Brahmamudi serial today Episode: ఆఫీసుకు వెళ్లిన రాజ్ ఎంప్లాయీస్ అందరి మీద సీరియస్ అవుతుంటాడు. అందరూ షాకింగ్ గా చూస్తుంటారు. శృతి భయంతో వచ్చి ఐదు నిమిషాలు కూడా కాలేదు.. అప్పుడే పెంట పెంట చేస్తున్నాడు కావ్య మేడం రావడం ఇంకా లేటయితే ఏం చేస్తారో ఏమో అని భయపడుతుంది.
దుగ్గిరాల ఇంట్లో అందరూ టిఫిన్ చేస్తుంటారు. రుద్రాణి మాత్రం టిఫిన్ చేయకుండా అటూ ఇటూ చూస్తుంది. దీంతో కావ్య ఏంటి రుద్రాణి గారు టిఫిన్ ప్లేట్‌లో ఉంటే తినకుండా దిక్కులు చూస్తున్నారు అంటుంది. ఇంతలో ప్రకాష్ అంటే దిక్కులు చూస్తూ ఎక్కువ తినొచ్చనేమో కావ్య అంటాడు. దీంతో రుద్రాణి కోపంగా అన్నయ్య నేనేమీ ఈ ఆస్థి అంతా కుంభకర్ణుడిలాగా తినడానికి దిక్కులు చూడటం లేదు అంటుంది. దీంతో ఇంద్రాదేవి మరి ఇంకెందుకు చూస్తున్నావు.. ఒకేసారి అ సురస రాక్షసి లాగా మింగేయాలని చూస్తున్నావా..? అంటుంది. రుద్రాణి కోపంగా అంటే మీ ఉద్దేశం ఆస్థి గురించి ఆలోచించడం తప్పా నాకు వేరే ఆలోచనే లేదనుకుంటున్నారా..? అంటుంది.
ఇంతలో అపర్ణ నీ పని ఈ ఆస్థిని ఎప్పుడు కొట్టేద్దామనా..? అంటూ చూడటమేగా రుద్రాణి అంటూ తిడుతుంది. రుద్రాణి మరింత కోపంగా వదిన కాస్త అందరూ సైలెంట్‌గా ఉంటారా..? నేనేం ఎక్కువ తినడానికో.. లేక ఇంకేదో చేయడానికో దిక్కులు చూడటం లేదు. ఈ పాటికే రావాల్సిన ఈ ఇంటి వారసుడు ఇంకా రాలేదేంటని చూస్తున్నాను అంటుంది. ఇంతలో శృతి కావ్యకు ఫోన్ చేస్తుంది. కావ్య కట్ చేస్తుంది. శృతి పదే పదే చేయడంతో కావ్య లిఫ్ట్ చేసి నేను టిఫిన్ చేస్తున్నాను తర్వాత మాట్లాడతాను అంటుంది.
దీంతో మేడం ఇక్కడ కొంపలు అంటుకుంటున్నాయి. రాజ్ సార్ ఆఫీసుకు వచ్చారు. అంతా తిక్కతిక్కగా మాట్లాడుతున్నారు మేడం అని చెప్తుంది. ఆయన అక్కడికి ఎందుకు వచ్చారంట అని కావ్య అడగ్గానే.. నాకేం తెలుసు మేడం మీరు త్వరగా రండి అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. కంగారుగా ఉన్న కావ్యను ఏంటి ఏమైందమ్మా అని సుభాష్ అడుగుతాడు. దీంతో కావ్య అగ్ని పర్వతం బద్దలైంది మామయ్య.. మీ పుత్రరత్నం ఆఫీసుకు వెళ్లారట అని చెప్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు.
ఆశ్చర్యంగా ఇంద్రాదేవి వాడు ఇప్పుడు అక్కడికి ఎందుకు వెళ్లాడట అని అడుగుతుంది. నాకేం తెలుసు అమ్మమ్మ గారు నేను ఆయన్ని రేపు ఆఫీసుకు తీసుకెళ్లి పరిచయం చేయాలనుకుంటే ఆయన ఇవాళే వెళ్లారట అని కంగారుగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. రుద్రాణి హ్యాపీగా అయిపోయింది ఇక కావ్య పని అయిపోయింది. రాజ్ అక్కడ ఏదో ఓవరాక్షన్ చేసి దొరికిపోతాడు. కావ్య ఆడేది నాటకం అని తెలిసిపోతుంది అని మనసులో అనుకుంటుంది.
మరోవైపు రాహుల్ ఆస్థి పేపర్స్ తీసుకెళ్లి తన లవర్‌కు ఇస్తాడు. ఆ పేపర్స్ చూసిన లవర్ హ్యాపీగా ఫీలవుతూ.. ఇక నువ్వు నన్ను ఏదీ అడుక్కోవలసిన అవసరం లేదు. ఆర్డర్ వేస్తే నీ ఒడిలో సీతాకొకచిలుకలా వాలిపోతాను అని చెప్తుంటే.. అప్పుడు నేను వచ్చి నీ ఒళ్లు చిల్లులు పడేలా చేస్తాను అంటూ స్వప్న.. అప్పుతో కలిసి వస్తుంది. రాహుల్‌ను చూస్తూ శభాష్‌రా మొగుడురా కట్టుకున్న దాని కంచంలో అన్నం లేదు కానీ ఉంచుకున్న దాని కొప్పులో మల్లెపూలు పెట్టాడన్నట్టు దీన్ని బాగానే బుట్టలో వేసుకున్నావే..? ఏంటే అలా చూస్తున్నావు. నేను ఎవరనా..? నువ్వు ఉంచుకున్నావే వాడి చేత తాళి కట్టించుకున్న పెళ్లాన్ని. అయినా వీడిని నేనే నమ్మను నువ్వెలా నమ్మావే.. ఓ మాటలతో మాయ చేశాడా..? ఓ ఈ డాక్యుమెంట్స్ ఇవ్వగానే నిన్ను నువ్వు సమర్పించుకోవడానికి రెడీ అయిపోయావా..? అసలు ఇవి ఏ డాక్యుమెంట్సో తెలుసా..? డూప్లికేట్ డాక్యుమెంట్స్.. నీకిలా డూప్లికేట్ డాక్యుమెంట్స్ ఇచ్చి నిన్ను పూల్ ను చేశాడే పిచ్చి దానా..? అని స్వప్న చెప్పగానే..
ఏంటి ఇవి డూప్లికేటా రాహుల్ అని అడుగుతుంది లవర్. అవును అని రాహుల్ చెప్పగానే కోపంతో నన్నే చీట్ చేస్తావా..? నిన్ను.. అంటూ రాహుల్‌ను కొట్టబోతుంది లవర్. స్వప్న అడ్డుపడుతుంది. ఏంటో నా కళ్ల ముందే నా మొగుడి మీద చెయ్యి ఎత్తావు కొడతావా..? నేను నా భర్తకు విలువ ఇవ్వకపోవచ్చు కానీ మా తాళి బంధానికి తప్పకుండా విలువ ఇస్తాను. వాణ్ని కొడితే తిడితే నేనే కొట్టాలి. నేనే తిట్టాలి. ఇలా ఎవరు పడితే వాళ్లను కొట్టనిస్తానా..? చంపేస్తాను అంటుంది స్వప్న. ఇంతలో రాహుల్ ఐయామ్ సారీ స్వప్న నువ్వు ఇంత మంచి దానివి అని తెలియక బుద్ది గడ్డి తిని తప్పు చేశాను. నన్ను క్షమించు అని అడుగుతాడు. దీంతో స్వప్న క్షమిస్తాను రాహుల్ తప్పకుండా క్షమిస్తాను అంటూ చీపుర తీసుకుని రాహుల్‌ను కొడుతుంది. రాహుల్ లవర్‌ను అప్పు కొడుతుంది. దీంతో రాహుల్ ఇచ్చిన ఏడు వారాల నగలు కూడా ఇచ్చేస్తుంది లవర్.
మరోవైపు ఆఫీసులో స్టాప్ అందరినీ పిలిచి రాజ్ మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. ఇంతలో కావ్య, శృతికి కాల్ చేసి ఏం జరుగుతుందని అడుగుతుంది. జరిగేది మొత్తం చెప్పి మీరు త్వరగా రండి మేడం అని చెప్తుంది. శృతి ఫోన్ మాట్లాడటం చూసి రాజ్ కోపంగా తిడతాడు. ఫోన్ స్విచ్చాప్ చేసేయ్ అని చెప్తాడు. అందరినీ తిడుతూ ఒక్క ఫైల్ కరెక్టుగా లేదు. ఒక్క డిజైన్ కరెక్టుగా లేదు. నెలనెల జీతాలు తీసుకుంటున్నప్పుడు కంపెనీ పట్ల భయం భక్తి ఉండాలి కదా అంటూ తిడుతుంటాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?