E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode June 13th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: డీల్ మీద ఇందు సైన్ చేయకుండా అడ్డుకున్న రాజు

Brahmamudi Serial Today Episode June 13th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: డీల్ మీద ఇందు సైన్ చేయకుండా అడ్డుకున్న రాజు
Advertisement

Brahmamudi serial today Episode: రేఖ ప్లాన్‌ ప్రకారం కంపెనీకి లాస్ అయ్యే అగ్రిమెంట్ మీద ఇందు చేత సంతకం చేయిస్తుంటే.. రాజు మందు తాగి వచ్చి పేపర్లు చూసి ఈ డీల్‌ చేయడానికి నేను ఒప్పుకోను ఇందు సంతకం  చేయడానికి నేను అసలు ఒప్పుకోను అంటూ చెప్పగానే.. రేఖ, భూషణ్‌ షాక్‌ అవుతారు. ఇంతలో ఇందు, రాజుకు సైగ చేసి ఏయ్‌ రాజు నువ్వు ఆగు రేఖ ఆంటీ చెప్పాక నేను చేస్తాను.. సంతకం చేసి తీరుతాను.. అయినా మధ్యలో ఆపడానికి నువ్వెవరు..? అంటూ నాటకం ఆడగానే.. అయితే రేపు ఒక చార్డెట్‌ అకౌంటెంట్‌ను పిలిపించి ఆయన చూశాక ఈ డీల్‌ ఫినిస్‌ చేయండి అప్పుడు నువ్వు సంతకం చేయ్‌ అంటూ చెప్పగానే..

ఇందు కూడా మా రేఖ ఆంటీ తప్పుడు పనులు చేసే వ్యక్తి కాదు.. ఆంటీ రేపు చార్టెడ్‌ అకౌంటెంట్‌ను పిలిపించండి.. ఈ రాజుకు ఉన్న అనుమానాలు తీర్చండి.. ఆంటీ.. అంటూ చెప్తుంటే.. రేఖ, భూషణ్‌ షాకింగ్‌గా చూస్తుంటారు. ఇంతలో భూషణ్‌ చార్టెడ్‌ అకౌంటెంట్‌ లేడని.. రెండు వారాల వరకు రాడని చెప్తాడు. దీంతో రాజు ఏం పర్వాలేదు.. అప్పుడే ఈ డీల్‌ మీద ఇందు సైన్‌ చేస్తుంది. లేదని ఎవరైనా ఇందు చేత బలవంతంగా సైన్‌ చేయించాలని చూస్తే.. నా సంగతి తెలుసు కదా..? మామయ్య సాంగ్‌ అంటూ శేషుకు చెప్పగానే.. శేషు టాప్‌ లేచిపోద్ది అనే సాంగ్‌ ప్లే చేస్తాడు. రాజు, ఇందుతో కలిసి డాన్స్‌ చేస్తూ.. రూంలోకి వెళ్లిపోతాడు. అంతా చూస్తున్న అపర్ణ, సుభాష్‌ నవ్వుకుంటారు.

Advertisement

భ్రమరాంబ కోపంగా శేషును బయటకు తీసుకెళ్లి బకెట్‌తో నీళ్లు నెత్తిన పోస్తుంది. మనందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం కదా..? నువ్వెందుకు ఆ రాజుతో కలిసిపోయావు అంటూ నిలదీస్తుంది. నీ వల్లే ఇందు సంతకం చేయడం ఆగిపోయింది అంటూ తిడుతుంది. శేషు భయంతో వణికిపోతుంటాడు. మరోవైపు రూంలోకి వెళ్లిన ఇందు సంతోషంగా వెళ్లి రాజును హగ్‌ చేసుకుంటుంది. రాజుకు థాంక్స్‌ చెప్తుంది. నువ్వు కనక లేకపోయి ఉంటే నేను వేలిముద్రలు వేయాల్సి వచ్చేది. ఆ డీల్‌ ఒకే చేస్తే కంపెనీ చాలా పెద్ద ప్రాబ్లమ్‌లో పడిపోయేది. నేను సీఈవోగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఫస్ట్‌ డీల్‌లోనే ఇంత పెద్ద తప్పు చేసి ఉంటే నాకు చాలా పెద్ద బ్యాడ్‌ నేమ్‌ వచ్చేది. నువ్వు సడెన్‌గా ఎంట్రీ ఇచ్చి నన్ను వేలి ముద్రలు వేయాల్సి వచ్చేది. థాంక్యూ రాజు.. అంటూ చెప్పగానే..

నిన్ను కాపాడుకోవడం నా బాధ్యత ఇందు. నువ్వు థాంక్స్‌ చెప్పాల్సిన అవసరం లేదు అనగానే.. ఇందు రాజును డబ్బు మనిషే అనుకున్నానని కానీ నీకు మనసు, మానవత్వం ఉన్నాయని ఇందు చెప్పినట్టు రాజు ఊహించుకుంటుంటే.. అప్పుడే రూంలోకి వచ్చిన ఇందు ఏదో ఊహల్లో ఊరేగుతున్నట్టు ఉన్నావు అని అడగ్గానే.. రాజు షాక్‌ అవుతాడు. నువ్వు ఊహల్లో తప్పా రియాలిటీలో ఉండవా..? అని అడుగుతుంది. దీంతో రాజు నా బతుకే నటన చేశావు కదా..? అంటూ నిట్టూరుస్తాడు. ఇందు అందుకు పేమెంట్‌ ఇస్తున్నాను కదా అంటుంది. దీంతో రాజు కోపంగా ఇందుతో గొడవ పడి బెడ్‌ మీద పడుకోబోతుంటే.. ఇందు కోపంగా చూస్తూ.. అక్కడ కాదు.. నీ రెగ్యులర్‌ ప్లేస్‌లో పడుకో అంటూ రాజుకు చాప ఇస్తుంది ఇందు. రాజు నిరాశగా కింద చాప వేసుకుని కింద పడుకుంటాడు.

Advertisement

వెంకట్‌ డెలివరీ జాబ్‌ కు వెళ్తుంటే.. చలపతి, లక్ష్మీ వెళ్లి తమకు చాలా గర్వంగా ఉందని మొన్నటి వరకు నువ్వు చాలా డిఫ్రెషన్‌లో ఉన్నావని చాలా తొందరగా డిఫ్రెషన్‌ లోంచి బయటపడ్డావని చెప్తారు. అయితే తాను మాత్రం డెలివరీ జాబ్‌ చేస్తున్నట్టు వెంకట్‌ ఇంట్లో చెప్పడు.. అదే మనసులో అనుకుంటూ బాధపడతాడు. లక్ష్మీ లంచ్‌ బాక్స్‌ ఇస్తే.. అక్కడ క్యాంటీన్‌లో ఫుడ్‌ ఉంటుంది కదా బాక్స్‌ వద్దులే అంటూ చెప్పగానే.. లక్ష్మీ, చలపతి అనుమానంగా నువ్వెప్పుడు బయట ఫుడ్‌ తినవు కదా..? అనగానే.. వెంకట్‌ సరే అయితే ఇటువ్వు అంటూ బాక్స్‌ తీసుకుని వెళ్లిపోతాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

కొట్టుకునే వరకు వెళ్లిన షాలిని, వర్షిణి!

బిగ్ బాస్ 10 ఎలిమినేషన్.. చైత్ర రాయ్ ఫస్ట్ వీడియో చూసారా?

ఢీ 10 రాజు నేరస్థుడని ప్రూవ్ అయితే ఎన్నేళ్లు జైలు శిక్ష పడుతుందో తెలుసా?

బిగ్ బాస్ 10 2వ వారం నామినేషన్స్ రచ్చ.. అందరి టార్గెట్ అతడే!

త్రిగుణ్ పద్ధతి మార్చుకోవాలి.. కామనర్స్ కు మద్దతుగా మాజీ కంటెస్టెంట్!

ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న బిగ్ బాస్ 10!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆమె ఎంట్రీ ఖాయం..

Ninnu Kori Chandra : సీరియల్ లవర్స్ కు షాక్.. చంద్ర అవుట్..

Big Stories

Advertisement
×