E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode June 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: దుగ్గిరాల ఇంటికి వెళ్లిన చలపతి, లక్ష్మీ – రాజును నిజం తెలిసిందా అని అడిగిన లక్ష్మీ

Brahmamudi Serial Today Episode June 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: దుగ్గిరాల ఇంటికి వెళ్లిన చలపతి, లక్ష్మీ – రాజును నిజం తెలిసిందా అని అడిగిన లక్ష్మీ
Advertisement

Brahmamudi serial today Episode: లక్కీ ఆత్రుతగా ఐశ్వర్యకు ఫోన్‌ చేస్తుంటాడు. ఐశ్వర్య మాత్రం లక్కీ కాల్‌ కట్‌ చేస్తుంది. దీంతో లక్కీ ఆలోచిస్తుంటాడు. ఇంతలో లక్కీ దగ్గరకు చలపతి, లక్ష్మీ వెళ్తారు. దీంతో లక్కీ ఆశ్చర్యంగా మీరు ఫోన్‌ చేస్తే.. నేనే వచ్చేవాడిని కదా అంటాడు. దీంతో చలపతి కోపంగా ఇన్ని రోజులు మేము లక్కీ గురించి ఎన్నిసార్లు అడిగినా అక్కడున్నాడు.. ఇక్కడున్నాడు అంటూ కథలు చెప్పావు.. అందుకే డైరెక్టుగా రాజు ఎక్కడున్నాడో తెలుసుకుందామనే వచ్చాం అంటాడు చలపతి. దీంతో లక్కీ నిజం రాజు ఎక్కడ ఉన్నాడో తనకు తెలియదని.. చెప్పగానే.. అబద్దం చెప్పకురోయ్‌.. వాడు నిన్ను వదిలి అసలు ఉండలేదు.. చివరకు అండర్‌వేర్‌ కొనాలన్నా ఇద్దరు కలిసే వెళ్తారు.. అలాంటిది వాడెక్కడున్నాడో తెలియదని అబద్దం చెప్పకు అంటూ కోపంగా చెప్పగానే..

లక్కీ అమాయకంగా చూస్తూ.. మీరు నన్ను అనుమానిస్తున్నారు కానీ నిజంగా నాకు తెలియదు బాబాయ్‌. మీరు వాడి గురించి ఎంత ఆలోచిస్తున్నారో.. నేను అంతే ఆలోచిస్తున్నాను.. నా ఫోన్‌ కూడా లిఫ్ట్‌ చేయడం లేదు..చూడండి అంటూ లక్కీ తన ఫోన్‌ తీసి చూపిస్తుండగానే.. రాజు ఫోన్‌ చేస్తాడు. దీంతో చలపతి, లక్ష్మీ కోపంగా చూస్తుంటారు.. లక్కీ షాక్‌ అవుతాడు. చలపతి కోపంగా స్పీకర్‌ పెట్టి మాట్లాడు అనగానే.. లక్కీ  కాల్‌ లిప్ట్‌ చేసి స్పీకర్‌ ఆన్ చేస్తాడు. ఫోన్‌లో రాజు కోపంగా ఒరేయ్‌ దరిద్రుడా ఎక్కడున్నావురా..? ఇక్కడ పార్టీ స్టార్ట్‌ అయిందిరా.. త్వరగా వచ్చేయ్‌ అంటూ కాల్‌ కట్‌ చేస్తాడు. దీంతో చలపతి కోపంగా లక్కీని తిట్టి వాడొక్కడున్నాడో ఆ లోకేషన్‌ పెట్టు అంటూ వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతాడు. లక్కీ లొకేషన్‌ పెట్టి ఈ విషయం వాడికి తెలిస్తే ఎలా ఫీలవుతాడో ఏంటో అని భయపడుతుంటాడు.

Advertisement

మరోవైపు పార్టీ స్టార్ట్‌ అవుతుంది. రేఖ, ఇందును స్టేజీ మీదకు తీసుకెళ్తుంది. కంపెనీ గురించి సీతారామయ్య గురించి రాజు, కావ్యల గురించి గొప్పగా మాట్లాడుతుంది రేఖ. ఇక కంపెనీ బాధ్యతలు తీసుకోవడానికి ఇందు అన్ని అర్హతలు పొందింది కాబట్టి ఇందుకు కంపెనీ సీఈవోగా బాధ్యతలు అప్పజెప్పాను.. ఇప్పుడు ఇందు మాట్లాడుతుంది అంటూ మైక్‌ తీసి ఇందుకు ఇస్తుంది. ఇందు.. రేఖ ఆంటీకి థాంక్స్‌ అంటూ స్పీచ ‌మొదలు పెడుతుంది. మన స్వరాజ్‌ కంపెనీని నేను ముందుకు తీసుకెళ్తాను అంటూ చెప్తుంటే.. మీకు ఎక్స్‌పీరియెన్స్‌ లేదు కదమ్మా ఎలా తీసుకెళ్తారు అని ఒకరు అడగ్గానే..

మా రేఖ ఆంటీ నాకు అన్ని నేర్పించింది. కంపెనీని ఎలా ముందుకు తీసుకెళ్లాలి.. ఎలా బిజినెస్‌ చేయాలి అనే విషయాల్లో నాకు సపోర్ట్‌గా ఉంటుంది అని చెప్తుండగానే.. భ్రమరాంబ.. శేషు, ఇందు రేఖ గురించి చాలా గొప్పగా చెప్తుంది కదా..? అంటుంది. దీంతో శేషు ఏం తనను రాచి రంపాన పెట్టింది కూడా చెప్పమంటావా..? అంటాడు. భ్రమరాంబ నువ్వు ఊరుకో శేషు అంటుంది. ఇక ఇందు మాట్లాడుతుంటే.. రాజు ఏం మాట్లాడుతున్నావు.. అని మనసులో అనుకుంటాడు. ఇంతలో ఒక వ్యక్తి తాను రాజు, కావ్య ఉన్నప్పుడు స్వరాజ్‌ కంపెనీతో బిజినెస్‌ చేసేవాడినని తర్వాత రేఖ మీద నమ్మకం లేక బిజినెస్‌ చేయడం ఆపేశానని చెప్తాడు. ఇప్పుడు మళ్లీ మీరు బాధ్యతలు తీసుకున్నందుకు మీతో బిజినెస్‌ చేస్తాను అని చెప్పగానే.. రేఖ, సుభాష్‌ అందరూ హ్యాపీగా ఫీలవుతారు.

Advertisement

ఇంతలో అక్కడకు చలపతి, లక్ష్మీ వస్తారు. ఇదేదో పెద్ద వాళ్ల పార్టీలా ఉందేమోనని అనుమానంగా లోపలికి వెళ్తారు. అప్పుడే సుభాష్‌కు వాటర్‌ తీసుకురావడానికి లోపలికి వెళ్తున్న అపర్ణ, చలపతి, లక్ష్మీలను చూసి దగ్గరకు వెళ్లి పలకరిస్తుంది. వాళ్లు రాజు కోసం వచ్చామని చెప్పగానే.. అపర్ణ వాళ్లను కూర్చోబెట్టి రాజును పంపిస్తాను అని చెప్పి వెళ్లిపోతుంది. అప్పుడే చలపతి లక్ష్మీ, రాజు.. ఇందులను చూసి షాక్‌ అవుతారు. అపర్ణ వెళ్లి రాజుకు చెప్పగానే.. రాజు వాళ్లను చూసి షాక్‌ అవుతాడు. వెంటనే వాళ్ల దగ్గరకు వెళ్లి పక్కకు తీసుకెళ్తాడు. అసలు మీరెందుకు ఇక్కడకు వచ్చారు అని అడగ్గానే.. చలపతి ఈ ఇల్లు ఎవరిదో తెలుసా..? అని అడగ్గానే.. దుగ్గిరాల వారిది అని చెప్పగానే.. లక్ష్మీ, చలపతి షాక్‌ అవుతారు. రాజు తాను బిజినెస్‌ చేస్తున్నానని చెప్పి వాళ్లను పంపిచేస్తాడు. అప్పుడే రేఖ చూస్తూ.. అనుమానంగా దగ్గరకు వచ్చి వాళ్లెవరు అని అడుగుతుంది. దీంతో రాజు షాక్‌ అవుతాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

సత్తా చాటిన కామనర్.. బిగ్ బాస్ 10 తొలి కెప్టెన్ గా లేడీ కంటెస్టెంట్!

గుండెనిండా గుడిగంటలు రోహిణి షాకింగ్ నిర్ణయం..?హమ్మయ్య ఫ్యాన్స్ హ్యాపీ..

ఇండస్ట్రీకి రోహిణి గుడ్ బై.. ఎందుకో తెలుసా..?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ రోహిణిని విడగొట్టేందుకు ప్లాన్.. మీనా ఫుల్ హ్యాపీ.. మనోజ్ కు వార్నింగ్..

Podarillu Today Episode : చక్రీ పంట పండిందిరోయ్.. అస్సలు ఊహించని ట్విస్ట్.. చక్రీ మాస్టర్ ప్లాన్..

Karthika Deepam 2 Serial Today Episode September 19th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినిని ప్రశ్నించిన సూరజ్ – కార్తీక్ ఇంటికి వెళ్లిన శివనారాయణ ఫ్యామిలీ         

Intinti Ramayanam Today Episode: తాగొచ్చి రచ్చ చేసిన కమల్.. పార్వతికి అనుమానం..పల్లవి మాస్టర్ ప్లాన్..

Saturday Movies in Tv : శనివారం సినిమాల సందడి.. జాతర మాములుగా లేదు..

Big Stories

Advertisement
×