E-Paper
Advertisement

Brahmamudi Serial Today February 26th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రుద్రాణిని చంపేసిన కావ్య 

Brahmamudi Serial Today February 26th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రుద్రాణిని చంపేసిన కావ్య 
Advertisement

Brahmamudi serial today Episode:   

రాహుల్‌ గన్‌ తీసుకుని వచ్చి అపర్ణను కాల్చబోతుంటే. రాజ్‌ వచ్చి అడ్డుపడతాడు.. ఇద్దరి మధ్య పెనుగులాట జరుగుతుంది. పెనుగులాటలో గన్‌ ఫైర్‌ అయి రాహుల్‌ చనిపోతాడు. అప్పుడే అక్కడకు వచ్చిన రుద్రాణి కోపంగా కర్ర తీసుకుని వెనక నుంచి రాజ్‌ను కొడుతుంది. రాజ్‌ పడిపోతాడు. కసి తీరక నా కొడుకునే చంపేశావు కదరా..? నిన్ను బతకనివ్వను అంటూ కర్ర తీసుకుని కసితీరా కొట్టి చంపేస్తుంది. నా వారసుణ్నే నువ్వు చంపావు కదా ఇప్పుడు నీ వారసురాలిని నేను చంపేస్తాను అంటూ అపర్ణ చేతిలో ఉన్న పాప దగ్గరకు గన్‌ తీసుకుని వెళ్తుంది రుద్రాణి. కొన ఊపిరితో ఉన్న రాజ్‌ మెల్లగా తన చేతిని కావ్య చేతిలోకి వేసి కళావతి మన పిల్లలను కాపాడలేకపోయాను. కానీ వాళ్లను కాపాడాలి కళావతి. నీ కడుపులో పెరుగుతున్న కూతురు కోసం నీ ప్రాణాలు అయినా ఇవ్వాలి అనుకున్నావు కదా..? ఇప్పుడు ఆ కూతురే ప్రమాదంలో ఉంది. ఆ బిడ్డను కాపాడాలి. మన ప్రేమ ఎప్పుడు చెరిగిపోదు అన్నావు కదా..? ఇప్పుడు ఆ ప్రేమే ప్రమాదంలో ఉంది లే కళావతి వెళ్లి కాపాడు అంటూ ప్రాణాలు వదిలేస్తాడు.

అటు గన్‌తో పిల్లలను చంపేయబోతుంటే.. అపర్ణ ఏడుస్తూ.. వద్దు కళావతి పిల్లలను ఏమీ చేయోద్దు అంటూ బతిమాలుతుంది. దీంతో రుద్రాణి కోపంగా ఒకప్పుడు నేను కూడా నిన్ను ఇలాగే బతిమాలాను.. కానీ నన్ను అవమానించి ఇంట్లోంచి గెంటేశావు కదా..? అప్పుడు జాలి అనిపించలేదా నీకు.. అనగానే.. అపర్ణ బాధపడుతూనే రుద్రాణి పిల్లలు పసిపిల్లలు రుద్రాణి అంటుంది. రుద్రాణి మాత్రం వదలను ఎవ్వరినీ వదలను అంటుంది. అపర్ణ ఏడుస్తూ.. నీ కాళ్లు మొక్కుతాను రుద్రాణి పిల్లలను వదిలేయ్‌ అంటూ బతిమాలుతుంది. అయినా వినకుండా రుద్రాణి గన్‌ ఎయిమ్‌ చేస్తుంది. ట్రిగర్‌ నొక్కబోతుండగా.. కళావతి లేస్తుంది. కావ్యను చూసిన అపరణ అమ్మా కావ్య అంటూ ఏడుస్తుంది. కావ్య కూడా ఏవండి నా ప్రాణాలు అడ్డుగా పెట్టైనా పిల్లలను కాపాడతానండి అని చెప్పగానే.. రుద్రాణి కోపంగా దగ్గరకు వచ్చి ఏంటే పిల్లలను కాపాడేస్తావా..? నేను ఉండగా అది జరగనివ్వను.. నా కొడుకును దూరం చేసిన నీ కుటుంబంలో ఒక్కరు కూడా బతకడానికి వీల్లేదు.. అంటుంది.

Advertisement

దీంతో కావ్య కోపంగా నువ్వు నీ కొడుకు ఏమైనా దానధర్మాలు చేశారా..? వందేళ్లు బతకడానికి నా కుటుంబాన్ని చంపాలనుకున్నారు.. వాడికి మా ఆయన చేతిలో సరైన గతే పట్టింది. ఇంక మిగిలింది నువ్వే రోడ్డు పాలు కావాల్సిన నీ జీవితాని తీసుకొచ్చి అందలం మీద కూర్చోబెట్టింది ఈ కుటుంబం.. అడుక్కు తినాల్సిన నీ కొడుకును మహరాజులా చూసుకుందే ఈ కుటుంబం తిన్నింటి వాసాలు లెక్కపెట్టే నీకు బతికే అర్హత లేదు అనగానే.. రుద్రాణి కోపంగా ఏయ్‌ నువ్వేమైనా మీర్జాపూర్‌ యువరాణి అనుకున్నావా..? కుండలకు రంగులేసుకుని బతికేదానివి.. నువ్వు నాకు నీతులు చెప్తున్నావా.? అనగానే.. కావ్య కూడా కోపంగా అవునే నేను కుండలు అమ్ముకునేదాన్నే.. కానీ నీలా దిగజారిపోయి బతకలేదు.. అని చెప్పగానే.. రుద్రాణి కోపంగా మారవే నువ్వు మారవు.. ఈ నీతి మాటలు చెప్పే ఈ ఇంటికి మహారాణివై కూర్చున్నావు.. నువ్వు వచ్చినప్పటి నుంచే నేను అనుకున్నది ఏదీ జరగలేదు.. నువ్వు అడ్డు పడకపోయి ఉంటే ఈ పాటికి నా కొడుకును మహరాజును చేసి ఉండేదాన్ని అంటుంది.

దీంతో కావ్య మరింత కోపంగా కళ్లముందే శవమై పడి ఉన్నాడుగా తీసుకెళ్లు.. తీసుకెళ్లి పాడె మీద పెట్టి నువ్వు అనుకున్నట్టుగానే.. మహారాజులా ఊరేగించు అనగానే.. రుద్రాణి కోపంగా నా కొడుకు నిజంగానే మహారాజు రాచ పీనుగ ఎప్పుడు ఒంటరిగా వెళ్లదు.. తన వెంట పది మందిని తీసుకునే వెళ్తుంది. మీ అందరినీ చంపి వాడికి తోడుగా పంపిస్తాను నువ్వు చూస్తూ ఉండు అంటూ రుద్రాణి గన్‌ పేలుస్తుంది. అందులో బుల్లెట్స్‌ అయిపోయి ఉంటాయి. వెంటనే కావ్య మీదకు వెళ్లి గొంతు పిసుకుతుంది. కావ్య తప్పించుకుని దూరంగా పడుతుంది.. నీ కళ్ల ముందే నీ కూతురును చంపేస్తాను నువ్వు చూస్తూ ఉండు అంటూ వెళ్లి పాపను చంపబోతుంటే.. కావ్య అక్కడే అమ్మవారి దగ్గర ఉన్న త్రిశూలం తీసుకుని రుద్రాణిని పొడిచేస్తుంది. రుద్రాణి అక్కడే చనిపోతుంది. తర్వాత కావ్య చనిపోతుంది.

Advertisement

కొద్దిసేపటికి జూనియర్‌ స్వరాజ్‌ దెబ్బలతో లేచి రోడ్డు మీదకు వెళ్తాడు శ్రీశైలం నుంచి వస్తున్న వాళ్లు రాజ్‌ను తీసుకుని కారులో వెళ్లిపోతారు.. కట్‌ చేస్తే ఐసీయూలో సుభాష్‌కు పిల్లలకు ట్రీట్‌మెంట్‌ జరుగుతుంది. అపర్ణ బయట కూర్చుని ఏడుస్తుంటుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Big Stories

Advertisement
×