E-Paper
Advertisement

Brahmamudi Serial Today march 2nd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: పిల్లలను చంపేస్తానని బెదిరంచిన రేఖ  

Brahmamudi Serial Today march 2nd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: పిల్లలను చంపేస్తానని బెదిరంచిన రేఖ  
Advertisement

Brahmamudi serial today Episode: 

రాజ్‌ను పెంచుకుంటున్న కుటుంబం రాజ్‌కు గతం గుర్తుకు వచ్చేలా చేయాలనుకుంటారు.. ఈలోగా పోలీస్‌ కంప్లైంట్‌ ఇస్తే.. వీడి కోసం ఎవరైనా వెతుకుతుంటే.. వాళ్లకు తెలుస్తుంది కదా..? అనుకుంటారు.. మరోవైపు రేఖ ఇంట్లో ఉన్న దుగ్గిరాల ఫ్యామిలీ ఫోటోలు మొత్తం తీసుకొచ్చి బయటపడేసి కాల్చేస్తుంది. అప్పుడే అక్కడకు వచ్చిన అపర్ణ ఏడుస్తూ రేఖ ఏం చేస్తున్నావు.. ఇవన్నీ నా వాళ్ల జ్ఞాపకాలు ఆపు రేఖ..అంటూ వేడుకుంటుంది. దీంతో రేఖ కోపంగా ఏయ్‌ ఇక నుంచి దుగ్గిరాల కుటుంబానికి సంబంధించిన ఏ జ్ఞాపకాలు ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు అందుకే తగులబెట్టేస్తున్నాను.. అని చెప్పగానే..

అపర్ణ ఏడుస్తూ రేఖ వద్దు రేఖ నాకంటూ మిగిలింది ఇవి మాత్రమే ఫ్లీజ్‌ రేఖ వద్దు రేఖ వదిలేయ్‌ రేఖ అంటూ రిక్వెస్ట్‌ చేసినా రేఖ వినకుండా మొత్తం కాల్చేస్తుంది. ఇక నుంచి ఈ ప్రపంచం రుద్రాణి కుటుంబాన్ని మాత్రమే గుర్తు పెట్టుకోవాలి. దుగ్గిరాల వంశం అనేది ఈరోజుతో కాలి బూడిదైపోతుంది. నీ మనవరాళ్లు పెరిగి పెద్దైన తర్వాత కూడా వాళ్ల అమ్మానాన్నలు ఎలా ఉంటారో కూడా వాళ్లకు తెలియకూడదు. వాళ్ల మనసుల్లో ఒక్కటే ఉండాలి. ఈ రేఖ అంటే భయం ఉండాలి. నేను ఏం చెప్తే అది చేయాలన్న భయం మాత్రమే ఉండాలి. ఈరోజు నుంచి నువ్వు వాళ్లను అలాగే పెంచాలి. అని చెప్పి వెళ్లిపోతుంది. అపర్ణ అక్కడే కూలబడిపోయి ఏడుస్తూ ఉంటుంది.

Advertisement

మరోవైపు రాజ్‌ను పెంచుకుంటున్న వ్యక్తి బయటి నుంచి ఇంటికి వెళ్లగానే.. వాళ్ల భార్య ఏంటండి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్తానన్నారు కదా వెళ్లలేదా..? అని అడగ్గానే.. ఆమె భర్త వెళ్లాను.. నా ఫ్రెండ్‌ కానిస్టేబుల్‌ కోటిని అడిగాను.. కానీ సిటీలో పిల్లాడు మిస్‌ అయినట్టుగా ఏ కేసు రాలేదంట. శ్రీశైలం పోలీస్‌ స్టేషన్‌కు కూడా ఫోన్‌ చేసి కనుక్కున్నారట. అక్కడ కూడా ఏ ప్రమాదం కేసు రాలేదట. అని చెప్పగానే.. ఇన్ని రోజులైనా ఎవ్వరూ మిస్సింగ్‌ కంప్లైంట్ లేదు అంటే వాళ్ల అమ్మానాన్నలు ఏదైనా ప్రమాదంలో అని చెప్పగానే.. నాకు అదే అనిపిస్తుంది లక్ష్మీ అంటాడు ఆమె భర్త, ఇంతలో రాజ్‌ లోపలి నుంచి మమ్మీ అంటూ బయటకు వస్తాడు.. లక్ష్మీ భర్త రాజ్‌కు కేక్‌ ఇస్తాడు. లక్ష్మీ రాజ్‌కు రాజు అని పేరు పెడుతుంది.

మరోవైపు రేఖ తన పిల్లలకు అక్ష్యరాభ్యాసం చేయిస్తుంటుంది. ఇంతలో అక్కడికి అపర్ణ వచ్చి నా మనవరాళ్లకు కూడా అక్షరాభ్యాసం చేయించాలి కదా అని అడుగుతుంది. దీంతో రేఖ మనోహరి తిట్టి వాళ్లకు అవసరం లేదు నీ మనవరాళ్లను చదివించాలన్న ఆలోచన ఇక్కడితే వదిలేసేయ్‌.. లేదంటే.. నిన్ను కూడా ఆ కైలాస దర్శనానికి పంపించేయాల్సి ఉంటుంది అని బెదిరించగానే.. అపర్ణ వెళ్లిపోతుంది. తర్వాత అపర్ణ ఒక్కతే కూర్చుని ఏడుస్తుంటుంది. భగవంతుడా..? ఈ పసివాళ్లకు కూడా అన్యాయం చేద్దాం అనుకుంటున్నావా..? వీళ్ల భవిష్యత్తు తీర్చిదిద్దుతానని నా కోడలికి మాటిచ్చాను. కానీ ఇప్పుడేమో కనీసం చదివించే అవకాశం లేకుండా చేశావు.. వీళ్ల ప్రాణం నిలపడం కోసం ఆ రేఖకు తల వంచి చేతకాని దానిలా నిలబడిపోయాను. నేను వీళ్లను ఉన్నతంగా ఎలా తీర్చిదిద్దగలను.. ఒంటరిగా ఏం చేయగలను.. అంటూ ఏడుస్తుంటే..

Advertisement

కావ్య ఆత్మ వచ్చి మీరే చేయగలరు అత్తయ్యా అని చెప్పగానే.. అపర్ణ షాకింగ్‌ గా కావ్య నా జీవితానికి బాధ ఒక్కటే మిగిలింది. ఈ పసివాళ్లకు నేను ఏమీ చేయలేకపోతున్నాను.. నన్ను క్షమించు నీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతున్నాను.. అని చెప్పగానే.. మనం ఎలా ఆలోచిస్తామో మన పిల్లల భవిష్యత్తు అలాగే ఉంటుంది. అని చెప్పగానే.. అపర్ణ ఏడుస్తూనే.. ఆ రేఖను ఎదురించి నేను ఏం చేయగలను చెప్పు అని అడుగుతుంది. దీంతో కావ్య ఆత్మ అత్తయ్య కొన్ని సార్లు అవకాశం మనకు అనుకూలంగా లేనప్పుడు పరిస్తితులకు తలవంచి కొత్త దారులు వెతుక్కోవాలి అత్తయ్యా.. దారి కనిపించలేదు అని ఆగిపోతే చీకట్లోనే మిగిలిపోతాం.. ఒక కొత్త దీపాన్ని వెలిగిస్తే కొత్త దారులు తెరుచుకుంటాయి..

ఆ రేఖ చెప్పిన మాటకు మీరు ఆగిపోవాలా..? చదువుకోవాలంటే స్కూల్‌కు వెళ్లాలా..? గురువు చెప్తేనే నేర్చుకోవాలా..? మీరు ప్రయత్నిస్తే తప్పకుండా అవకాశం దొరుకుతుంది అత్తయ్య.. ఈ పసివాళ్ల భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది అత్తయ్యా.. అని చెప్పగానే.. అర్థం అయింది కావ్య ఎవరేం చెప్పినా సరే నేనే వీళ్లకు గురువు అవుతాను.. నేనే చదువు చెప్తాను.. నా కళ్లతోనే వీళ్లకు ప్రపంచాన్ని చూపిస్తాను.. కుళ్లు కుతంత్రాలతో నిండిపోయిన సమాజంతో ఎలా పోరాడాలో నేర్పిస్తాను.. నువ్వు ఆశపడినట్టుగానే.. వీళ్ల భవిష్యత్తును నేను అందంగా తీర్చిదిద్దుతాను.. అంటూ చెప్పగానే.. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అత్తయ్యా అంటూ కావ్య వెళ్లిపోతుంది.

తర్వాత అపర్ణ బియ్యం తీసుకొచ్చి పిల్లలకు ఆ బియ్యంలో అక్షరాభ్యాసం చేయిస్తుంది. అప్పుడే అక్కడకు వచ్చిన రేఖ కోపంగా అపర్ణను తిట్టి.. ఇంకొక్కసారి వీళ్లకు చదువు చెప్పాలని చూస్తే.. వీళ్ల చేతులు విరిచేస్తాను..ఇంకొక్కసారి ఇలా చేస్తే.. నేను వినను ఇదే నా లాస్ట్‌ వార్నింగ్‌.. అంటూ తిట్టి వెళ్లిపోతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

చీరకట్టులో శివజ్యోతి..ఆ భారీ హారం చూస్తే మతిపోవాల్సిందే!

ఈశ్వర్ సాయి కేసులో కొత్త ప్రశ్న.. ‘పెళ్లైనోడిని ఎలా నమ్మావ్ మాధురి?’

స్టార్ హీరోల సినిమాల కంటే సీరియల్స్‌కే ఎక్కువ క్రేజ్.. అసలు సీక్రెట్ ఏంటి?

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Big Stories

Advertisement
×