Brahmamudi serial today Episode: అంతా బయట నుంచి గమనిస్తున్న సెక్యూరిటీ పక్కకు వెళ్లి అనామికకు ఫోన్ చేస్తాడు. జరిగిన విషయం చెప్తాడు. మి దగ్గర ఉన్నది ఇనుప కిరీటం అని చెప్తాడు. దీంతో అనామిక, సామంత్ షాక్ అవుతారు. ఏం మాట్లాడుతున్నావు అంటూ తిడుతుంది. అవును మేడం మీ దగ్గర ఉన్నది ఇనుముతో చేసింది. వర్జినల్ గోల్డ్‌తో చేసింది లాకర్ నుంచి ఇప్పుడే తీసింది అని చెప్తుండగానే కావ్య వచ్చి సెక్యూరిటీ చేతిలోంచి ఫోన్ లాక్కుంటుంది. ఏంటి అనామిక షాక్ అయ్యావా..? నీ లాంటి శత్రువులు ఎప్పుడూ మా కంపెనీ పరువు తీయాలని చూస్తుంటారని నాకు ఒకసారి తెలిసింది కదా..? అప్పటి నుంచి నా జాగ్రత్తలో నేను ఉంటాను.
ఇక నుంచి నువ్వు వంద పాన్లు వేసినా మా కంపెనీ గోడ మీద సున్నం కూడా పీకలేవు. ఇంకొక్కసారి ఇలాంటి ప్రయత్నాలు చేసేముందు నీ పాఠాన్ని గుర్తు పెట్టుకో.. లేదంటే జీవితంలో కోలుకోలేని గుణపాఠం నేను చెప్పాల్సి వస్తుంది. చూడు నేను ఇప్పుడు రెండు పనులు చేయోచ్చు నిన్ను కొట్టడం.. లేదా… పోలీసులకు పట్టించడం.. వయసులో పెద్దవాడివి.. పెళ్లాం పిల్లలు ఉన్నారు కాబట్టి పోలీసులకు పట్టించడం లేదు అంటూ సెక్యూరిటీకి వార్నింగ్ ఇవ్వగానే అక్కడి నుంచి పారిపోతాడు.
సామంత్ కోపంగా అనామికను తిడతాడు. వాళ్ల కంపెనీని దెబ్బ కొట్టడం మానుకో.. అది నీ కెప్పటికీ సాధ్యం కాదని తెలుసుకో.. ఆ కావ్య తెలివి తేటల ముందు నువ్వు ఎందుకు పనికిరావని ఇప్పటికైనా తెలుసుకో.. అంటూ తిట్టగానే.. అనామిక కోపంగా వెళ్లి సామంత్ గల్లా పట్టుకుని ఏయ్ ఏమ్మన్నావ్ ఇప్పుడు అంటూ నిలదీస్తుంది. నేను కూడా నీ గొంతు పట్టుకోవచ్చు.. చచ్చే దాకా తప్పించుకోలేవు. కావ్య గురించి తక్కువ అంచనా వేసి నేను కూడా నమ్మాను కాబట్టి ఊరికే ఉంటున్నాను అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు సామంత్.
ఆఫీసులో వర్క్ చేసుకుంటున్న కావ్య దగ్గరకు రాజ్ సంతోషంగా వెళ్లి హగ్ చేసుకోబోతుంటే.. ఆపండి ఆపండి అంటూ రాజ్‌ను ఆపుతుంది. నువ్వు అందరి ముందు నా పరువు కాపాడినందుకు మెచ్చుకోవాలో.. డమ్మీ కిరీటం లాకర్ పెట్టినందుకు మెచ్చుకోవాలో అర్థం కావడం లేదు. అవసరం లేదు కానీ మనం సక్సెస్ అయ్యాం.. అంటుంది కావ్య. కానీ ఇప్పుడు ఇంకో చిక్కు సమస్య వచ్చింది జగదీష్ గారు అడ్వాన్స గా ఎంతో కొంత ఇస్తారనుకుంటే.. కాంట్రాక్ట్ పూర్తి అయ్యాక ఇస్తారట ఇపుడెలా..? అని చెప్తాడు రాజ్. ఆయన ఇచ్చిన ఐదు కోట్లతో గోల్డ్ మొత్తం కొనేశాం ఇప్పట్లో గోల్డ్ కొనే అవసరమే లేదని కావ్య చెప్తుంది.
ధాన్యలక్ష్మీ మేనమామ ఇంటికి వస్తాడు. నాకోసం ఎవరూ రావడం లేదని అన్నారుగా చూశారా మా మేనమామ వచ్చారు అంటుంది. అంతే కాదమ్మా మీ ఆయన ఫోన్ చేసి గోల్డ్ బిస్కట్స్ రెండేళ్ల రేటుకే ఇవ్వమని అడిగారు. అందుకే మీరు అడిగారు కదాని ఇవ్వడానికి ఒప్పుకున్నాను అని శ్రీను చెప్తాడు. ఇంతలో రాజ్, కావ్య రావడంతో గోల్డ్ మనుక పాత రేటుకే ఇస్తున్నారని చెప్తాడు ప్రకాష్. అంత గోల్డ్ ఇప్పట్లో మనకు అవసరమే రాదు అంటుంది కావ్య. ఈ విషయంలో ప్రకాష్, కావ్యకు మాటమాట పెరుగుతుంది.
దీంతో శ్రీను కోపంగా ప్రకాష్, ధాన్యలక్ష్మీని తిట్టి ఈ ఇంట్లో మీ మాటకు ఎంత గౌరవం ఉందో అర్థం అవుతుంది అంటూ వెళ్లిపోతాడు. ధాన్యలక్ష్మీ కోపంగా ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా..? అంటూ నిలదీస్తుంది. మా పుట్టింటి వాళ్ల ముందు నన్ను నా భర్తను పూచికపుల్లతో తీసిపారేస్తారా..? అంటూ నిలదీస్తుంది. నిన్న కాక మొన్న కంపెనీలో అడుగుపెట్టిన కావ్యకేం తెలుసు ఆఫీసు విషయాలు.. అంటాడు ప్రకాష్. ఆఫీసు విషయాలు నువ్వు చూసుకోవాలి కానీ మట్టి పిసుక్కునే నీ భార్యకేం తెలుసు అంటుంది ధాన్యలక్ష్మీ..
ఇప్పుడు అందరూ ఎందుకు మౌనంగా ఉన్నారు అని అడుగుతుంది రుద్రాణి. ధాన్యలక్ష్మీకి చిన్నన్నయ్యకు ఇంత అవమానం జరుగుతుంటే ఒక్కరూ కూడా ఎందుకు ప్రశ్నించడం లేద.. అంటుంది. దీంతో ప్రకాష్ బాధగా నన్ను ఒక మనిషిలా చూస్తే కదా అంటూ వెళ్లిపోతాడు. రుద్రాణి సంతోషంగా మా చిన్నన్నయ్య ఇక మన సైడే అనుకుంటుంది రుద్రాణి.
తర్వాత సుభాష్, ప్రకాష్ ఇద్దరూ మాట్లాడుకుంటూ బాధపడుతుంటారు. కావ్య నిజంగా నిన్ను అవమానించింది అనుకుంటున్నావా..? అని సుభాష్ అడగ్గానే.. అలా అనుకోకూడదనే ఇన్ని రోజులు ఓపిక పట్టాను అన్నయ్య కానీ ఇవాళే ఈ ఇంట్లో నా స్థానం ఏంటో అర్థం అయింది అన్నయ్యా అంటూ ప్రకాష్ ఎమోషన్ అవుతాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?