Gundeninda GudiGantalu Today episode November 25 th: నిన్నటి ఎపిసోడ్ లో.. రోహిణికి యాక్సిడెంట్ అయ్యిందని ఎవరో చెప్పడంతో నేను ఇక్కడకు వచ్చాను అని సుగుణమ్మ రోహిణితో అంటుంది. ఈ ఫోన్ వ్యక్తి నెంబర్ ఇదిగో అని చూపిస్తుంది. ఆమె ఫోన్ తీసుకొని చూసిన ఆ ఫోన్ చేసిన వ్యక్తి దినేష్ అని తెలుసుకొని షాక్ అవుతుంది. వాడికి డబ్బులు ఇవ్వలేదని నన్ను ఇరికించాలని చూస్తున్నాడు అని అనుకుంటున్నాడు అని ఫీల్ అవుతుంది. వాడిని అస్సలు వదలను అని అంటుంది. నా బ్రతుకు నేను బ్రతుకుతున్న నన్ను దయచేసి ఇబ్బంది పెట్టకు అని రోహిణి కన్న తల్లికి మొహమాటం లేకుండా చెప్పేస్తుంది. ఆ మాట అనగానే సుగుణమ్మ బాధ పడుతుంది. కన్న కూతురు ఎలా ఉందో అని చూడటానికి కూడా రాకూడదు అంటే ఇక నేను బ్రతికి ఉన్నా వెస్ట్ అంటుంది. ఇక మీనా వారి మాటలు వినకపోడవంతో రోహిణి ఏదోటి చెప్పి కవర్ చేస్తుంది. తర్వాత చింటూ కోసం గారెలు తీసుకొచ్చావా అని తినమని ఇస్తుంది రోహిణి. ఉంటాను ఆంటీ అని వెళ్లిపోతుంది రోహిణి. తర్వాత రోహిణి మీకు ముందే తెలుసు కదా అని సుగుణను మీనా అడుగుతుంది. దానికి సుగుణ తెగ షాక్ అవుతుంది. అయితే, రోహిణి తనకు ఎలా తెలుసో చెబుతుంది. కానీ, రోహిణి తన కూతురు అని చెప్పకుండా ఏదో జస్ట్ పరిచయం ఉన్నట్లుగా చెప్పి కవర్ చేస్తుంది సుగుణ.. ఇక్కడకు వచ్చాకే తెలుసు. నాకెలా తెలుస్తుంది అని అంటుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మీనా మాత్రం వారిద్దరికీ ముందే పరిచయం ఉందని ఎలాగైనా బయట పెట్టాలి అనుకుంటుంది. బాలు దీపావళి పండుగను బాగా జరుపుకోవాలని ఇల్లంతా లైట్లతో నింపేస్తాడు. మీనా ఇంటి నిండా దీపాలు పెడుతుంది. సుశీల చూసి మనమరాలి పై ప్రశంసల వర్షం కురిపిస్తుంది. ఇక తర్వాత సత్యం ఫ్యామిలీ అంతా కలిసి దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. అందులో భాగంగానే అంతా కలిసి టపాసులు కాల్చుతుంటారు. వారంతా టపాసులు కాలుస్తుంటే పరాయి వాడిలా దూరం నుంచి చూస్తూ ఉంటాడు రవి. తన కుటుంబం అంతా కలిసి సంతోషంగా దీపావళి సెలబ్రేట్ చేసుకుంటుంటే తాను మాత్రం ఇంటికి దూరంగా ఉన్నందుకు చాలా బాధపడుతాడు రవి.. అదే బాధతో ఇంటికి వెళ్తాడు. ఇక శృతి బాధపడకు వాళ్లకు మనం ఇంకా నచ్చలేదు. అని ఫీల్ అవుతాడు. దానికి శృతి ఫీల్ అవ్వకు మనకు మనమే మన మొదటి పండుగను సెలెబ్రేట్ చేసుకుందాం అని అంటుంది. రవి శృతిలు దీపావళి బాంబులు కాలుస్తుంటే ఈ సంతోషాన్ని ఎలాగైనా దూరం చెయ్యాలని సంజు శృతిని కారుతో గుద్దేస్తాడు. దానికి శృతికి దెబ్బలు తగులుతాయి.
సత్యం ఫ్యామిలీతో పాటు రోహిణి కొడుకు చింటు కూడా టపాసులు కాలుస్తుంటాడు. అది చూసి మనోజ్ తెగ చిరాకుపడతాడు. వాడు ఎవడికి పుట్టాడో తెలియదు. కానీ, చూడు దర్జాగా ఇంటి మనవడిలాగా ఎలా కాలుస్తున్నాడో చూడు అని రోహిణి, ప్రభావతితో తన అక్కసు వెళ్లగక్కుతాడు మనోజ్. తర్వాత చింటు టపాసులు కాల్చేందుకు వెళ్తాడు. కానీ, వాడిపై ప్రభావతి అరుస్తుంది. రేయ్ పక్కకు తప్పుకోరా అని గద్దిస్తుంది.. ఇంతలో చింటు కళ్లలో టపాసుల నిప్పు రవ్వు పడుతుంది. దాంతో రోహిణి తెగ కంగారుపడిపోయి చింటూ అని వెళ్తుంది. రోహిణి తల్లి ప్రేమ బయటపడి చింటుని ఎత్తుకుని పక్కకు లాగుతుంది. అదంతా చూసి మనోజ్, ప్రభావతి, బాలు, మీనా ఒక్కసారిగా షాక్ అవుతారు. తర్వాత కింద కూర్చుని మంటగా ఉందా, కళ్లు మండుతున్నాయా, జాగ్రత్తగా ఉండాలి కదా అని చింటుతో చెబుతుంది రోహిణి.
సుగుణకు చింటూను అప్పచెప్పి పిల్లాడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి కదా అని అంటుంది. ఇక రోహిణి దగ్గరకు బాలు వెళ్లి పార్లరమ్మా నువ్వెందుకు అంత కంగారుగా పరిగెత్తావ్ అని అడుగుతాడు. దాంతో రోహిణి భయంతో కంగారుపడుతుంది. రోహిణి ఏం చెబుతుందా అని ప్రభావతి, మనోజ్ వేచిచూస్తారు. కానీ, రోహిణి మాత్రం కవర్ చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది. మొత్తానికి బాలుకు ఏదోకటి చెప్పి మ్యానేజ్ చేస్తుంది. ఇక చిన్న పిల్లలకు ఏమైనా అయితే తాను తట్టుకోలేనని, పిల్లలంటే తనకు ఇష్టమని, అందుకే అలా రియాక్ట్ అయి కంగారుగా పరుగెత్తానని రోహిణి కవర్ చేసుకుంటుంది. రోహిణి మంచితనతం చూసి ప్రభావతి, మనోజ్ మురిసిపోతారు. మొత్తానికి రోహిణి ఆలా సేఫ్ అయ్యింది. ఇక రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..