Brahmamudi serial today Episode: ఇంట్లో అందరూ ఏడుస్తూ కూర్చుని ఉంటారు. స్వప్న కాఫీ తీసుకుని వచ్చి కావ్యకు ఇస్తుంది. కావ్య వద్దంటుంది. దీంతో వచ్చినప్పటి నుంచి ఏం తినకుండా తాగకుండా ఉంటే ఎలా చెప్పు.. అంటూ మీరైనా చెప్పండి ఆంటీ ఆని అపర్ణను అడగ్గానే.. ఆపర్ణ ఏడుస్తూనే.. ఇంటికి పెద్దదికైన నా కొడుకు కళ్ల ముందు లేకపోతే ఇక ఆకలికి దాహానికి చోటెక్కడిది ఇప్పుడు మాకేమీ వద్దు అంటుంది. ఇంతలో ఒక కానిస్టేబుల్ వచ్చి అప్పుకు రిపోర్ట్స్ ఇచ్చి వెళ్తాడు. అవి చూస్తున్న అప్పును ఏంటమ్మా అవి అని అడుగుతాడు సుభాష్.. దీంతో అప్పు రాత్రి అక్క చెప్పినదాన్ని బట్టి నాకు కొంచెం అనుమానం వచ్చి బావ గారి బట్టల మీద ఉన్న బ్లడ్ ను ఫోరెన్సిక్ డిఫార్ట్‌మెంట్‌కు పంపించాను అని చెప్తుంది. ఇంతలో రుద్రాణి వెటకారంగా.. పోలీస్ అయ్యాక నీకు అనుమానాలు బాగా ఎక్కువై పోయాయి అంటుంది.
దీంతో స్వప్న కోపంగా మీరు నోరు మూసుకుంటారా..? ముందు అందులో ఏముందో చెప్పవే అని అడుగుతుంది. రిపోర్ట్స్ చూసిన అప్పు షాక్ అవుతుంది. ప్రకాష్ అత్రుతగా ఏంటమ్మా ఏమని వచ్చింది రిపోర్ట్స్ అని అడుగుతాడు. దీంతో రుద్రాణి ఏమొస్తుంది. దాని కళ్లు చూస్తే అర్థం అవుతలేదా..? ఆ రిపోర్ట్స్ లో ఏముందో అంటుంది. ఇందిరాదేవి కోపంగా నువ్వు నోరు మూస్తావా..? రుద్రాణి.. నువ్వు చెప్పు అప్పు అందులో ఏముందో అని అడుగుతుంది. దీంతో అప్పు ఆ షర్ట్ మీద ఉన్న బ్లడ్ బావదే అని చెప్తుంది. దీంతో అపర్ణతో సహా అందరూ బాధపడతారు. కావ్య మాత్రం నమ్మదు. ఆయన బతికే ఉన్నారు. అది నా మనసకు తెలుసు. మీరు ఎవ్వరూ నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతున్నాను. ఆయన నన్ను వదిలిపెట్టి ఎక్కడికి పోడు. ఆయినా ఇవన్నీ చేయమని చెప్పింది ఎవరే నీకు అని అడుగుతుంది.
ఇలాంటి విషయాల్లో నిర్దారణ చేసుకోవాలంటే.. ఇలా ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్ హెల్ప్ తీసుకోక తప్పదు అక్కా అంటుంది. దీంతో కావ్య కోపంగా ఏమీ అవసరం లేదు ఆయన బతికే ఉన్నారు అని కరాకండిగా చెప్తుంది. ఇంతలో రుద్రాణి వచ్చి నువ్వన్నటే రాజ్ బతికే ఉన్నాడనుకుందాం. మరి ఎక్కడున్నాడు.. ఏం చేస్తున్నాడు. సరే యాక్సిడెంట్ అయ్యాక నువ్వు కారులో ఉన్నావు.. మరి రాజ్ ఎక్కడ.. రాజ్‌ను చూపించలేవు కానీ బతికే ఉన్నాడని అంటున్నావు.. నీ గాలి మాటలు నమ్మాలా..? లేక ఈ రిపోర్ట్స్ నమ్మాలా అని అడుగుతుంది.
దీంతో ఆయన బతికే ఉన్నాడని మీ అందరి ముందుకు తీసుకొస్తాను. ఈ కథ ఎక్కడ ఆగిపోయిందో అక్కడికే వెళ్లి మొదలు పెడతాను. ఆయన ఎక్కడ ఉన్నా తీసుకొస్తాను. అని కావ్య వెళ్లిపోతుంది. రుద్రాణి మాత్రం రాజ్ లేడన్న బాధ కంటే కావ్య ఎక్కడ పిచ్చిదై పోతుందోనన్న భయం నాకు ఎక్కువ అయిపోతుంది. పోయిన వాళ్లు ఎలాగూ రారు.. ఉన్నవాళ్లనైనా మనం కాపాడుకోవాలి కదా అంటుంది. ఇంతలో రాహుల్ ఆఫీసుకు వెళ్తాడని చెప్తుంది. దీంతో అవసరం లేదని కంపెనీకి అన్నయ్య వెళ్తాడులే అని ప్రకాష్ చెప్పగానే.. నేను మాత్రమే కాదు ప్రకాష్, నేను కూడా వెళ్తాము. అని సుభాష్ చెప్తాడు. అందరూ రుద్రాణి, రాహుల్‌ను తిడతారు.
రాజ్ యామిని దగ్గరకు వెళ్లి సారీ చెప్తాడు. దేనికి బావ అని యామిని అడుగుతుంది. నేను తెలియకుండా నిన్ను చాలా బాధపెడుతున్నాను. నిజానికి నేను కావాలని ఏమీ చేయడం లేదు. నా గతంలోకి తొంగి చూద్దామంటే అంతా చీకటే కనిపిస్తుంది. ఆ గతంలో నువ్వు ఉన్నావని పెళ్లి దాకా వెళ్లామంటే ఏమీ తెలియడం లేదు. నా మనసులో అంతా గందరగోళంగా ఉంది. ఈ కొత్త జీవితం అస్తవస్తంగా ఉంది. నాది కానీ ఇంట్లో ఉన్నానని నా మనసు చెప్తుంది అంటూ రాజ్ బాధపడితే.. నేను నీ పరిస్థితిని అర్థం చేసుకోగలను బావ కానీ నేను అబద్దం చెప్పడం లేదు బావ. ఒక అమ్మాయి జీవితం పంచుకోవడం దాకా వెళ్లిందంటే అందులో వేరే స్వార్థం ఏముంటుంది అంటుంది యామిని.
దీంతో రాజ్ అది కూడా నిజమే.. నువ్వు నీ లాగే ఉన్నావు.. నేనే నా లాగా లేను.. నేను ఇప్పుడే పుట్టినట్టు ఉంది. నీతో పెళ్లి దాకా వెళ్లినట్టు సాక్ష్యాలు ఉన్నాయి. కానీ ఆ సాక్ష్యాల్లో నేను ఉన్నట్టు నాకే తెలియడం లేదు. అందుకే అలవాటు పడటానికి సమయం పడుతుంది. అంతవరకు అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను అని చెప్పగానే.. యామిని వద్దు బావ నాకోసం బలవంతంగా మారాలనుకోవద్దు.. నువ్వు నీలాగే ఉండు.. నేనే నిన్ను ఎందులోనూ ఫోర్స్ చేయను అంటూ వెళ్లిపోతుంటే రాజ్ చేయి పట్టుకుని ఆపేస్తాడు. మనిద్దరం కలిసి అలా బయటకు వెళ్దామా..? అని అడుగుతాడు. దీంతో యామిని నువ్వు అడిగితే ఏదైనా కాదంటానా బావ నువ్వు ఫ్రెస్ అయి రా బావ నేను రెడీ అయి వస్తాను అని చెప్తుంది.
యామినితో బయటకు వెళ్లిన రాజ్‌ను కారులో వెళ్తున్న కావ్య చూస్తుంది. వెంటనే కారు దిగి రాజ్ కారు వెనకాల ఏవండి అంటూ పరుగెడుతుంది. ఎంత దూరం పరిగెత్తినా కారు దొరకదు. కావ్య అలిసిపోయి ఒక దగ్గర నిలబడగానే.. ముందుకు వెళ్లిన కారు ఆగుతుంది. అది చూసిన కావ్య పరుగెత్తలేక మెల్లగా నడుస్తూ వెళ్తుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?