E-Paper
Advertisement

Brahmamudi Serial Today march 25th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: నందును కాపాడిన ఇందు  

Brahmamudi Serial Today march 25th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: నందును కాపాడిన ఇందు  
Advertisement

Brahmamudi serial today Episode: రాకేష్‌ డబ్బులు ఇవ్వకపోతే ఇంటికి వస్తానని బెదిరించడంతో ఐశ్వర్య భయపడుతుంది. డబ్బుల ఎలా సర్దాలి అని ఆలోచిస్తూ రేఖ తనకు చేయించిన నెక్లెస్‌ అమ్మేసి రాకేష్‌కు డబ్బులు ఇవ్వాలని డిసైడ్‌ అవుతుంది. అయితే రేఖ ఆంటీ నెక్లెస్‌ అడిగితే ఇవ్వదని దొంగిలించడమే మంచిది అనుకుంటుంది. వెంటనే రేఖ వెంట తన రూంలోకి వెల్లి నెక్లెస్‌ ఎక్కడ పెడుతుందో దొంగచాటుగా చూస్తుంటుంది. ఇంతలో వెనకాలే భ్రమరాంభ వచ్చి ఇదేంటి ఐశ్వర్య పిల్లిలాగా రేఖ గదిలోకి తొంగి చూస్తుంది ఏమై ఉంటుంది అనుకుంటుంది. ఇంతలో రేఖ నెక్లెస్‌ లాకర్లో పెట్టి వెళ్లిపోగానే.. ఐశ్వర్య వెళ్లి నెక్లెస్‌ కొట్టేస్తుంది. భ్రమరాంబ కిటికీలోంచి చూస్తుంది. సొంత మేనకోడలే చేతి వాటం చూపించినప్పుడు చిన్నప్పటి నుంచి అలవాటు పడ్డ ప్రాణం నాది మరి నా చేతి వాటం కూడా చూపించాలి కదా..? అనుకుంటూ ఐశ్వర్య వెళ్లిపోయాక భ్రమరాంబ లోపలికి వెళ్లి తాను ఒక నెక్లెస్‌ కొట్టేస్తుంది.

మరోవైపు ఇందు ఇంటర్వ్యూ కు వెళ్తుంది. అక్కడ మేనేజర్‌ తల తిక్కగా మాట్లాడుతాడు. ఇందు కూడా ఆయనతో తలతిక్కగా మాట్లాడి థాంక్స్‌ చెప్పి వెళ్లిపోతుంది. ఇక రాజు, లక్కీ కారులో వెళ్తుంటారు. మామ మన ఆదృష్టాన్ని  పరీక్షించుకోవడానికి  హైదరాబాద్‌లో ఆల్‌రెడీ యాప్స్‌ రూపంలో చాలా ఉన్నాయి. మన ట్విన్‌ సిటీస్‌ లో మొత్తం పదకొండు డేటింగ్‌ యాప్స్‌ ఉన్నాయి. అందులో ప్రీమియం యాప్స్‌ ఒక మూడు నాలుగు ఉన్నాయి.. కరెక్టుగా కష్టపడి వెతికితే అందులో డబ్బున్న అమ్మాయిలు దొరుకుతారు. కాకపోతే ఎక్కువగా ఆంటీలే ఉన్నారనుకో అది వేరే విషయం.. కానీ కరెక్టుగా వెతికే అమ్మాయిలు దొరుకుతారు. అని చెప్పగానే..

Advertisement

నేను నీలా కాదురా..? ఎంత కష్టమైనా సరే నాకు నచ్చిన అమ్మాయి దొరికే వరకు వెతుకుతూనే ఉంటాను.. అని రాజు చెప్పగానే.. నేను నిన్ను ఫాలో అవుతా మామ అంటాడు లక్కీ. దీంతో ఇంకెందుకు ఆలస్యం మొదలు పెట్టు అనగానే.. సరే అంటూ యాప్స్‌ ఓపన్‌ చేస్తాడు లక్కీ.. ఇద్దరూ కారులో వెళ్తుంటారు.. ఒక దగ్గర ఐశ్వర్య కారు ఆగిపోయి రోడ్డు పక్కన నిలబడి ఉంటుంది. ఐశ్వర్యను చూసిన లక్కీ మామా కారు ఆపు అని అడగ్గానే.. ఎందుకురా అప్పుడే నీకు అమ్మాయి దొరికిందారా..? అని రాజు అడగ్గానే.. అవునురా అక్కడ రోడ్డు మీద చూడు ఐశ్వర్య నిలబడి ఉంది కాలం నన్ను ఐశ్వర్యను కలపాలని చూస్తుందిరా.? తన కారు పాడైనట్టు ఉంది. ఇప్పుడు నేను నేరుగా వెళ్లి.. గిఫ్టులా లిప్ట్‌ ఇస్తే .. నా ప్రేమ సక్సెస్‌ అవుతుంది అని లక్కీ చెప్పగానే రాజు కోపంగా చచ్చినా కారు ఇవ్వను ప్రేమ కోసం యుద్దాలు జరిగాయి అన్నావు కదరా..? ఫ్రెండ్‌ అని కూడా చూడకుండా ఒంటరిగా రోడ్డు మీద వదిలేశావు.. అనగానే..

అవసరం కోపం వదిలేశాను మామ.. అయినా ఇప్పుడు మనం తనకు లిఫ్ట్‌ ఇస్తే నీకు మంచిదేరా మామ.. ఎందుకంటే తను రిచ్‌ అయితే తన ఫ్రెండ్స్‌ లో ఎవరో ఒకరు రిచ్‌ ఉంటారు.. కదా వారిలో ఒకరిని నువ్వు సెట్‌ చేసుకోవచ్చని లక్కీ చెప్పగానే.. రాజు తెలివిగా మాట్లాడావా అంటాడు.. లక్కీ రిక్వెస్ట్‌ చేయడంతో రాజు ఓకే అంటాడు.. లక్కీ ఐశ్వర్య దగ్గరకు వెళ్లి తన కారులో వెళ్దామని తీసుకెళ్తుంటాడు.. అప్పుడే ఇంటర్వ్యూ నుంచి బయటకు వచ్చిన ఇందు, ఐశ్వర్య వెళ్లడం చూసి ఈ వెధవ ఆ రోజు పబ్‌ లో మా ఐశ్వర్యను బైక్‌ మీద ఎక్కించుకుని పోలీస్‌స్టేషన్‌ దాకా తీసుకెళ్లాడు. మళ్లీ ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడో ఏంటో.. అనుకుంటూ ఇందు కూడా ఆలోలో లక్కీ కారును ఫాలో అవుతుంది. నందు ఇద్దరు రౌడీలను తరుముకుంటూ వెళ్తూ నందు వెళ్తున్న ఆటోకు ఎదురుగా పడుతుంది. ఇద్దరు రౌడీలు నందును కొడుతుంటే.. ఇందు వెళ్లి హెల్ప్‌ చేస్తుంది.  మరోవైపు ఒక దగ్గరకు వెళ్లాక ఐశ్వర్య కారు దిగి వెళ్లిపోతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 3rd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు వెనకాలే ఫాలో అవుతున్న రౌడీలు  

బిగ్ బాస్ షోలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న కంటెస్టెంట్ ఈమె!

Gundeninda Gudigantalu : సీరియల్లో యూట్యూబర్ ఎంట్రీ.. ఇదేం ట్విస్ట్ మావా..

Intinti Ramayanam : పల్లవి అవుట్.. ఫ్యాన్స్ కు మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్..

Big Stories

Advertisement
×