E-Paper
Advertisement

Brahmamudi Serial Today December 4th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్య డిజైన్స్ కొట్టేసిన రాహుల్ 

Brahmamudi Serial Today December 4th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్య డిజైన్స్ కొట్టేసిన రాహుల్ 
Advertisement

Brahmamudi serial today Episode:  

బయకు వెళ్లిన అప్పు, కళ్యాణ్‌ స్టేషన్‌కు వెళ్లడానికి వెళ్తారు. కారు ఆగిపోయిన అప్పు.. కళ్యాణ్‌ ఏమైంది పొట్టి అని అడగ్గానే.. కూచి ఇలా ఇంట్లో వాళ్లను మోసం చేసి బయటకు రావడం నాకు ఇష్టం లేదు వారం రోజుల్లో ఎలాగైనా ఈ కేసును సాల్వ్‌ చేసి అత్తయ్య కోరుకున్న కోడలిగా ఇంట్లోనే ఉండిపోతాను అని చెప్తుంది.. మరోవైపు రాహుల్‌ కూడా వారం రోజుల్లో మీ జీవితాలను తారు మారు చేసేస్తాను అనుకుంటాడు. కారు దగ్గర నిలబడిన రాజ్‌ కూడా కావ్యతో ఈ వారం రోజుల్లో మన సమస్యలన్నీ తీరిపోతాయి అని చెప్తాడు. అప్పు కూడా ఈ వారం రోజుల్లో కేసు సాల్వ్‌ చేస్తాను అంటుంది. అటు కావ్య సరే పదండి అనగానే రాజ్‌ కారు స్టార్ట్‌ చేస్తాడు. కళ్యాణ్‌, అప్పు.. రేణుక దగ్గరకు వెళ్తారు. రేణుక అప్పును తీసుకుని ఒక దగ్గరకు తీసుకువెళ్లి ఇక్కడే తనకు పాప కనిపించింది అని చెప్తుంది.

ఇంతలో రేణుకు భర్త వచ్చి సంవత్సరం నుంచి తను ఇలాగే చెప్తుందని ఆ భ్రమలోంచి బయటకు రమ్మని చెప్తాడు. అయినా నా మాట తను నమ్మడం లేదు అంటాడు. దీంతో రేణుక ఏడుస్తూ లేదండి నాది భ్రమ కాదు ఫ్లీజ్‌ నన్ను నమ్మండి అంటూ ఏడుస్తుంది. దీంతో రేణుక భర్త తను పాప గురించి మర్చిపోతుంటే.. మీరొచ్చి మళ్లీ గుర్తు చేస్తున్నారని అంటాడు. నిజానిజాలు బయటకు తీయాల్సింది మేము మీరు రేణుకను తీసుకుని లోపలికి వెళ్లండి అని చెప్పగానే.. అతను రేణుకను తీసుకుని వెళ్లిపోతాడు. వాళ్లు వెళ్లిపోయాక చుట్టుపక్కల వాళ్లను అప్పు ఎంక్వైరీ చేస్తుంది. ఎవ్వరిని అడిగినా రేణుక పాప చనిపోయిందని చెప్తుంటారు.

Advertisement

మరోవైపు కేరళ వెళ్లిన రాజ్‌, కావ్య ఒక ప్రకృతి చిక్సిత్సాలయానికి వెళ్తారు.  అక్కడి లోకేషన్‌ చూసిన కావ్య చాలా హ్యాపీగా ఫీలవుతుంది. అక్కడ ట్రీట్‌మెంట్‌ కోసం జాయిన్‌ అవుతారు. మరోవైపు మేనేజర్‌ సతీష్‌ తన మనుషులతో స్వరాజ్‌ కంపెనీ కోసం రాజ్‌, కావ్య వేసిన డిజైన్స్‌ దొంగిలించి రాహుల్‌కు ఇస్తాడు. అవి చూసిన రాహుల్‌ చాలా హ్యాపీగా ఫీలవుతాడు. థాంక్యూ సతీష్‌ నువ్వు డెవలప్‌ కావాలంటే నీకు ధైర్యం ఉండాలని చెప్పాను.. కావ్య వేసిన డిజైన్స్‌ తీసుకొచ్చి నీ ధైర్యం నిరూపించుకున్నావు.. గ్రేట్‌ సతీష్ గ్రేట్‌.. అని మెచ్చుకుంటాడు. దీంతో సతీష్‌ సార్‌ స్వరాజ్‌ కంపెనీలో పని చేస్తున్న నా అసిస్టెంట్‌ను ఒప్పించి చాలా రిస్క్‌ చేసి కావ్య గారి డిజైన్స్‌ దొంగిలించాను సార్‌ అని చెప్పగానే..

ఎలా అయితేం ఏం సతీష్‌ మనం అనుకున్నది అయితే జరిగింది కదా..? అంటాడు రాహుల్‌. అది కాదు సార్‌ రాజ్‌ సార్‌ గురించి మీకు తెలుసు కదా..? ఆయనకు అసలే కోపం ఎక్కువ. ఇప్పుడు వాళ్ల డిజైన్స్‌ కొట్టేశామని తెలిస్తే నన్ను చంపేస్తారేమో సార్‌ అని భయపడుతుంటే.. రాజ్‌ నుంచి నిన్ను రక్షించే బాధ్యత నాది.. నేను అనుకున్న ప్లాన్‌ వర్కవుట్‌ అయి క్లయింట్స్ అందరూ తిరిగి వచ్చారంటే నువ్వు సెటిల్‌ అయిపోయినట్టే.. అలాగే మన కంపెనీకి ఒక కొత్త డిజైనర్‌ కావాలి. వాడు ఈ కావ్య గీసిన డిజైన్స్‌ మళ్లీ గీసి ఇచ్చేలా చేయ్‌ అని చెప్పగానే.. సతీష్‌ సరే సార్‌ అంటూ వెళ్లిపోతాడు.

Advertisement

మరోవైపు కేరళ చికిత్సాలయంలో కావ్య, రాజ్‌ ఉంటారు. నిజంగా అతను చెప్పినట్టు మనసుకు చాలా ప్రశాంతంగా ఉంది కదండి అంటుంది. ఉరుకుల పరుగుల జీవితంలో బతుకుతున్న వాళ్లం కళావతి ఇలాంటి చోట అలాగే ఉంటుంది అని రాజ్‌ చెప్తాడు. ఇంతలో ఒకావిడ వచ్చి తన కష్టం గురించి చెప్పి.. అక్కడి ట్రీట్‌మెంట్‌ గురించి చెప్తుంది. ఇంతలో రాజ్‌, కావ్యలను ఒక వ్యక్తి వచ్చి గురువు దగ్గరకు తీసుకెళ్తారు. గురువు దగ్గరకు వెళ్లి కావ్య రిపోర్ట్స్‌ ఇస్తాడు రాజ్‌. రిపోర్ట్స్‌ చూసిన గురువు సమస్య అర్థమైంది అని చెప్పగానే.. ఈ సమస్యకు పరిష్కారం ఉందా గురువు గారు అని అడగ్గానే.. పరిష్కారం లేని సమస్య లేదు.. నమ్మకాన్ని మించిన వైద్యం లేదు అని చెప్పగానే..

రాజ్‌ ఎమోషనల్‌ అవుతూ.. మేము కలవని డాక్టర్‌ లేడు.. తిరగని హాస్పిటల్‌ లేదు.. ఎంత మందిని కలిసినా వాళ్లు చెప్పిన మాట ఒక్కటే బిడ్డను కాపాడతాము.. తల్లిని కాపాడలేము అని చివరి ప్రయత్నంగా మీ దగ్గరకు వచ్చాము అని చెప్పగానే.. చూడండి కొన్ని సార్లు ఆ సైన్స్‌ కు కూడా అందని పరిష్కారాలు ప్రకృతి మనకు చూపిస్తుంది. ప్రకృతి అంటే అమ్మవారు.. ఆ తల్లిని నమ్మి ప్రకృతిని ఆశ్రయిస్తే చాలు పరిష్కారం చూపిస్తుంది. మనలో ఎలాంటి రుగ్మతలు ఉన్నా వాటి అన్నింటిని దూరం చేస్తుంది అని చెప్పగానే.. రాజ్‌ ఆ నమ్మకంతోనే మిమ్మల్ని ఆశ్రయించాము గురువు గారు.. ఎలాగైనా మీరే కాపాడాలి. అని రాజ్‌ అడగ్గానే.. బాధపడొద్దు అంతా మీకు మంచే జరుగుతుంది అని చెప్పి కావ్యను పరీక్షించి పర్వాలేదని వైద్యం చేస్తామని మేము ఇచ్చే మెడిసిన్స్‌ క్రమం తప్పకుండా వాడాలని చెప్తాడు. కావ్య, రాజ్‌ హ్యాపీగా ఫీలవుతారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×