E-Paper
Advertisement

Brahmamudi Serial Today November 14th:‘బ్రహ్మముడి’ సీరియల్‌: తన ప్లాన్‌ మొత్తం రుద్రాణికి చెప్పిన రాహుల్‌      

Brahmamudi Serial Today November 14th:‘బ్రహ్మముడి’ సీరియల్‌: తన ప్లాన్‌ మొత్తం రుద్రాణికి చెప్పిన రాహుల్‌      
Advertisement

Brahmamudi serial today Episode:

రాజ్, సుభాష్‌, ప్రకాష్‌ రాసుకొచ్చిన లవ్‌ లెటర్స్‌ చదివిన తర్వాత అపర్ణ, దాన్యలక్ష్మీ, కావ్య ముగ్గురు వెటకారంగా నవ్వుతూ ఇవి లవ్‌ లెటర్సా అంటూ తిడతారు. ఇక ప్రకాష్ అయితే ధాన్యలక్ష్మీ అనే పేరుకు బదులు లత అనే రాస్తాడు. దీంతో ధాన్యలక్ష్మీ కోపంగా లత ఎవరు అంటూ అరుస్తుంది. ప్రకాష్‌ మీదకు వెళ్తుంది. ప్రకాష్‌ తప్పించుకుని వెళ్లిపోతాడు. వెనకాలే చీపురుతో వెళ్లి కొడుతుంది ధాన్యలక్ష్మీ.

రాహుల్‌ రెడీ అవుతుంటే రుద్రాని వచ్చి ఏంట్రా మార్నింగ్‌ నుంచి చాలా హడావిడిగా కనిపిస్తున్నావా..? పైగా త్వరగా రెడీ అయ్యావు. మళ్లీ ఏమైనా పార్టీ ప పెట్టుకున్నావా..? అని అడుగుతుంది. దీంతో రాహుల్ కోపంగా చూశావా నువ్వు కూడా నన్ను నమ్మడం లేదు. నీ అభిప్రాయాన్ని మార్చడానికే వెళ్తున్నాను.. అని చెప్పగానే.. నువ్వు అంటే ఏంటో నాకు తెలుసు కాబట్టి అడిగాను.. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావు.. అని రుద్రాణి అడగ్గానే.. పని చేయడానికి వెళ్తున్నాను అని రాహుల్‌ చెప్తాడు. రుద్రాణి షాక్‌ అవుతుంది. నీకు పని ఎవరు ఇస్తున్నారు.. అని అడుగుతుంది. దీంతో రాహుల్‌ పెద్ద పెద్ద జాబులైతే ఎవ్వరూ ఇవ్వరు చిన్నవి అయితే ఎవరైనా ఇస్తారు అని చెప్తాడు. ఇప్పుడు చీఫ్‌గా నువ్వు అలాంటి పనులు చేయడం ఏంటి..? అని రుద్రాణి అడగ్గానే.. స్వప్న ఇప్పుడిప్పుడే నన్ను నమ్ముతుంది. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా..? నిలబెట్టుకోవడానికి నా కష్టార్జితంతో తనను పోషిస్తున్నాను అని తనకు అనిపించడానికే వెళ్తున్నాను అని రాహుల్ చెప్పగానే..

Advertisement

దానికి కష్టపడటం దేనికి కష్టపడినట్టు నట్టించొచ్చు కదా..? ఆ డబ్బులేవో నేను ఇస్తాను అని రుద్రాణి చెప్పగానే.. నో మమ్మీ మనం చేసేది మోసమే అయినా అందులో నిజాయితీ ఉండాలి అప్పుడే స్వప్న నన్ను నమ్ముతుంది. పైగా ఇంట్లో వాళ్ల కళ్లనీ నా మీదే ఉన్నాయి. కొంచెం డౌటు వచ్చినా దొరికిపోతాను. ఈ సారి మాత్రం ఆ అవకాశం ఎవ్వరికీ ఇవ్వాలనుకోవడం లేదు.. కొడితే కుంభస్థలం బద్దలయిపోవాలి. వెల్లి రాజ్‌ ప్లేస్‌లో కూర్చోవాలి అని రాహుల్‌ చెప్పగానే.. ఎంత మారిపోయావురా..? ఇప్పుడు నిన్ను చూస్తుంటే.. నాకు గర్వంగా ఉంది అని రుద్రాణి చెప్పగానే.. ఇప్పుడేనా మమ్మీ సాధించాల్సింది ఇంకా చాలా ఉంది బై అంటూ రాహుల్‌ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

కింద రాహుల్‌కు  స్వప్న ఎదురొస్తుంది ఇంత ఎర్లీగా ఎక్కడికి వెళ్తున్నావు రాహుల్‌ అని అడుగుతుంది. దీంతో రాహుల్‌ ఇప్పటి వరకు నా గురించే ఆలోచించాను. ఇక నుంచి నీ గురించి ఆలోచించాలని నీ గురించి ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. అందుకే వెళ్తున్నాను అని చెప్పడంతో స్వప్న అర్థం కాలేదు రాహుల్‌ అంటుంది. దీంతో రాహుల్‌ ఈ ఇంట్లో ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు నమ్మావు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి వెళ్తున్నాను. ఈవెనింగ్‌ నీకో సర్‌ప్రైజ్‌ ఉంది. వెయిట్‌ అండ్‌ సీ అంటూ చెప్పి వెళ్లిపోతాడు రాహుల్‌.

Advertisement

ఇంతలో ఇంద్రాదేవి వచ్చి ఎక్కడికి వెళ్తున్నాడు అని అడుగుతుంది. స్వప్న తెలియదు అమ్మమ్మ ఏదో పని మీద వెళ్తున్నట్టు ఉన్నాడు అని చెప్పగానే.. ఇంద్రాదేవి నువ్వు మళ్లీ తప్పు చేస్తున్నావు స్వప్న అంటుంది. నేనేం చేశాను అని స్వప్న అడగ్గానే.. వాడిని అలా ఇష్టం వచ్చినట్టు తిరగనిచ్చినందుకే కదా అలా తయారయ్యాడు. ఎక్కడికి వెళ్తున్నాడు. ఏం చేస్తున్నాడు అనేది భార్యగా నువ్వు తెలుసుకోవాలి కదా..? అని చెప్తుంది. దీంతో స్వప్న లేదు అమ్మమ్మ రాహుల్‌ లో మార్పు వచ్చింది అని చెప్తుంది.

దీంతో అది నీ భ్రమ స్వప్న వాడు పుట్టినప్పటి నుంచి చూస్తున్నాం కదా..? వాడు మారడు అని చెప్తుంది ఇంద్రాదేవి. ముందు నేను అలాగే అనుకున్నాను అమ్మమ్మ కానీ తను మారుతున్నాడని నా మనసుకు అనిపిస్తుంది అమ్మమ్మ అందుకే తనకు సపోర్ట్‌ చేయాలనిపిస్తుంది అని స్వప్న చెప్పగానే.. అడవిలో ఎలాంటి మృగంతో నైనా స్నేహం చేయోచ్చు ఒక్క నక్కతో తప్ప.. నీ మొగుడిని నక్కతో పోల్చినందుకు నీకు కోపం వచ్చినా అదే నిజం. మోసం చేయడం వాడి రక్తంలోనే ఉంది. ముఖం జాలిగా పెట్టాడని నమ్మితే మోసం చేస్తాడు జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్లిపోతుంది ఇంద్రాదేవి. ఏదో ఒక రోజు మీరందరూ కూడా రాహుల్‌ ను నమ్మే రోజు వస్తుంది అమ్మమ్మ అని మనసులో అనుకుంటుంది స్వప్న.

తర్వాత పుల్లుగా తినడానికి కావ్యను రాజ్‌ రెస్టారెంట్‌కు వెళ్దామని అడుగుతాడు. సరే వెళ్దాం కానీ రెడీ కావడానికి నాకు మీరే చీర కట్టాలని కావ్య అడుగుతుంది. రాజ్‌ సరే అంటూ కావ్యకు చీర కడతాడు. సరిగ్గా కట్టలేదని కావ్య తిడుతుంది. అయితే నువ్వే కట్టుకో అంటాడు రాజ్‌. మరోవైపు గార్డెన్‌లో కూర్చున్న ధాన్యలక్ష్మీ, ప్రకాష్‌కు క్లాస్‌ తీసుకుంటుంది. అంతా చూస్తున్న అప్పు, కళ్యాణ్‌ నవ్వుకుంటారు. తర్వాత కావ్యను రాజ్‌ రెస్టారెంట్‌ తీసుకెళ్లి సర్‌ప్రైజ్‌ ఇస్తాడు. కావ్య ఆనందంతో ఉప్పొంగిపోతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Gundeninda GudiGantalu Today episode: కన్నీళ్లు పెట్టుకున్న మీనా.. బాలుకు నిజం తెలుస్తుందా..? ఇది కదా అసలు ట్విస్ట్..

Podarillu Today Episode : గ్రాండ్ గా బర్త్ డే వేడుక.. చక్రీ ప్లాన్ సక్సెస్.. చక్రీకి దిమ్మతిరిగే షాకిచ్చిన మహా..

Nindu Noorella Saavasam Serial Today Episode July 21st ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌కు నిజం చెప్పిన ఎస్సై  

Illu Illalu Pillalu Today Episodes: అడ్డంగా బుక్కయిన శ్రీవల్లి.. నర్మదకు భద్రపై అనుమానం.. వేదవతి ఫుల్ హ్యాపీ..

Intinti Ramayanam Today Episode: పాపం మీనాక్షికి కన్నీళ్లు.. పల్లవి, కమల్ రొమాన్స్.. యోగా టీచర్ ఎంట్రీ అదుర్స్..

Brahmamudi Serial Today Episode July 21st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: దుగ్గిరాల ఇంటికి వచ్చిన రాజు   

Actress Sirisha : నటి శిరీష నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Godhavari Janu : ‘గోదావరి ‘ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. హీరోయిన్ అవుట్..

Big Stories

Advertisement
×