Brahmamudi serial today Episode: సిద్దార్థను పంపించింది తానేనని యామిని ఫోన్ చేసి కావ్యకు చెప్తుంది. అన్ని సక్రమంగా జరిగి ఉంటే నేను రాజ్ ఇప్పుడు హనీమూన్‌లో ఉండేవాళ్లం కానీ కేవలం నీవల్ల నా ఆశలన్నీ మంట కలిసిపోయాయి. నా కలలన్నీ నీళ్లు అయిపోయాయి. కావాల్సింది కళ్ల ముందే ఉన్నా దాన్ని దక్కించుకోలేకపోవడం ఎలా ఉంటుందో.. ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలియాలి కదా అందుకే నీకు ఈ శిక్ష విధించాను. ఆరోజు ఏమన్నావు మీ అక్కను కాపాడుకోవడానికి సతీసావిత్రిలా పోరాడతాను అన్నావు కదా..? ఇప్పుడు నీ కంపెనీ బాధ్యతల చేజారకుండా ఎలా కాపాడుకుంటావు కావ్య నీకు ఉన్నది కేవలం రెండే రెండు రోజులు నీ పవర్స్ ఆ సిద్దార్థ చేతిలోకి పోకుండా ఎలా కాపాడుకుంటావు కావ్య అంటూ వార్నింగ్ ఇస్తుంది.
దీంతో కావ్య కోపంగా రన్నింగ్ లో ముందు పరిగెత్తినంత మాత్రాన గెలిచినట్టు కాదు యామిని ఫైనల్ లైన్ క్రాస్ చేసినప్పుడే గెలిచినట్టు.. నువ్వు చెప్పిన ఆ 48 గంటలు నాకు అవసరం లేదు యామిని నేను గెలుస్తాను అనిపించే ఒక్క మూమెంట్ కనిపించినా నేనే బెస్ట్ అని ఫ్రూవ్ చేసుకుంటాను అంటుంది. దీంతో యామిని కోపంగా ఆశకు కూడా ఒక హద్దు ఉండాలి కావ్య. నువ్వు ఈ బోర్డు మెంబర్స్‌లో బెస్ట్ అని ఫ్రూవ్ చేసుకోవాలి అంటే నీకు ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్. అదేంటో తెలుసా..? రాజ్ లేడు అని తెలిసిన ఈ ప్రపంచానికి తను ఉన్నాడని ఫ్రూవ్ చేయాలి. అలా జరగాలి అంటే గతం మర్చిపోయిన రాజ్‌కు నిజం ఏంటో చెప్పి తన గతాన్ని గుర్తు చేయాలి. అది పాసిబులా.?ఒకవేళ కాదు కూడదు అని రాజ్‌కు నిజం చెప్తాను అనుకుంటే ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు.. కావ్య జరిగేదాన్ని నువ్వెలా ఆపలేవు కానీ ఉన్న ఈ రెండు రోజులైనా కంపెనీలో ఎంజాయ్ చేయ్..మళ్లీ నీకు ఆ కంపెనీలో స్థానం ఉంటుందో ఉండదో అంటూ కావ్యను బెదిరిస్తుంది యామిని. మరోవైపు స్టేషన్ దగ్గర ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతుంటే.. అప్పు లోపలికి పిలుస్తుంది. ఇద్దరిలో ఒకడు అప్పు ఇచ్చానని డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో గొడవ పెట్టుకున్నానని చెప్తాడు. రెండు రోజులో తిరిగి ఇస్తానని రెండవ వ్యక్తి చెప్పగానే సరేనంటూ అప్పు పంపిస్తుంది. ఇద్దరూ బయటకు వెళ్లి యామినికి ఫోన్ చేసి ఆ అప్పు మమ్మల్ని పూర్తిగా నమ్మింది మేడం అని చెప్తారు. యామిని హ్యాపీగా ఫీలవుతుంది.
రాజ్ టీవీలో కార్టూన్స్ చూస్తుంటాడు. ఇంతలో అపర్ణ, ఇంద్రాదేవి వస్తారు. ఏం చేస్తున్నావు నీకు కోపం రాలేదా అని అడుగుతుంది ఇంద్రాదేవి. కోపమా కోపమెందుకు నాన్నమ్మ.. అసలు మన జీవితంలో అన్ని సమస్యలకు కోపమే కారణమట తెలుసా నీకు అంటాడు. దీంతో ఇంద్రాదేవి నేను నిన్ను అడిగింది. కోపం మీద నీ అభిప్రాయం ఏంటని అడగలేదు. నా మనవరాలు నువ్వు ప్రపోజ్ చేస్తుంటే వెళ్లిపోయింది కదా నీకు తన మీద కోపం రాలేదా.. అని అడుగుతుంది. దీంతో రాజ్ వచ్చింది తర్వాత పోయింది అని రాజ్ చెప్తాడు. అపర్ణ అదేంట్రా అని ఆశ్చర్యంగా అడుగుతుంది. దీంతో రాజ్ అవునమ్మా మొదటిసారి వెళ్లిపోగానే చాలా కోపం వచ్చింది. కానీ కూల్‌గా ఆలోచించాక అర్థం అయింది. తను వెళ్లటం కూడా కరెక్టే కదా అని అయినా కళావతి గారు ఎక్కడికి వెళ్లారు ఆఫీసుకే కదా..? అయినా ఈ రోజు తనకు ఎలాగైనా ప్రపోజ్ చేస్తాను అని రాజ్ చెప్తుంటే..
ఇంతలో కావ్య ఫోన్ చేస్తుంది. కంగారుగా మీరు నా దగ్గరకు రావాలి మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని చెప్తుంది. దీంతో రాజ్ హ్యపీగా ముఖ్యమైన విషయం అంటుంది ప్రేమ విషయమే అనుకుంటా అని మనసులో అనుకుంటాడు. ఇంతలో కావ్య నేను లోకేషన్ పెడతాను మీరు ఇక్కడికి రావాలి అని చెప్తుంది. సరేనంటూ రాజ్ కాల్ కట్ చేస్తాడు. ఇంద్రాదేవి ఏంట్రా మనవడా ఏం అంటుంది నా మనవరాలు అని అడుగుతుంది. దీంతో రాజ్ మీ మనవరాలికి సిగ్గు ఎక్కువ అనుకుంటా పర్సనల్ గా మాట్లాడాలి సీక్రెట్‌గా కలవాలి అంటుంది. మీరు హ్యాపీగా తడి గుడ్డ వేసుకుని పడుకోండి మీరు లేచే సరికి నేను గుడ్ న్యూస్ తో వస్తాను అని చెప్పి రాజ్ వెళ్లిపోతాడు. రాజ్ వెళ్లగానే కావ్య కంపెనీ పరిస్థితి చెప్పి తమ బాస్‌లా నటించమని అడుగుతుంది. ముందు రాజ్ ఒప్పుకోకపోయినా కావ్య ఎమోషనల్ డైలాగ్స్ చెప్పగానే రాజ్ సరే అంటూ ఒప్పుకుంటాడు. ఆ సంతోషంలో కావ్య రాజ్‌ను హగ్ చేసుకుంటుంది. దీంతో రాజ్ ఆశ్చర్యంగా హ్యాపీగా ఫీలవుతూ తాను హగ్ చేసుకోబోతుంటే.. కావ్య వెంటనే మనం వెంటనే ఇంటికి వెళ్లాలి అంటూ రాజ్‌ను తీసుకుని ఇంటికి బయలుదేరుతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?