New Passport Rules: విదేశీ ప్రయాణాలకు తప్పనిసరిగా పాస్ పోర్టు ఉండాల్సిందే. చదువుల కోసం, బంధుమిత్రులను చూడటానికి, వెకేషన్స్ కు ఫారిన్ వెళ్లాలి అనుకునే వాళ్లు తప్పనిసరిగా పాస్ పోర్టు తీసుకుంటారు. అయితే, తాజాగా కేంద్ర ప్రభుత్వం పాస్ పోర్టు నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా 2023 అక్టోబర్ 1 తర్వాత పుట్టిన వారి విషయంలో కొత్త రూల్ పెట్టింది. పాస్ పోర్టు కావాలంటే వీళ్లు తప్పకుండా బర్త్ సర్టిఫికేట్ జత చేయాల్సిందేనని వెల్లడించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. జనన, మరణ ధృవీకరణ రిజిస్ట్రార్, మున్సిపల్ కార్యాలయం లేదంటే సంబంధిత అధికారి జారీ చేసిన బర్త్ సర్టిఫికేట్ ను సమర్పించవచ్చని తెలిపింది. 2023 అక్టోబర్ 1కి ముందుకు జన్మించిన వాళ్లు డ్రైవింగ్ లైసెన్స్, టీసీ, 10వ తరగతి మార్క్స్ లిస్ట్ సమర్పిస్తే సరిపోతుందని వెల్లడించింది.
పాస్ పోర్టు చట్టంలో మార్పులు చేసిన కేంద్ర ప్రభుత్వం
ఇక 2023 అక్టోబర్ 1 తర్వాత పుట్టిన పిల్లలకు బర్త్ బర్త్ సర్టిఫికేట్ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పాస్ పోర్టు చట్టంలో కీలక మార్పులు చేసింది. జనన ధృవీకరణ పత్రాను మాత్రమే బర్త్ డేట్ రుజువుగా గుర్తించేందుకు గాను 19980 పాస్ పోర్ట్ నిబంధనలను సవరించింది. పాస్ పోర్ట్ చట్టంలోని సెక్షన్ 24లో ని నిబంధనల ప్రకారం పాస్ పోర్ట్ నియమాలను సవరించినట్లు విదేశాంగశాఖ వెల్లడించింది. ఈ మేరకు అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. 2025 పాస్ పోర్ట్ నిబంధనల ప్రకారం బర్త్ సర్టిఫికేట్ ను తప్పనిసరి చేసింది.
2023 అక్టోబర్ 1కి ముందు జన్మించిన వాళ్లు..
తాజా నిబంధనల ప్రకారం అక్టోబర్ 1, 2023 కి ముందు జన్మించిన వారు పుట్టిన తేదీకి ఇతర జత చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. గుర్తింపు కలిగిన స్కూల్స్ లేదంటే ఎడ్యుకేషన్ బోర్డులు జారీ చేసిన సర్టిఫికేట్లు, టీసీలను పుట్టిన తేదీ ధృవీకర పత్రంగా సమర్పించవచ్చు. లేదంటే ఇన్ కం టాక్స్ డిపార్ట్ మెంట్ జారీ చేసిన పాన్ కార్డు, ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ రికార్డు కాపీ, రవాణాశాఖ జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్. ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన ఓటరు గుర్తింపు కార్డు, ఎల్ ఐసీ కంపెనీ జారీ చేసిన పాలసీ బాండ్లలో ఏదో ఒకటి సమర్పించాలని సూచించింది.
Read Also: భలే.. ఈ పడవ వంతెనలా మారిపోతుంది, ఈ అద్భుతం ఎక్కడో తెలుసా?
సాధారణంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పాస్ పోర్టుల కోసం వచ్చే దరఖాస్తుదారులలో ఎక్కువ మంది బర్త్ సర్టిఫికేట్లను కలిగి ఉండటం లేదు. ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా పాస్ పోర్టు నిబంధనలలో కీలక మార్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే అక్టోబర్ 1, 2023 తర్వాత పుట్టిన వారికి బర్త్ సర్టిఫికేట్ తప్పకుండా ఉండాలని తేల్చి చెప్పింది. అంతకు ముందు జన్మించిన వారికి కేంద్రం సూచించిన పత్రాలలో ఒక దాన్ని సమర్పించాలని వెల్లడించింది.
Read Also: సమ్మర్ లో వన్ డే టూర్ ప్లాన్ చేస్తున్నారా? హైదరాబాద్ సమీపంలోఅదిరిపోయే డెస్టినేషన్స్ ఇవే.!