E-Paper
Advertisement

Brahmamudi Serial Today December 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: స్వప్ను పూర్తిగా నమ్మించిన రాహుల్  

Brahmamudi Serial Today December 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: స్వప్ను పూర్తిగా నమ్మించిన రాహుల్  
Advertisement

Brahmamudi serial today Episode:  

కేరళలో ఉన్న రాజ్‌, కావ్య ఒక రెస్టారెంట్‌కు వెళ్లి మాట్లాడుకుంటుంటే.. పక్కనే కూర్చున్న ఒక అమ్మాయి మీరు లవర్సా అని అడుగుతుంది. దీంతో రాజ్‌ సిగ్గు పడిపోతాడు. కావ్య మాత్రం హస్బెండ్‌ అండ్‌ వైఫ్‌ అని చెప్తుంది. దీంతో రాజ్‌ ఎందుకు కళావతి అలా చెప్పావు వాళ్ల మాట వినడానికి ఎంత బాగుంది. కాసేపైనా హ్యాపీగా అనుభవించనివ్వవా..? అంటాడు.  దీంతో ఆ అమ్మాయి ఓ హనీమూన్‌కు వచ్చారా.? అని అడుగుతుంది. దీంతో రాజ్‌ అవునండి ఫస్ట్‌ టైం అంటాడు. కావ్య మాత్రం ఏవండి హనీమూన్‌కు వచ్చే వాళ్లు ఫస్ట్‌ టైం కాక థర్డ్‌ టైం వస్తారా..? ఎందుకలా చెప్తున్నారు..? అని చెప్పగానే.. ఆ అమ్మాయి మళ్లీ మీ జంట చాలా బాగుందండి. మీరు అసలు భార్యాభర్తల్లా లేరండి అనగానే..

చూశావా కళావతి నీ పక్కన యంగ్‌ డైనమిక్‌ నేను ఉన్నాను కాబట్టి అఅందుకే అలాంటి కాంప్లిమెంట్స్‌ అంటాడు. మీరు యంగ్‌ అండ్‌ డైనమిక్‌ అయితే నేనేంటి పేదరాశి పెద్దమ్మనా..? అంటూ అలుగుతుంది. దీంతో అయ్యో నేను అలా అనలేదు కళావతి ఫ్లీజ్‌ అంటూ కావ్యను రాజ్‌ బతిమిలాడుతుంటే.. ఆ అమ్మాయి సార్‌ మీరు భార్యాభర్తలు అని అర్థం అయిపోయింది. అంటుంది అవునా ఎలా తెలిసింది అని రాజ్‌ అడగ్గానే.. మీరు మీ ఆవిడను బతిమాలుతున్నారు కదా అలా అర్థం అయిపోయింది అని ఆ అమ్మాయి చెప్తుంది.

Advertisement

మరోవైపు రాజ్‌ రూంలోకి వెళ్లి పెన్‌డ్రైవ్‌ వెతకాలని రౌడీలు అనుకుంటారు. అందుకోసం చెఫ్‌ల డ్రెస్‌ వేసుకుని రాజ్‌ రూం దగ్గరకు వెళ్తారు. తెలివిగా రూం ఓపెన్‌ చేసి పెన్‌డ్రైవ్‌ కోసం వెతుకుతుంటారు. అప్పుడే రూం సర్వీస్‌ బాయ్‌ వచ్చి రౌడీలను ఎవరని అడుగుతాడు.. బాత్రూం క్లీన్‌ చేయమని సర్వీస్‌ బాయ్‌ చెప్పగానే.. గతి లేని పరిస్థితిలో బాత్రూం క్లీన్‌ చేస్తారు. రూం క్లీన్‌ చేస్తున్న బాయ్‌కి పెన్‌ డ్రైవ్‌ దొరుకుతుంది. అది తీసుకెల్లి రిసెప్షన్‌లో ఇవ్వాలనుకుంటాడు సర్వీస్‌ బాయ్‌.

రాహుల్‌, స్వప్నను బయటకు లంచ్‌కు తీసుకెళ్తానని చెప్పగానే.. స్వప్న రెడీ అవుతుంది. నువ్వు ఇలా అందంగా రెడీ అయి ఎన్ని రోజులు అయింది స్వప్న అంటాడు రాహుల్‌. దీంతో స్వప్న మన పెళ్లి అయ్యాక ఫస్ట్‌ టైం నువ్వు నన్ను లంచ్‌కు తీసుకెళ్తానన్నావు అలాంటప్పుడు ఈమాత్రం రెడీ అవ్వాలి కదా..? అంటుంది స్వప్న. దీంతో రాహుల్‌ ఇన్ని రోజులు మా అమ్మ మాటలు నమ్మి మూర్ఖంగా ఉన్నాను. ఇక అలా ఉండకూడదు అనుకుంటున్నాను అని రాహుల్‌ చెప్తూ.. ఒక నెక్లెస్‌ స్వప్న మెడలో పెట్టగానే.. ఇదెప్పుడు కొన్నావు అని అడుగుతుంది. నీ కోసమే స్పెషల్‌గా డిజైన్‌ చేయించాను. నచ్చిందా..? అని రాహుల్‌ అడగ్గానే.. నువ్వు నా కోసం ఇలా తీసుకురావడం నాకు ఇంకా ఇంకా నచ్చింది అని స్వప్న చెప్తుంది.

Advertisement

ఇన్ని రోజులు నేను నీ కోసం కానీ మన పాప కోసం కానీ ఏమీ చేయలేదు. ఇక నుంచి నేను చేసే ప్రతి పని మీ కోసమే అంటాడు రాహుల్‌. ఇన్ని రోజులు ఇంట్లో రాజ్‌, కళ్యాణ్‌ను చూసి నా రాహుల్‌ వాళ్ల లాగా ఎందుకు లేడా అని బాధపడేదాన్ని అని స్వప్న చెప్పగానే.. ఇప్పుడే కాదు స్వప్న.. ఫ్యూచర్‌లో ఇంకెప్పుడు నువ్వు నా వల్ల బాధపడవు. ఇది నా ప్రామిస్‌ అన్నట్టు స్వప్న త్రీడేస్‌ నుంచి నేను ఎంతో కష్టపడి డిజైనర్‌ దగ్గరుండి మరీ మన కంపెనీ కోసం కొత్త డిజైన్స్‌ గీయించాను కదా..? అవును దానికోసం నువ్వు 24 గంటలు నిద్ర కూడా పోలేదు కదా..? అని స్వప్న అనగానే.. వాటిని ఫైనల్ చేసి ఈరోజు మ్యానుఫాశ్చరింగ్‌ యూనిట్‌కు పంపించాలి అని రాహుల్‌ చెప్పగానే.. పంపించు దానికి నన్ను అడగడం దేనికి.. అంటుంది స్వప్న వాటిలో ఏవి బాగున్నావో ఏంటో నువ్వే ఫైనల్‌ చేయాలి కాబట్టి నీకే చెప్తున్నాను.. అని రాహుల్‌ చెప్పగానే.. రాహుల్‌ నేను ఫైనల్ చేయడం ఏంటి..? దాని గురించి నాకేం తెలుసు..? అని అడుగుతుంది స్వప్న.

నీకు డిజైన్స్‌ ఎలా ఉండాలో తెలియకపోవచ్చు కానీ ఈ రాహుల్‌ సక్సెస్‌ అవ్వాలని మాత్రం నీ మనసులో కోరుకుంటావు కదా..? ఆ మంచి మనసు చాలు నేను సక్సెస్‌ అవ్వడానికి వచ్చి సెలెక్ట్‌ చేయ్‌ అంటాడు. దీంతో స్వప్న రాహుల్‌ బిజినెస్ అనేది ఎమోషనల్ గా ఆలోచించకూడదు అనుకుంటా అని చెప్పగానే.. మన కంపెనీలో మొదటి సారి మానుఫాశ్చరింగ్‌ చేయబోతున్న డిజైన్స్‌ ఇవి వీటికి టాలెంట్‌తో పాటు లక్కీ కూడా ఉండాలి కదా..? నా లక్కీ చార్మ్‌ నువ్వే కదా వీటిలో ఏవి బాగున్నాయో నువ్వే సెలెక్ట్‌ చేయ్‌ అని చెప్పగానే.. స్వప్న కొన్ని చూసి ఇవి బాగున్నాయి.. నాకైతే చాలా నచ్చాయి అని చెప్తుంది. దీంతో రాహుల్ నాకు ఏవి నచ్చాయో నీకు కూడా అవే నచ్చాయి తెలుసా..? అని రాహుల్‌ అనగానే.. నిజంగా చెప్తున్నావా..? అని స్వప్న అడుగుతుంది. ఒకప్పుడ మనిద్దరికి ఆ దేవుడు పెళ్లి ఎందుకు చేశాడా ..? ఇద్దరి ఆలోచనలు వేర్వేరు కదా..? అనుకునేటోడిని కానీ నేను మారాకే అర్థం అయింది. నువ్వు నా లైఫ్‌లో ఉండటమే కరెక్టు అని నేను మారితే మనిదరం మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ అవుతామని ఆ దేవుడు ముందే డిజైన్‌ చేశాడేమో సరే స్వప్న నువ్వు రెడీ అవ్వు.. నేను మేనేజర్‌కు ఈ డిజైన్స ఇచ్చి వస్తాను అని వెళ్లిపోతాడు.

మరోవైపు రాజ్‌, కావ్యల దగ్గర పెన్‌ డ్రైవ్‌ కోసం నానా తంటాలు పడుతుంటారు రౌడీలు. ఎంత ట్రై చేసినా పెన్‌ డ్రైవ్‌ దొరకదు..ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Gundeninda GudiGantalu Today episode: కన్నీళ్లు పెట్టుకున్న మీనా.. బాలుకు నిజం తెలుస్తుందా..? ఇది కదా అసలు ట్విస్ట్..

Podarillu Today Episode : గ్రాండ్ గా బర్త్ డే వేడుక.. చక్రీ ప్లాన్ సక్సెస్.. చక్రీకి దిమ్మతిరిగే షాకిచ్చిన మహా..

Nindu Noorella Saavasam Serial Today Episode July 21st ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌కు నిజం చెప్పిన ఎస్సై  

Illu Illalu Pillalu Today Episodes: అడ్డంగా బుక్కయిన శ్రీవల్లి.. నర్మదకు భద్రపై అనుమానం.. వేదవతి ఫుల్ హ్యాపీ..

Intinti Ramayanam Today Episode: పాపం మీనాక్షికి కన్నీళ్లు.. పల్లవి, కమల్ రొమాన్స్.. యోగా టీచర్ ఎంట్రీ అదుర్స్..

Brahmamudi Serial Today Episode July 21st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: దుగ్గిరాల ఇంటికి వచ్చిన రాజు   

Actress Sirisha : నటి శిరీష నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Godhavari Janu : ‘గోదావరి ‘ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. హీరోయిన్ అవుట్..

Big Stories

Advertisement
×