Rahul Dravid: టీమిండియా మాజీ హెడ్ కోచ్, మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ ( Rahul Dravid ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జట్టులో అలాగే జట్టు సభ్యులతో చాలా కూల్ గా ఉండే రాహుల్ ద్రావిడుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. తాజాగా రాహుల్ ద్రావిడ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అయితే ఈ ప్రమాదంలో రాహుల్ ద్రావిడ్ కు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రస్తుతం రాహుల్ ద్రావిడ్ బెంగళూరులో ఉంటున్న సంగతి తెలిసిందే.
Also Read: Bumrah – Varun: ఇంగ్లాండ్, ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి బుమ్రా ఔట్.. అతను వస్తున్నాడు !
అయితే ఈ నేపథ్యంలో తాజాగా… తన కారు లో ఓ పని పైన బెంగుళూరులో ఓ వీధికి వెళ్ళాడు రాహుల్ ద్రావిడ్ ( Rahul Dravid ) . ఈ నేపథ్యంలోనే…రాహుల్ ద్రావిడ్ ( Rahul Dravid ) కారును ( Car) మరొక ఆటో (Auto) ఢీ కొట్టింది. రాహుల్ ద్రావిడ్ కారును ఢీకొట్టింది మామూలు ఆటో కాదు ట్రాలీ ఆటో. వేగంగా వచ్చి మరి…. రాహుల్ ద్రావిడ్ కారుకు డాష్ ఇచ్చాడు ఆటో డ్రైవర్. దీంతో ఉలిక్కిపడ్డ రాహుల్ ద్రావిడ్ ( Rahul Dravid ) వెంటనే కారు దిగి…. ఆటో డ్రైవర్ తో గొడవ పెట్టుకున్నాడు.
కళ్ళు దొబ్బాయా…? పైకి చూసి నడుపుతున్నావా ? అంటూ ఆటో డ్రైవర్ పై మండిపడ్డాడు రాహుల్ ద్రావిడ్ ( Rahul Dravid ) . ఈ సంఘటన మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి ఏడు గంటల మధ్య జరిగింది. అయితే ఆటోడ్రైవర్ అలాగే రాహుల్ ద్రావిడ్ ఇద్దరు కూడా కన్నడ భాషలో మాట్లాడుతూ… యాక్సిడెంట్ గురించి మేటర్ సెటిల్ చేసుకున్నారు. అయితే ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
అయితే ఈ కారు ప్రమాదంలో… టీమిండియా మాజీ కోచ్ రాహుల్ రావిడుకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. కానీ తన వైట్ కార్.. ముందు బాగా మాత్రం బాగా డ్యామేజ్ అయింది. అందుకే రాహుల్ ద్రావిడ్ కు కోపం… వచ్చి ఆటో డ్రైవర్ పై గొడవకు దిగాడు. అయితే… ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత గొడవ కాస్త శాంతించినట్లు సమాచారం. చాలా ఆలస్యంగా రాహుల్ ద్రావిడ్ ను గుర్తించిన ఆటో డ్రైవర్… కూడా… రియలైజ్ అయి స్వారీ చెప్పాడట. తప్పయింది సార్… అనుకోకుండా జరిగింది అని… రాహుల్ ద్రావిడ్ కు క్షమాపణలు చెప్పాడట.
ఇది ఇలా ఉండగా… టీమిండియా జట్టు తరఫున ఎన్నో మ్యాచులు ఆడిన రాహుల్ ద్రావిడ్… కెప్టెన్ గా కూడా వ్యవహరించారు. అలాగే రిటైర్మెంట్ అయిన తర్వాత…. టీమిండియా మెయిన్ జట్టుకు కూడా కోచ్గా ఉన్నారు రాహుల్ ద్రావిడ్. రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీ లోనే టీమ్ ఇండియా టి20 వరల్డ్ కప్ గెలిచిన సంగతి తెలిసిందే. ఈ విజయం అనంతరం రాహుల్ ద్రావిడ్ తన పదవికి రాజీనామా చేశారు. ఇక రాహుల్ ద్రావిడ్ స్థానంలో గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ గా నియామకమైన సంగతి తెలిసిందే.
Also Read: Shivam Dube: టీమిండియా కు లక్కీ క్రికెటర్ గా దూబే.. ఇప్పటి వరకు 30 మ్యాచ్ ల్లో గెలుపు !
రాహుల్ ద్రవిడ్ కారుకు ప్రమాదం..
బెంగళూరులో ద్రవిడ్ కారును ఢీకొట్టిన ఆటో
ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు
ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది pic.twitter.com/pgHFU7Zshw
— BIG TV Breaking News (@bigtvtelugu) February 5, 2025