Brahmamudi serial today Episode: అప్పు కళ్యాన్‌ను వెతుకుతుంది. కళ్యాన్ మాత్రం బయట నిలబడి ఏదో ఆలోచిస్తుంటాడు. అప్పు వచ్చి నీకో గుడ్ న్యూస్ కూచి అంటుంది. ఎందుకు రాత్రి మాటలతలో వాయించావు ఇప్పుడేమో గుడ్ న్యూస్ అంటున్నావా పొట్టి అని అడుగుతాడు. నువ్వు ఎప్పుడు అన్నని మాటలు అనలేదు నన్ను తెలుసా..? అని బాధపడుతుంటే.. ఫీలయ్యావా.. కూచి మరి నువ్వు ఆటో నడపడం మానేసి రైటర్ గా ఎదగాలి అది సరే కానీ మీ వదిన మీ ఇంట్లోకి తిగిరి వెళ్తుందట తెలుసా..? అంటుంది. దీంతో కళ్యాణ్ అవునా నిజమా అంటూ హ్యాపీగా ఫీలవుతాడు. ఇంతకీ ఎప్పుడు వెళ్తుంది అని అడుగుతాడు. ఇంకా వెళ్లలేదు. ఇప్పటికైతే సగమే వెళ్లింది. ఇంకొద్ది రోజుల్లో మిగతా సగం వెళ్తుంది. అని అప్పు చెప్పగానే అదేంటి సగం అని డౌటుగా కళ్యాణ్ అడుగుతాడు. దీంతో అప్పు, తాతయ్య పెట్టిన పందెం గురించి చెప్తుంది. అయితే ఆ పందెం లో మా వదిన ఈజీగా గెలుస్తుందని నాకు నమ్మకం ఉందంటాడు కళ్యాన్.
ఇందిరాదేవి ఇంట్లో జరిగిన పందెం విషయం కనకానికి ఫోన్ చేసి చెప్తుంది. ఆమె మాటలు విన్న కనకం హ్యాపీగా ఫీలవుతుంది. ఇంతలో కావ్య వస్తుంది. ఎదురుగా వెల్లిన కనకం సంతోషంగా కావ్య పెద్దాయన ఏదో పందెం పెట్టారట కదా..? నువ్వు మళ్లీ ఆ ఇంట్లో అడుగుతుపెడుతున్నావట కదా.. అని అడుగుతుంది. అప్పుడే నీదాకా చేరిందా…? సమాచారం అంటూ కావ్య వెటకారంగా మాట్లాడుతుంది. అవునే పెద్దావిడే ఇప్పుడే ఫోన్ చేసి చెప్పింది. అయినా ఇలాంటి రోజు కోసమే నేను ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాను తెలుసా.? రేపు ఉదయం గుడికి వెళ్లి ఆ దేవుడికి వంద కొబ్బరికాయలు కొడతాను అని కనకం సంతోషంగా చెప్పగానే
కావ్య అప్పుడే వద్దని నేను ఇంకా పోటీలో గెలవలేదని అటు వైపు ఉంది మీ అల్లుడు గారు అంటూ కావ్య చెప్పబోతుంటే.. నాకు తెలుసు కావ్య నువ్వు ఏదైనా అనుకుంటే సాధించేవరకు వదిలిపెట్టవు. ఈ పందెంలో నువ్వు గెలుస్తావు నాకు ఆ నమ్మకం ఉంది అంటుంది కనకం. న్యాయం నీ వైపు ఉంది. నువ్వు ఆ దేవుడితోనైనా పోటీ పడి గెలుస్తావు అంటుంది. దీంతో కావ్య నీకేమైనా పిచ్చా అమ్మా.. అంటూ తిడుతుంటే.. నువ్వు ఎన్ని మాటలైనా అను.. ఏమైనా తిట్టు కానీ పందెంలో మాత్రం నువ్వే గెలవాలి. నీకేం కావాలో చెప్పు అన్ని నేను చేసి పెడతాను. నువ్వు గదిలొంచి బయటు రాకుండా పని చేసుకో అంటుంది కనకం. దీతో డిజైన్స్ కూడా నువ్వే వేస్తావా..? అని కావ్య అడగ్గానే ఫ్లోలో వేస్తాను అంటుంది కనకం తర్వాత అది తప్పా ఏదైనా చేస్తాను అంటుంది.
రుద్రాని, అనామికకు ఫోన్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసిన అనామిక హాయ్ ఆంటీ నీ వాటా ఆస్థి నీకు వస్తే ఏం చేయాలని, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని అడగడానికి నాకు కాల్ చేశారా..? అంటుంది. నువ్వు దూరంగా ఉండి నీ ప్లాన్స్ అన్ని సక్సెస్ అవుతున్నాయని బాగానే కల కంటున్నావు. కానీ ఇక్కడ నాకు ఆస్థి కాదు కదా ఆవగింజ కూడా దొరకడం లేదు అంటూ రుద్రాని కోపంగా చెప్తుంది. దీంతో ఏమైంది అంటీ ఇంతకీ ఏం జరిగింది. అని అనామిక అడగడంలో ఇంట్లో సీతారామయ్య పెట్టిన పందెం గురించి చెప్తుంది రుద్రాణి. అయితే ఈ పందెంలో ఎవరు గెలిచినా.. మనకే నష్టం అంటుంది అనామిక. ఆ డీల్ ఇచ్చిన కంపెనీ ఏదో చెప్పండి ఆంటీ ఆ ఢీలే క్యాన్సిల్ అయ్యేలా నేను చూస్తూను అని అడుగుతుంది. దీంతో కంపెనీ డీటెయిల్స్ చెప్తుంది రుద్రాణి. సరే ఆంటీ అంటూ నేను డీల్ సంగతి చూస్తాను. మీరు మాత్రం ఇంట్లో రగులుతున్న కుంపటి ఆరిపోకుండా చూడండి అని ఫోన్ కట్ చేస్తుంది. సరేనని వెళ్లి ధాన్యలక్ష్మీని మళ్లీ రెచ్చగొడుతుంది రుద్రాణి.
రాజ్ ఆఫీసుకు వెళ్తుంటాడు. ఎవ్వరూ పెద్దగా పట్టించుకోరు ప్రకాష్ ఏదో ముక్తసరిగా పలకరిస్తే రాజ్ కోపంగా బాబాయ్ అసలు నువ్వు నాకు బాబాయేనా..? అని అడుగుతాడు. ఎందుకు రాజ్ నాలాగా నీకు కూడా మతిమరుపు ఉందా.? అని అడుగుతాడు. ఆఫీసుకు వెళ్తున్నాను నన్ను విష్ చేయవా అని అడుగుతాడు. దీంతో ప్రకాష్ ఓ కావ్యను విష్ చేయాలి కదా.? అంటాడు మిగతా ఎవ్వరూ కూడా రాజ్‌ను విష్ చేయరు. రుద్రాణి మాత్రం రాజ్‌ను విష్ చేస్తుంది. దీంతో రాజ్ ఆఫీసుకు వెళ్తాడు. ఆఫీసుకు సరంజామాతో వస్తున్న రాజ్‌ను చూసిని శృతి ఈయన డిజైన్స్ వేయడానికి వస్తున్నాడా..? లేక యుద్దం చేయడానికి వస్తున్నాడా? అని మనసులో అనుకుంటుంది. శృతి దగ్గరకు వచ్చిన రాజ్ యుద్దం చేయడానికే వస్తున్నాను అని చెప్పడంతో శృతి షాక్ అవుతుంది. తర్వాత కావ్య వస్తుంది. ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరగుతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.