుడు అది నువ్వు అనుకుంటున్నంత ఈజీ కాదు.. వాళ్లను నువ్వు బిజినెస్‌లో దెబ్బ కొట్టడం అంత సులువు కాదు అని చెప్పగానే.. రాహుల్‌ తన ప్లాన్‌ చెప్తాడు. దొంగ బంగారం కొని బిజినెస్‌ చేస్తానని అది రాజ్‌ మీదకు నెట్టేస్తానని చెప్తాడు. రుద్రాణి హ్యాపీగా పీలవుతుంది.

Advertisement

తర్వాత కావ్య దేవుడికి పూజ చేసి హారతి తీసుకుని రాజ్‌ దగ్గరకు రాగానే హారతి ఆరిపోతుంది. దీంతో కావ్య, అపర్ణ, ఇంద్రాదేవి టెన్షన్‌ పడుతారు. కావ్య తనకు వచ్చిన కల గురించి చెప్పి బాధపడుతుంది. దీంతో అందరూ కలిసి పంతులు దగ్గరకు వెళ్తారు. తర్వాత అప్పు గార్డెన్‌లో ఉండి తనకు బోర్ కొడుతుందని చెప్తుంది. ఇంతలో ధాన్యలక్ష్మీ వచ్చి కొన్ని బుక్స్‌ ఇస్తూ ఈ బుక్స్‌ చదివి సివిల్స్‌కు ప్రిపేర్ అవ్వమని చెప్తుంది. దీంతో ప్రకాష్‌, కళ్యాణ్‌ షాక్‌ అవుతారు. మరోవైపు కొత్త డీలర్‌ అంటూ ఒక వ్యక్తి వచ్చి రాజ్‌ను కలుస్తాడు. తక్కువ రేటుకు గోల్డ్‌ సప్లయ్‌ చేస్తానని చెప్తాడు. దీంతో రాజ్‌ ఆ వ్యక్తని అనుమానిస్తాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ జంట.. మరో బిడ్డకు ఆహ్వానం!

మాధురి రాథోడ్ తల్లిపై ఈశ్వర్ సాయి భార్య ఊహించని కామెంట్స్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 5th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండను తిట్టిన మనోహరి  

Gundeninda Gudigantalu : సీరియల్ లవర్స్ కు షాక్.. రోహిణి ఇక కనిపించదా..?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. శృతి దెబ్బ అదుర్స్.. రోహిణి మాస్టర్ ప్లాన్ ..?

Illu Illalu Pillalu Today Episodes: విశ్వం ప్లాన్ సక్సెస్.. ధీరజ్ కోసం ప్రేమ కన్నీళ్లు.. అడ్డంగా బుక్కయిన ధీరజ్..

Ninnu kori Serial Today Episode September 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: డాక్టర్ ను బెదిరించి నిజం తెలుసుకున్న విరాట్  

Intinti Ramayanam Today Episode: గుండెలు పగిలేలా ఏడ్చిన అక్షయ్.. అయ్యో కన్నీళ్లు తెప్పించే సీన్.. పల్లవి ఫుల్ హ్యాపీ..

Big Stories

Advertisement
×