Brahmamudi serial today Episode: కావ్య, రాజ్‌ను తీసుకుని ఇంటికి వెళ్తుంటే మధ్యలో రేవతి తన కొడుకుతో కలిసి షూ షాపునకు వెళ్లడం చూస్తారు. తన కొడుకు అడిగిన షూస్ తను కొనివ్వలేక వద్దని కొడుకుని తీసుకుని వెళ్లిపోవడం కారులోంచి చూస్తారు. రాజ్ బాధగా పాపం కదండి కొడుకు అడిగింది కొనివ్వలేని ఆ తల్లి బాధను చూస్తుంటే చాలా బాధగా ఉంది కదండి అంటాడు. కావ్య కూడా అవునండి అంటుంది. రాజ్ ఏంటో ఆ దేవుడు కొనగలిగే బలం ఉన్నవాడికి ఆశలు ఇవ్వడు. ఆశ ఉన్న వాడికి కొనుక్కునే బలం ఇవ్వడు అంటాడు.. దీంతో కావ్య మీరు చెప్పింది నిజమే మనకు కొనుక్కునే బలం ఉంది కాబట్టి వాళ్ల ఆశను మనం తీర్చొచ్చు కదా అంటుంది. అదేంటండి ఆవిడ వెళ్లిపోయింది కదా ఎలా తీరస్తారు అంటూ అడుగుతాడు రాజ్. ఇంటికి వెళ్లి ఇవ్వొచ్చు కదా అంటుంది కావ్య. అదేంటండి ఆవిడ మీకు తెలుసా..? అని రాజ్ అడుగుతాడు. తెలసండి.. ఒకసారి మా ప్రాణాలు కాపాడింది అని కావ్య చెప్పగానే అయితే వెళ్దాం పదండి అని చెప్తాడు రాజ్.
తర్వాత రాజ్, కావ్య ఇద్దరూ కలిసి షూష్, బట్టలు, కేక్ తీసుకుని రేవతి ఇంటికి వెళ్తారు. రాజ్‌ను చూసిన రేవతి ఉద్వేగంతో రాజ్ అంటూ పరుగెత్తుకుని వెళ్లి హగ్ చేసుకుంటుంది. ఎలా ఉన్నావురా అని పలకరిస్తుంది. దీంతో కావ్య ఈయన మీకు ముందే తెలుసా..? అని అడుగుతూ.. ఓ మా ఫ్యామిలీ మొత్తం మీకు ముందే తెలుసు కదూ అంటుంది. దీంతో రాజ్ మీ ఫ్యామిలీ అయితే తెలుసు కానీ నేను ఎలా తెలుసు అని అడగ్గానే.. కావ్య షాక్ అవుతుంది. ఇంతలో రేవతి క్షమించు బాబు నువ్వు అచ్చం మా తమ్ముడిలా ఉంటే హగ్ చేసుకున్నాను.. తనను చూసి చాలా కాలం అయిపోయింది. అందుకే పొరపాటు పడ్డాను. ఏమీ అనుకోకు అంటుంది. దీంతో రాజ్ అయ్యో పర్వాలేదు అండి కావాలంటే నన్ను కూడా మీ తమ్ముడు అనుకోండి ఈరోజు నేను కూడా మిమ్మల్ని అక్కా అని పిలుస్తాను అని చెప్పగానే.. రేవతి భర్త ఇంతకీ మీరేంటమ్మా ఇలా వచ్చారు..? అని అడగ్గానే.. మీకు సర్‌ప్రైజ్ ఇద్దామని వచ్చాం అని కావ్య చెప్పగానే.. సర్‌ప్రైజ్ మీకు కాదులేండి మీ బాబుకు అని చెప్తాడు రాజ్.
షూస్ తీసి ఇస్తాడు. రేవతి కొడుకు సంతోషపడతాడు. తర్వాత అందరూ కలిసి బాబుతో కేక్ కట్ చేయిస్తారు. రేవతి ఎమోషనల్ అవుతుంది. మీకెప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ తమ్ముడికి కాల్ చేయండి అంటూ రాజ్ చెప్పి వెళ్లిపోతాడు. వాళ్లు వెళ్లిపోయాక రేవతి ఏడుస్తుంది. ఆమె భర్త ఓదారుస్తుంటాడు. ఇన్ని రోజులు వాళ్లను ఎప్పుడు కలవాలా అని ఎదురుచూశావు. కానీ ఈరోజు ఆ దేవుడే నీకు అవకాశం ఇస్తే ఆ అవకాశం నువ్వు వదిలేశావు అనిపిస్తుంది అంటాడు దీంతో రేవతి లేదండి ఆ రోజ ఆ ఇంట్లో వాళ్ల కన్నీళ్లకు కారణం అయ్యాను. ఆ ఇంటి పరువును రోడ్డు మీద పడేశాను. నా స్వార్థం నేను చూసుకున్నాను. కానీ వాళ్ల గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. అలాంటి నాకు ఆ ఇంట్లో అడుగుపెట్టే అర్హత లేదండి అంటూ ఏడుస్తుంది. ఒకవేళ వాళ్లు నిన్ను మనఃస్పూర్తిగా క్షమిస్తే.. అంటాడు రేవతి భర్త. అది జరుగుతుందన్న నమ్మకం నాకు లేదండి అంటుంది. కానీ నాకు ఉంది రేవతి. ఎందుకంటే ఇన్నేల్లుగా ఆ ఇంటి నుంచి మనల్ని ఎవ్వరూ చూడలేదు. కానీ ఇప్పుడు మనల్ని వెతుక్కుంటూ ఇంటికి వచ్చాడు అని భర్త చెప్పగానే.. వద్దండి నాలో మళ్లీ ఆశలు రేపకండి మళ్లీ ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను అంటూ ఏడుస్తుంది రేవతి. ఏమీ కాదని మళ్లీ పాత రోజులు వస్తాయని ఓదారుస్తాడు భర్త.
కారులో వెళ్తున్న రాజ్‌ను అలాగే చూస్తుంది కావ్య. దీంతో ఏంటి కళావతి గారు ఎందుకు నావైపు అలా చూస్తున్నారు అని అడుగుతాడు. మీకు సారీ చెప్పాలని ఉంది అంటుంది కావ్య. ఎందుకని రాజ్ అడగ్గానే.. మీ టైం మొత్తం ఇవాళ వేస్ట్ చేశాను కదా అందుకే అంటుంది కావ్య. దీంతో రాజ్ లేదండి నాకు మర్చిపోలేని అనుభూతిని పంచారు. ఆవిడ నిజంగా నాకు అక్క అయ్యుంటే బాగుండు అనిపిస్తుంది. మీరు నాకు సారీ చెప్పడం ఏంటండి.. నాకు ఇంత బ్యూటిఫుల్ మెమెరీని ఇచ్చినందుకు నేనే మీకు థాంక్స్ చెప్పాలి అంటాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?