Brahmamudi serial today Episode: అపర్ణ కోసం రాజ్ కనకానికి ఫోన్ చేస్తాడు. అపర్ణ నేను ఎవరితో మాట్లాడను అంటుంది. దీంతో ఫోన్ కట్ చేస్తుంది. దీంతో సుభాస్ నీ పెళ్లానికి నువ్వు దూరంగా ఉండటం నీకు ఇష్టమేనేమో.. కానీ నా పెళ్లానికి దూరంగా ఉండటం నాకు ఇష్టం లేదు అంటాడు. దీంతో నువ్వే వెల్లొచ్చు కదా అన్నయ్యా.. రాజ్‌ను ఎదుకు ఇబ్బంది పెడుతున్నావు అని రుద్రాణి అడుగుతుంది. తప్పు చేసింది వాడైతే నేనెందుకు వెళ్లాలి అంటాడు సుభాష్. వీణ్ణి గారాబం చేసి నేనే చెడగొట్టాను అని అపర్ణ అంది. దీంతో రాజ్‌నే నేను నిజంగా అంద మొండితనం ఫొగరే ఉంటే కావ్యను సీఈవోను చేసినప్పుడు మేనేజర్ గా నేనెందుకు చేస్తాను. అని రాజ్ అడగ్గానే.. అందుకేగా పెళ్ళాన్ని ఇంట్లోంచి వెళ్లగొట్టావు అంటాడు సీతారామయ్య.
ఆ కావ్య ఇంటికి వచ్చి సంవత్సరం కాలేదు. అప్పుడే దాన్ని నెత్తిన పెట్టుకున్నారు. అంతకముందు నన్ను బాగానే చూసేవారు అంటాడు రాజ్. అనగానే అప్పుడు రాముడిలా బాగానే ఉన్నావు. ఇప్పుడే రాక్షసుడిలా మారిపోయావు అంటూ ఇందిరాదేవి తిట్టగానే అలా మారడానికి కారణం ఆ కావ్య కాదా..? అంటూ రుద్రాణి ప్రశ్నిస్తుంది. దీంతో రుద్రాణిని స్వప్న తిడుతుంది. నా చెల్లెలే అలా చేయాలనుకుంటే రాజ్ చేసిన తప్పును ఆఫీసులో అందరిముందు చెప్పి తనే సీఈవోగా ఉండేది అంటుంది. ఇంతలో అందరూ కలిసి నువ్వే వెళ్లాలి వెళ్లి మీ మమ్మీని తీసుకురావాలని చెప్పగానే రాజ్ సరేనని వెళ్తాడు. ఇందిరాదేవి, అపర్ణకు ఫోన్ చేసి రాజ్ వస్తున్నాడని చెప్తుంది.
రుద్రాణి టెన్షన్ గా అటూ ఇటూ తిరుగుతుంది. ఎందుకు మమ్మీ అలా టెన్షన్ పడుతున్నావు. రాజ్ వెళ్లినంత మాత్రాన కావ్య ను తీసుకొస్తాడా..? రాజ్ మొదటిసారి మనలా చీటింగ్ చేశాడు. కావ్య మీద గెలిచాడు. కావాలంటే చూడు వాళ్ల అమ్మను మాత్రమే తీసుకని వస్తాడు అని రాహుల్ చెప్పగానే.. రాజ్ వెళ్లి పిలిచినంత మాత్రాన మా వదిన వచ్చేస్తుందా..? కావ్యను తీసుకొస్తేనే నేను వస్తానని కండీషన్ పెడుతుందని రుద్రాణి అనగానే.. సరే మమ్మీ రాజ పిలవగానే కావ్య వస్తుందా..? అసలే మోసం గెలిచాడు అని కోపంగా ఉంది అంటాడు రాహుల్. కావ్య అలా రాదని తెలిసే మా వదిన ఇలా నాటకం ఆడుతుందిరా.. ఆ కావ్య మళ్లీ ఇంట్లో అడుగుపెడితే ఆస్థి ముక్కలు కాకుండా చూస్తూంది. ఏదో ఒకటి చేసి దాన్ని అడ్డుకోవాలని రుద్రాణి చెప్తుంది.
కనకం ఇంటికి వెళ్లిన రాజ్‌కు కావ్య ఎదురుపడుతుంది. చూసీ చూడనట్టు కావ్య వెళ్తుంది. ఎంత పొగరు అంటూ రాజ్ తిడతాడు. అది తూకం వేయించుకోవడానికే వెళ్తున్నాను అంటుంది. దీంతో రాజ్ కోపంగా కావ్యను వాళ్ల కుటుంబాన్ని తిడుతాడు. కావ్య కూడా రాజ్ కు స్ట్రాంగ్ కౌంటర్ వేస్తుంది. తర్వాత మా అమ్మను పిలువు తీసుకెళ్లాలి అంటాడు. మీరే వెళ్లి పిలవండి తీసుకెళ్లండి అని చెప్తుంది. నేను మీ ఇంట్లోకి వెళ్లను అంటాడు రాజ్. వెళ్లకపోతే మీ ఇష్టం అంటుంది. దీంతో మా అమ్మను ఇంట్లో దాచుకున్నది.. ఉన్నదంతా మీ అమ్మ దోచుకోవడానికి కాకపోతే ఇంకెదుకే.. మా అమ్మ తనంతట తానే మీ ఇంటికి వచ్చిందంటే నాకు అర్థం కాలేదనుకున్నావా..? అర్థం చేసుకోలేని చిన్న పిల్లాడిని అనుకున్నావా..? అంటాడు. అదంతా నాకు తెలియదు. అత్తగారు లోపలే ఉన్నారు. ఆవిడ వస్తానంటే తీసుకెళ్లండి. అని చెప్పి కావ్య వెళ్లిపోతుంది.
రాజ్ లోపలికి వెళ్లగానే కూరగాయలు కోస్తున్న అపర్ణను చూసి బాధపడతాడు. పక్కనే కనకం కుర్చీలో కూర్చుని కాఫీ తాగుతుంది. కనకం నువ్వు చెప్పినట్టే కూరగాయలు కోసేసాను ఇక లేవనా..? కాళ్లు పట్టేస్తున్నాయి అని అపర్ణ అడగ్గానే ఇంకొన్ని కట్ చేయమని కనకం చెప్తుంది. సరే కాస్త కాఫీ ఏమైనా ఇస్తావా..? అంటే లేదని కనకం అంటుంది దీంతో రాజ్ స్టాఫిట్ అంటూ లోపలికి వచ్చి అపర్ణను అక్కడి నుంచి లేపి కుర్చీలో కూర్చోబెట్టి గాలి విసురుతాడు. కనకాన్ని తిట్టి ఇంకా ఈ అవమానాలు పడుతూ.. ఇక్కడే ఉంటావా..? అని అడుగుతాడు. దీంత కనకం బాగానే చూసుకుంటుంది. పొద్దునే చద్దనంలో మజ్జిగ కూడా వేసింది. నంజు కోవడానికి ఆవకాయ కూడా ఇచ్చింది అని అపర్ణ చెప్తుంది. దీంతో రాజ్ కనకాన్ని తిడతాడు. అపర్ణను ఇంటికి రమ్మని వేడుకుంటాడు. కన్వీన్స్ చేయాలని చూస్తాడు. అపర్ణ మాత్రం రానని.. కావ్యను తీసుకొస్తేనే వస్తానని చెప్తుంది. రాజ్ వెళ్లిపోతాడు.
ఇంట్లో అందరూ రాజ్, అపర్ణల కోసం ఎదురుచూస్తుంటారు. ఇంతలో రాజ్ వస్తాడు. మీ అమ్మ వచ్చిందా..? ఎక్కుడుంది..? అంటూ సుభాష్ అడగ్గానే.. వాడి ముఖం చూడగానే అర్థం అవడం లేదా..? వాళ్ల అమ్మతో చివాట్లు పెట్టించుకుని వచ్చాడు అనగానే నేను తిట్లు తినలేదని.. ఆ కళావతినే తిట్టి వచ్చానని చెప్తాడు. మీరు మీ కళావతి మాయ నుంచి బయటకు రండి అని చెప్తాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.